IAS Officer Success Story : ఐఏఎస్ లక్ష్యం ఉన్న వారు.. ఈయన స్టోరీ చదివితే..
కోచింగ్ తీసుకోవాలని లేకపోతే సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించడం అసాధ్యమని కూడా చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక బలమైన సంకల్పం, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు టీ అమ్మే వ్యక్తి. ఒకప్పుడు పూట గడవక టీ అమ్మిన హిమాన్షు గుప్తా అనే యువకుడు.. నేడు ఐఏఎస్ అధికారి అయ్యి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంకు గురిచేస్తున్నారు.
Divya Mittal, IAS : ఈ ఐఏఎస్ పాఠాలు.. మీకు పనికొస్తాయ్.. ఈ స్టోరీ చదివితే..
ఈతను సివిల్స్ సాధించడానికి పడిన..
యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ అభ్యర్థులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అయితే యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి హిమాన్షు పడిన కష్టాలు వర్ణనాతీతం. అతను మూడుసార్లు పరీక్షకు హాజరైతే.. మొదటి రెండు ప్రయత్నాలలో ఫెయిలయ్యారు. అయినప్పటికీ ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు హిమాన్షు మరోమారు ప్రయత్నించారు. చివరి ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యారు. యూపీఎస్‌సీ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2019లో 304వ ర్యాంక్ సాధించి తన చిరకాల కలను నిజం చేసుకున్నారు.
Anwesha Reddy IAS Success Story : అమ్మ మాటను నిలబెట్టా.. అనుకున్నది సాధించి కలెక్టర్ అయ్యానిలా..
కుటుంబ నేపథ్యం :
హిమాన్షు తండ్రి చిన్న టీ స్టాల్ తెరిచి రోజువారీ కూలీగా కుటుంబాన్ని పోషించేవారు. అతని చాలీచాలని జీతం వల్ల హిమాన్షు తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
సొంతంగా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడిలా..
అయితే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా యూపీఎస్‌సీ పరీక్షలో విజయం సాధించాలనే లక్ష్యంతోనే హిమాన్షు ఉండేవారు. అతను టీ స్టాల్‌లో కూర్చుని ప్రతిరోజూ వార్తాపత్రికలు చదివేవారు. ఢిల్లీకి వెళ్లే ఇతర విద్యార్థుల మాదిరిగా కాకుండా హిమాన్షు డిజిటల్ నోట్స్, వీడియోల ద్వారా సొంతంగా ఎగ్జామ్‌కు ప్రిపేర్ కావాలనుకున్నారు. తన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే నిశ్చయంతో చేసిన హిమాన్షు కృషి ఎట్టకేలకు విజయవంతమైనంది.
కుటుంబ పోషణ కోసం..
హిమాన్షు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాలలో తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. కాలేజీ తర్వాత ఉద్యోగం వచ్చినప్పటికీ, అతను భారతదేశంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ కళాశాలలో రీసెర్చ్ స్కాలర్‌గా చేరారు. రీసెర్చ్ స్కాలర్‌గా జాయిన్ అయ్యాక స్టైఫండ్ సంపాదించగలిగానని.. అది తనకు ఎంతగానో సహాయపడిందని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా, పరీక్షకు సిద్ధమయ్యే విద్యా వాతావరణాన్ని కూడా అందించిందని తెలిపారు.
UPSC Civils Results 2022: పరీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..
మొదటి ప్రయత్నంలోనే..
ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే పూర్తి దృఢ సంకల్పం ఉండాలని హిమాన్షు చెబుతున్నారు. మొదటి ప్రయత్నంలో ఎక్కువ మార్కులు రాక తక్కువ ర్యాంకుకే సరిపెట్టుకున్నారు హిమాన్షు ఇండియన్ రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం సంపాదించగలరు. కానీ ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందలేదు. 2019లో గొప్ప స్ట్రాటజీతో ప్రిపరేషన్ మొదలుపెట్టి పరీక్షలో 304వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు.
ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా..
మీరు ఎక్కడి నుంచైనా పరీక్షకు సిద్ధం కావచ్చని హిమాన్షు చెబుతున్నారు. యూపీఎస్‌సీ లేదా ఎంతటి కఠినమైన పరీక్షకు సిద్ధం కావలన్నా పెద్ద నగరానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు ఐఏఎస్ హిమాన్షు గుప్తా ట్రాక్ రికార్డ్ నుంచి నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా విజయాన్ని సాధించవచ్చు. మీరు ఏం సాధించాలో మనస్ఫూర్తిగా నిశ్చయించుకుని.. దానిపై దృష్టి కేంద్రీకరించి, అలుపెరగని కృషి చేస్తే విజయం సాధించడం సాధ్యమవుతుందని హిమాన్షు తెలిపారు.
TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..