Skip to main content

Tenth Class & Inter: ‘ఓపెన్‌’ స్కూల్‌ ప్రవేశాలకు చివ‌రి తేదీ ఇదే

ఎదులాపురం: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సుల్లో ప్రత్యేక ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు.
deadline for open admissions is till 30th of this month

 న‌వంబ‌ర్ 16 నుంచి 30 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పదో తరగతి ప్రవేశ ఫీజు ఓసీ పురుషులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పురుషులకు, అశక్తత, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలందరికీ రూ.1000తో పాటు అందరికీ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.150, ఆఫ్‌లైన్‌ చార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు.

చదవండి: Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

ఇంటర్‌ ప్రవేశాలకు ఓసీ పురుషులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పురుషులకు, అశక్తత, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలందరికీ రూ.1200తో పాటు అందరికీ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.300, ఆఫ్‌లైన్‌ చార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు.

ప్రవేశం పొందగోరు అభ్యాసకులు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం, వెబ్‌సైట్‌ www. Telanganaopenschool. org లో ఆన్‌లైన్‌ ఫారం పూర్తిచేసి డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా అడ్మిషన్‌ ఫీజు చెల్లించి, సంబంధిత అధ్యయన కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు. అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు (ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లు), విద్యాశాఖాధికారులు సిబ్బంది విస్తృత ప్రచారం చేసి అధిక సంఖ్యలో అభ్యాసకులు ప్రవేశం పొందేలా కృషి చేయాలని డీఈవో కోరారు.
 

Published date : 17 Nov 2023 10:41AM

Photo Stories