Skip to main content

Keerthi Jalli : సాధారణంగా ఐఏఎస్‌.. అసాధార‌ణ నిర్ణ‌యాలతో ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో..

సాధారణంగా ఐఏఎస్‌ ఆఫీసర్‌ అంటే ఏమనుకుంటాం.. పైనుంచి ప్రభుత్వ విధానాల అమలు పరిధిని మాత్రమే చూసుకుంటూ తగిన సూచనలు చేసేవారనే అనుకుంటాం.
Keerthi Jalli, IAS
Keerthi Jalli, IAS

ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం వీరి సొంతమైనా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మేము సైతం’ అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వీరు వెనుకడుగు వేయరు.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

ఈ ఐఏఎస్ మట్టి, బురద, నీరు అనేది చూడకుండానే..

keerthi jalli ias biography


అచ్చం అలానే అస్సాంకి చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్న తరుణంలో మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ కీర్తి జల్లి స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్‌గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఆమె.. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఐఏఎస్‌ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం విశేషంగా ఆకట్టుకుంది. నిజంగానే ఆమె మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

Success Story: అప్పులు చేసి ఐపీఎస్ చదివించారు.. కానీ..

ఇంతకీ ఎవ‌రు ఈ ఐఏఎస్‌ ఎవరు?

keerthi jalli ias family


ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి జల్లి పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు కీర్తి జల్లి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్న చేస్తున్నారు నెటిజన్లు. కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

ఎడ్యుకేష‌న్ : 

IAS Story


2011లో బి.టెక్‌ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐఏఎస్‌ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ ఐఏఎస్‌కు వెళ్లలేదు. పైగా చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయడం గురించి బంధువుల ఆలోచనలు ఉండేవి. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కుమార్తెను ఐఏఎస్‌ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఇందిరా గాంధీ వంటి ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్‌ కోచింగ్‌లో చేర్పించారు. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది.

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డు..

keerthi jalli ias award


ఐఏఎస్ ట్రైనింగ్‌ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్‌హట్‌ జిల్లాలోని తితబార్‌ ప్రాంతానికి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఓటింగ్‌ శాతం పెంచేందకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎలక్టొరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డ్‌’ దక్కింది.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

ఈ సమస్య‌ల‌కు చెక్‌..

IAS Success Story


2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం  విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా..

keerthi jalli ias


ఇక అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్‌వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్‌ ప్రధాన్‌’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్‌ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్‌ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది.

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

వివాహాం ఇలా చేసుకున్నారు..

keerthi jalli marriage


గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబర్‌ మొదటివారంలో అస్సాంలోని ‘కచార్‌’ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ అయిన ‘సిల్‌చార్‌’లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పంపింది కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌ కీర్తి జెల్లి. ‘మా ఇంట్లో సెప్టెంబర్‌ 10న వినాయకపూజ ఉంది. రండి’ అని ఆ ఆహ్వానం సారాంశం. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి జెల్లి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక తమలాగే మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం వినాయక పూజకు మాత్రమే కాదనీ కీర్తి జెల్లి వివాహానికి అని అక్కడకు వెళ్లాకగాని వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు..

IAS Success Story: మారుమూల పల్లెటూరి యువ‌కుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..

జూమ్‌’ ద్వారా ఈ వివాహాంను మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నారు కనుక కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. పెళ్లికి కీర్తి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు.

పెళ్లైన మరుసటి రోజే..

Covid


2020 మే నెల నుంచి కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్‌ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్‌చార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్‌ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్‌ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి.

Success Story: అమ్మ కోరిక ఐఏఎస్.. కోచింగ్ లేకుండానే 24 ఏళ్ల‌కే కొట్టానిలా..

Published date : 27 May 2022 04:58PM

Photo Stories