ఎలాంటి కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ...
Sakshi Education
పట్టుదల, కృషి తోడుంటే ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని మరోసారి నిరూపితమైంది.
ఏకాగ్రతతో చదివితే సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు కూడా ఎలాంటి కోచింగ్ అవసరం లేదని రుజువైంది. యూపీఎస్సీ విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 93 వ ర్యాంకు సాధించిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురే ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి హర్షం వ్యక్తం చేశారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ దేనికీ ఐశ్వర్య కోచింగ్ తీసుకోలేదని, దేశవ్యాప్తంగా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందని అజయ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని పేర్కొన్నారు. ఆమె విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగిందని అజయ్‌కుమార్ తెలిపారు.
Published date : 08 Oct 2020 12:16PM