Skip to main content

IPS Training : 195 మంది ఐపీఎస్‌లు.. 105 వారాలపాటు శిక్షణ.. అట్టహాసంగా ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : హైదబాద్‌లోని వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 74 వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన (శనివారం) అట్టహాసంగా ప్రారంభమైంది.
central home minister Amit Shah
IPS Training

ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.  ఈ మేరకు అమిత్‌ షా ఆ పరేడ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  అక్కడ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అమిత్‌ షా గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. "ట్రైనీ ఐపీఎస్‌లకు అభినందనలు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు.  రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాదు టెక్నీలజీతో ​కూడిన పోలీస్‌ మేనేజ్‌మెంట్‌ ‍మరింతగా అందుబాటులోకి వస్తుంది కూడా.

శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదు..

central home minister Amit Shah

అలాగే 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టాం. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నా. ఐతే శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడుకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల వరకు ఆ అధికారం ఉంటుంది. రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది. ప్రతీ ఐపీఎస్‌ తన బాధ్యతను గుర్తించుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమాస్యలు ఉండేవి.  అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశాం. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదు." అని అమిత్‌ షా నొక్కి చెప్పారు.

195 మంది ఐపీఎస్‌లు..

ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్‌ ఔట్‌డోర్‌ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్‌ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్‌, మెడికల్‌, సీఏ స్టూడెంట్స్‌ అధికంగా ఉండటం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన ప్రోబేషనరీ ఐపీఎస్‌లకు ట్రోఫీలు అందజేస్తారు. పరేడ్‌ అనంతరం 11 నుంచి 12 గంటల సమయంలో అధికారులతో అమిత్‌ షా భేటీ కానున్నారు.

Published date : 11 Feb 2023 01:06PM

Photo Stories