నాడు డాక్టర్...నేడు కలెక్టర్
కష్టాలకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. కలెక్టర్ అనే దర్పం లేకుండా.. అందరితో కలిసిపోతున్నారు. ప్రజాసేవకే అంకితమవుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు.
డాక్టర్ వృత్తిని వదులుకుని...
డాక్టర్ వృత్తిని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఐఏఎస్ వైపు అడుగులు వేశారు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన ఉన్నత విద్య అనంతరం ఎంబీబీఎస్ చేశారు. డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో చికిత్స కోసం వచ్చే పేదల కష్టాలను చూసి ఐఏఎస్ కావాలని నిర్ణరుుంచుకున్నారు. ఆ వృత్తిని వదులుకుని ఐఏఎస్‌కు శిక్షణ పొందారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. శిక్షణ ముగించుకున్న తరువాత జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ పొందారు.
మూడు పోస్టుల్లో..
చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నారాయణ భరత్ గుప్త ప్రస్తుతం ఇదే జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, అనంతరం జిల్లా జారుుంట్ కలెక్టర్‌గా, శ్రీశైలం ఈఓగా, రాష్ట్ర పవర్ కార్పొరేషన్ శాఖలో విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 6న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడు పోస్టుల్లో పనిచేసిన ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది.
{పాణాలను సైతం లెక్క చేయకుండా...
కలెక్టర్ అనే దర్పం లేదు. అందరితోనూ కలిసిపోయే స్వభావం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, మృధు స్వభావిగా భరత్‌గుప్త పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. జిల్లా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఆయన నిరంతరం క్షేత్రస్థారుులో పర్యటిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారు.