Jagananna Videshi Vidya Deevena Scheme: విద్యార్థుల భవితకు బంగారు బాట
అనంతపురం అర్బన్: ‘‘ఉన్నతమైన విద్యను అందించడం ద్వారా భావితరాలకు అమూల్యమైన ఆస్తిని ఇచ్చినట్లేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతుంటారు. ఆ దిశగా విద్యకు అత్యంత ప్రాధానతనిస్తూ పలు సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకం ద్వారా సువర్ణావకాశం కల్పిస్తున్నారు.’’ అని రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ ఎమ్.గౌతమి అన్నారు. సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపికై న విద్యార్థులకు ఫీజును కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.అనంతపురం కలెక్టరేట్ నుంచి మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ గౌతమి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన్ హరిత, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా మొదటి విడత కింద ముగ్గురు విద్యార్థులకు, రెండో విడత కింద ఇద్దరికి రూ.71,29,005 ఫీజు మంజూరు చేశారన్నారు. ఆర్థిక భారంతో పేదలు ఉన్నత విద్యకు దూరం కాకూడదనేదే ముఖ్యమంత్రి ఉద్దేశమ న్నారు. కార్పొరేట్‌కు ఽధీటుగా పేదలకూ నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా కేజీ నుంచి పీజీ వరకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని విధంగా విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. నాడు–నేడు ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చారన్నారు. విద్యాభివృద్ధికి అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేస్తున్నారన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ‘జగనన్న వీదేశీ విద్యాదీవెన పథకం’ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ‘‘ఆల్ ద బెస్ట్’’ చెప్పారు. విదేశాల్లో చదువు పూర్తైన తరువాత ఇక్కడికే వచ్చి దేశానికి, ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మెగా చెక్ విడుదల చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్‌రావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, డీటీ డబ్ల్యూఓ అన్నాదొర, విద్యార్థులు పాల్గొన్నారు.
Jagananna Videshi Vidya Deevena: పేదలకు విదేశీ విద్యాదీవెన వరం
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ సువర్ణావకాశం జిల్లాలో ఐదుగురికి రూ.71.29 లక్షలు మంజూరు మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ గౌతమి లబ్ధిదారులతో కలిసి మెగా చెక్ విడుదల రూ.21.65 లక్షలు మంజూరు చేశారు
మాది మధ్యతరగతి కుటుంబం. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా అమ్మాయి శ్రీప్రియ యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్‌గోలో ఎంఎస్ (కార్డియో వస్క్యూలర్) మొదటి సంవత్సరం చదువుతోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కింద రూ.21,65,665 ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేశారు. మొదటి విడతగా రూ.10,82,833 అందించారు. పేద వర్గాల పిల్లలు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన సీఎంకు ధన్యవాదాలు.
– ఉమామహేశ్వరి, శ్రీనివాసులు, పామిడి మండలం
సీఎంకు రుణపడి ఉంటా
లండన్‌లో ఆర్ట్స్ అండ్ డిజైనింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద రూ.39,38,256 ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేశారు. మొదటి విడతగా రూ.9.84 లక్షలు అందించారు. పేద వర్గానికి చెందిన మాలాంటి వారికి ఆర్థిక సాయం అందించి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.
– చిన్న కందుకూరి సనీల్ రాజా అమీన్, గుత్తి మండలం, గుత్తి ఆర్‌ఎస్
నెదర్లాండ్‌లో చదువుతున్నా
మాది మధ్య తరగతి కుటుంబం. మా తండ్రి కుంబాల రంగస్వామి వ్యవసాయం చేస్తారు. పనులు లేనిసమయంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాకు విదేశాల్లో చదవాలని బలమైన కోరిక ఉండేది. అయితే మా తండ్రి ఆర్థిక పరిస్థితి చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంతలోనే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం గురించి విని దరఖాస్తు చేశా. పీహెచ్‌డీలో మొదటి ర్యాంకు సాధించిన కారణంగా నాకు నెదర్లాండ్‌లోని వేజ్నింజేన్ యూనివర్సిటీ అండ్ రిసెర్చ్‌లో ప్లాంట్ సైన్స్ చదివే అవకాశం వచ్చింది. జగనన్న బటన్ నొక్కగానే రూ.8,77,547 నగదు నా బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. అందుకు కృతజ్ఞతలు. విద్య పూర్తవగానే మన దేశంలోనే సేవ చేస్తానని జగనన్నకుమాట ఇచ్చా. నిలబెట్టుకుంటా. – కుంబాల విక్రమ్