Skip to main content

UPSC Civils Ranker Ashrita Success Story : ఓట‌మి.. ఓటమి.. చివ‌రికి విజ‌యం ఇలా.. కానీ ల‌క్ష్యం మాత్రం ఇదే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) నిర్వ‌హించే.. సివిల్స్‌లో స‌క్సెస్ అవ్వాలంటే.. అనుకున్నంత ఈజీ కాదు. దీని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాలి. ఒక్కొక్క సారి ఎంత క‌ష్ట‌ప‌డి చ‌దివిన‌ ఓట‌మి ఎదుర్కొన త‌ప్ప‌దు.
 UPSC Civil AIR 315 Ranker Ashrita Success Story in Telugu
UPSC Civil Ranker Ashrita Success Story

ఈ ప్ర‌య‌త్నంలో ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్లితే.. ఎదో ఒక రోజు విజ‌యం మీ సొంతం అవుతుంది. స‌రిగ్గా ఈ యూపీఎస్సీ సివిల్స్ ర్యాంక‌ర్‌.. స్టోరీ ఇలాగే ఉంటుంది. 

☛ UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

ఈమె మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ప్రయత్నం ఆపలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. అదే విశ్వాసంతో, సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కొనసాగించి.., యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 315 ర్యాంకు సాధించింది. ఆమె మరెవరో కాదు. విశాఖ నగరానికి చెందిన నౌపడ ఆశ్రిత. ఈ నేప‌థ్యంలో ఆశ్రిత స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం : 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖపట్నంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది ఆశ్రిత. తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి గృహిణి. 

ఎడ్యుకేష‌న్ : 

UPSC Civil Ranker Ashrita Success Story Telugu

ఆశ్రిత.. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖ నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉన్న హరగోపాల్‌ స్కూల్లో జరిగింది. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదివింది. ఆ తరువాత ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది.

☛ IAS Officer Inspirational Story : నా చిన్న‌ప్పుడే నాన్న మ‌ర‌ణం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. అమ్మ కోస‌మే కలెక్టర్ అయ్యానిలా..

కోవిడ్‌ కారణంగా కోచింగ్‌ మధ్యలోనే..
ఆశ్రిత.. 2019లో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరింది. అక్కడి నుంచి సివిల్స్‌ ర్యాంక్‌ సాధన వరకు తన ప్రయాణాన్ని సాక్షికి ఆశ్రిత తెలిపింది. ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నపుడే సోషల్‌ వర్క్‌ పట్ల ఆసక్తి పెరిగింది. సివిల్స్‌ కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లా. కోవిడ్‌ కారణంగా కోచింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నా. ఇంటి దగ్గరే చదివి, రెండు సార్లు సివిల్స్‌ రాశాను. కానీ ప్రిలిమ్స్‌ కూడా అర్హత సాధించలేకపోయా. ఈసారి పట్టుదల పెరిగింది. అలాగే మ‌రింత క‌సిగా చ‌దివా.

➤☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

నా ల‌క్ష్యం ఐఏఎస్‌..

UPSC Civil Ranker Ashrita Success

మరోసారి రాసేందుకు కోచింగ్‌ తీసుకుని.. 2022లో సివిల్స్‌ మూడో అటెంప్ట్‌ చేశా. తాజాగా విడుదలైన ఫలితాల్లో 315వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు జనరల్‌ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు. అందుకే మరోసారి ర్యాంకు మెరుగుగైన ర్యాంకు కోసం మే 28న జరిగిని సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు హాజరయ్యాను. మా తల్లితండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళిక, అధ్యాపకులు శిక్షణ తననీ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపింది.

☛ Success Story: కోటి జీతాన్ని వ‌దులుకుని.. తొలి ప్రయత్నంలో ఐఏఎస్‌

☛ Inspirational UPSC Civils Ranker Success Story : నా అంగ‌వైకల్యం నా శ‌రీరానికే.. నా ల‌క్ష్యానికి కాదు.. ఈ క‌సితోనే సివిల్స్ కొట్టానిలా..

➤☛ ఇలాంటి ఎన్నో స‌క్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి

Published date : 21 Jun 2023 03:49PM

Photo Stories