Doctor to Collector: డాక్టర్ నుంచి కలెక్టర్‌గా మారిన యువతి..
చననిరుపేదల కష్టాలను కళ్లారా చూసి, వారు పడుతున్న కష్టాల్ని చూసి తెలుసుకొని వారికి తగిన వసతులను అందించాలనే ఆలోచనలోనే తాను సివిల్స్ సాధించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు ఆలిండియా సివిల్స్ ర్యాంకర్ దీప్తి చౌహాన్. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలకేంద్రానికి చెందిన ఆమె ఎంబీబీఎస్ చదివి సివిల్స్ వైపు మళ్లారు. 2020లో యూపీఎస్‌సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో ర్యాంకును కోల్పోయారు. నాలుగోసారి ప్రయత్నించి ఆలిండియా 630వ ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను 'సాక్షి'తో పంచుకున్నారు.
Civils Top Rankers: సివిల్స్‌లో ర‍్యాంకు సాధించి ప్రధాని ప్రశంసలు అందుకున్న విద్యార్థులు వీరే..
సివిల్స్ ప్రయాణం..
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలకేంద్రానికి చెందిన దీప్తి చౌహాన్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కిషన్‌లాల్ వనపర్తి జిల్లా పెద్దమందడి ఏపీజీవీబీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి చంద్రకళ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. దీప్తి తన చిన్నతనం నుంచి పదో తరగతి వరకు గద్వాలలోని విశ్వభారతి హైస్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశారు. 2012లో ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుండగానే అక్కడి పరిస్థితులను చూసి నెమ్మదిగా తన లక్ష్యాన్ని సివిల్స్ వైపు మార్చుకున్నారు. నాలుగేళ్ల పాటు శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
Success as Collector: కలెక్టర్‌గా ఘన విజయం సాధించిన గిరిజన విద్యార్థి
పేదల కష్టాలను చూసి..
'ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజనులే ఎక్కువగా వచ్చేవారు. వారిలో చాలా మందికి కనీసం చెప్పులు కూడా ఉండేవి కావు. వారిని చూశాకే ఇలాంటి వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. డాక్టర్‌గా కన్నా కలెక్టర్ అయితే విస్త్రృతంగా సేవలు అందించవచ్చని అనుకున్నాను. పేదలకు ఆరోగ్యం, చదువు అందించడంలో నా శక్తి మేరకు కృషి చేస్తాను' అని దీప్తి చెబుతున్నారు.
Civils Inspirational Journey: చిన్నప్పటి ఆశయం.. సివిల్స్‌లో విజయం
నాలుగో ప్రయత్నంలో విజయం..
ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్‌లో ఉండగానే నా ఆలోచనను తల్లిదండ్రులతో పంచుకున్నాను. వారు నన్ను ఎంతో ప్రోత్సాహించారు. 2020లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే 15 మార్కుల తేడాతో ర్యాంకును కోల్పోయాను. కాని, నేను వెనకడుగు వేయకుండా మళ్ళీ నాలుగోసారి ప్రయత్నించి ర్యాంకు సాధించాను. ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలను అడిగారు.
Young Man in Civils: బస్సు కండక్టర్ కుమారుడికి టీఎస్ఆర్‌టీసీ ఎండీ అభినందనలు.. కారణం?
ప్రత్యేకించి మిషన్ భగీరథ పథకం ప్రాముఖ్యత గురించి, పనితీరు గురించి వివరించమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలతో పాటు హైదరాబాద్‌లో ఏర్పాటైన ఐటీ హబ్ పనితీరు గురించి ప్రశ్నలను అడిగారు. లక్ష్యం ఏదైనా స్పష్టంగా ఉండాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమని సివిల్స్ ఆశావహులకు సూచించారు.