లారీడ్రైవర్ కావాలన్న ఆకాంక్షే ఐపీఎస్‌ను చేసిందిలా...
మారుమూల ప్రాంతంలో పుట్టాను. దారిద్య్రంలో పెరిగాను. బానిస బతుకులను వెళ్లదీసే సమయంలో నా తల్లి నన్ను చదివించింది.
బానిస బతుకు వెళ్లదీస్తున్న కుటుంబం నుంచి వచ్చిన నాకు..
చదివే సమయంలో నా తల్లి పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించింది. వెంటనే లారీ డ్రైవర్‌ను అవుతానని చెప్పారు. సమాధానమిచ్చానో లేదో నా చెంప చెళ్లుమంది. లారీ డ్రైవర్ అయ్యేందుకేనా చదివించేది అంటూ ఇంటి నుంచి బయటకు తోసేసింది. అప్పటి నుంచి కసితో సాంఘీక గురుకుల విద్యాలయాల్లో ఉంటూ విద్యను అభ్యసించాను. నా తల్లి ఆశించిన ఐపీఎస్‌ను సాధించాను. ఇదంతా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పెట్టిన భిక్ష. దొర దగ్గర బానిస బతుకు వెళ్లదీస్తున్న కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రజలకు సేవ చేసే అధికారం వచ్చిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. అవి లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు.
ఐపీఎస్ అయ్యేవాడినే కాదు...కానీ
వసతి గృహాల్లో ఉండి చదువుకోకుంటే ఐపీఎస్ అయ్యేవాడినే కాదు. అందుకే విద్యార్థులందరూ వసతి గృహాల్లో చేరండి. హాస్టల్స్‌లో చేరిన ప్రతి ఒక్కరూ నాలా కాకుంటే నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’’ అని చెప్పారు.