Skip to main content

ఆటో డ్రైవర్ కొడుకుకు సివిల్స్ కోచింగ్ అవసరమా..? అంటూ గేలి..: రూపేశ్ చెన్నూరి

కల సాకారం చేసుకున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులే మంచి ఉదాహరణ. సివిల్స్ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్‌నెట్ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు.
తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటారుుంచింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్ మహాజన్, బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్ చెన్నూరి...అంతా లోకల్ బ్యాచ్. వీరిలో అఖిల్ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది.

ఏనాడూ నా లక్ష్యాన్ని మర్చి పోలేదు..
మాది వరంగల్ జిల్లా హసన్‌పర్తి. నాన్న ఆటోడ్రైవర్, హసన్‌పర్తి జెడ్పీ హెచ్‌ఎస్ స్కూల్‌లో చదివాను. 2013లో వరంగల్ కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. తరువాత ఒక సంస్థలో ఉద్యోగం చేశాను. కానీ, ఏనాడూ నా లక్ష్యాన్ని మర్చి పోలేదు. ఆటోడ్రైవర్ కొడుకు ఐపీఎస్ చదవడమేంటని ఎంత మంది అనుకున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
-రూపేశ్ చెన్నూరి
Published date : 07 Sep 2020 05:14PM

Photo Stories