కలెక్టర్ ముత్యాల రాజు స్ఫూర్తితో.. సివిల్స్ వైపు...
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 2007 బ్యాచ్‌సివిల్స్ టాపర్ ముత్యాల రాజు తనకు స్ఫూర్తి అని సివిల్స్ ర్యాంకర్ గోవిందపల్లె రవికాంత్ అన్నారు. సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంక్రావడం ఆనందంగా ఉందన్నారు. రోజూ 10 గంటలు చదివానని, మధ్యలో రిలాక్స్ కోసం ధ్యానం చేసేవాడినన్నారు. అమ్మ కృపమ్మ, నాన్న రాజు ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు.
కుటుంబ నేపథ్యం:
రవికాంత్ తండ్రి రాజు రిటైర్డ్ కానిస్టేబుల్, తల్లి కృపమ్మ హెల్త్ సూపర్ వైజర్. స్థానిక జ్ఞానాపురంలోని వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్నారు.
ఎడ్యుకేషన్:
రవికాంత్ ఎన్‌జీఓ కాలనీలోని గుడ్‌షప్పర్డ్ స్కూల్‌లో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, వరంగల్‌లోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఉద్యోగానికి రాజీనామ చేసి సివిల్స్ వైపు...
సివిల్స్‌లో ర్యాంకు సాధించడానికి ఏడాది పాటు హైదరాబాద్‌లోని రెండు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. అనంతరం నెల్లూరులో ఓ ప్రై వేట్‌కంపెనీలో ఏడాది ఉద్యోగం చేసి మళ్లీ సివిల్స్ రాయడానికి రాజీనామా చేశారు. సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ప్రతిభ చూపినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. దీంతో మళ్లి ఆయన మరింత పట్టుదలగా చదివి ప్రస్తుతం 905 ర్యాంకును సాధించారు.

Published date : 16 Nov 2020 07:15PM