Skip to main content

Civils Achievement: సివిల్స్‌లో సాధించిన ఇద్దరు యువకులు.. ఇదే వారి ప్రయాణం

ఒక గమ్యాన్ని చేరాలంటే అందుకు తగ్గిన కృషి పట్టుదల ఉండాలి. ఒక ప్రయత్నంలో చేరలేకపోయినా తట్టుకోగలిగే శక్తి ఉండాలి. సివిల్స్‌లో సాధించడం అందరి తరం కాదు. అందుకు ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. కొందరు ఒకటో రెండో ప్రయత్నాలలో సాధిస్తే, మరి కొందరు పలు ప్రయత్నాలలో సాధిస్తారు. ఇందులోని వారే ఈ ఇద్దరు యువకులు.. వీరి ప్రయాణం ఎలా సాగిందో, వారికి కలిగిన ఆనందం ఎలా ఉందో తెలుసుకుందాం..
Successful journey in achieving rank at all over India

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఆవుల లక్ష్మయ్య సునీత దంపతుల పెద్ద కొడుకు సాయికృష్ణ 94వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన ఏనుగు శివ మారుతిరెడ్డి 132వ ర్యాంకు సాధించగా, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

పట్టువదలని సాయికృష్ణ..

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఆవుల లక్ష్మయ్య- సునీత దంపతులకు ఇద్దరు కొడుకులు సాయికృష్ణ, వంశీకృష్ణ. వీరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి కాగా, లక్ష్మయ్య సుల్తానాబాద్‌ మండలంలోని పూసాల ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్ద కొడుకు సాయికృష్ణ చిన్నతనం నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. కరీంనగర్‌లోని పారమిత స్కూల్లో పదో తరగతిలో 91 శాతం మారులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్‌ నారాయణ కాలేజీలో చదివి 86.7 శాతం మారులు సాధించాడు.

Collector Successful Duties: క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌ల‌తో పాటు త‌ల్లిగా కూడా అంద‌రికీ ఆదర్శం..!

2015లో వరంగల్‌లోని నిట్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలోని వాజిరామ్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలో ర్యాంకు సాధించలేక పోయాడు. 2017లో 728వ ర్యాంకు సాధించాడు. ఈ క్రమంలో ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా పట్టుదలతో ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సివిల్స్‌ వైపు దృష్టి సారించి ఆరో ప్రయత్నంలో 94వ ర్యాంకు సాధించాడు. మరి, చిన్న కొడుకు వంశీకృష్ణ బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నాడు.

పట్టుదల ఉంటే సాధించలేదని లేదు..

పట్టుదల, ప్రణాళికతో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీలేదు. అందుకు నేను సాధించిన ర్యాంకే నిదర్శనం. 728వ ర్యాంకు సాధించిన తర్వాత పట్టుదలతో ముందుకు సాగి ఆరోసారి ప్రయత్నంలో 94వ ర్యాంకు సాధించా. ఇందులో నా తల్లిదండ్రులు సహకారం ఎంతో ఉంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. సివిల్స్‌లో ముందుకు సాగుతూ దేశానికి సేవచేయాలన్నదే నా లక్ష్యం.
– ఆవుల సాయికృష్ణ, సివిల్‌ ర్యాంకర్‌

Civils Top Rankers: సివిల్స్‌లో ర‍్యాంకు సాధించి ప్రధాని ప్రశంసలు అందుకున్న విద్యార్థులు వీరే..

సంతోషం వ్యక్తం చేయలేనిది..

100లోపు ర్యాంకు సాధనే లక్ష్యంగా పెట్టుకొని మా పెద్ద కొడుకు చాలా కష్టపడి చదివాడు. ఆ చదువుకు తగినట్లు, తను పడిన కష్టానికి ఫలితంగా తనకు 94వ ర్యాంకు రావడం చాలా సంతోషం. ఆ ఆనందాన్ని మా మాటల్లో చెప్పలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సివిల్స్‌ చదువుతూ వస్తున్నాడు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది.

– ఆవుల లక్ష్మయ్య, సునీత, తల్లిదండ్రులు

రెండో ప్రయత్నంలోనే శివమారుతిరెడ్డి

అయిలాపూర్‌కు చెందిన ఏనుగు అంజిరెడ్డి, పుష్పలత దంపతుల కొడుకు శివ మారుతిరెడ్డి. చిన్న నాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. మల్లాపూర్‌ మండలం గుండంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా అంజిరెడ్డి విధులు నిర్వహిస్తుండగా, తల్లి పుష్పలత వ్యవసాయ పనులు చూసుకుంటున్నది. అంజిరెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో పెద్ద కూతురు అంజనీరెడ్డికి వివాహం జరిగింది. చిన్న కూతురు అంజలారెడ్డి హైదరాబాద్‌లోని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నది.

Success as Collector: క‌లెక్ట‌ర్‌గా విజ‌యం సాధించిన గిరిజ‌న విద్యార్థి

కొడుకు శివ మారుతిరెడ్డి ఫిబ్రవరి 15, 1999లో జన్మించగా, ప్రాథమిక విద్య స్థానికంగా ఉన్న విశ్వశాంతి పాఠశాలలో చదివాడు. మెట్‌పల్లిలోని నిఖిల్‌ భరత్‌ హైస్కూల్‌ 8వ తరగతి, హైదరాబాద్‌లోని శ్రీ చైతన్యలో పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన శివ మారుతిరెడ్డి, ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ డిగ్రీ కాలేజీలో బీఏ ఎకానామిక్స్‌ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్‌పై ఉన్న ఆశయంతో ముందుకుసాగాలని, 2022లో సివిల్స్‌ పరీక్షకు హాజరైన శివ మారుతిరెడ్డి జాతీయ స్థాయిలో 132వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు అందుకున్నాడు. మొట్టమొదటిసారిగా 2021లో సివిల్స్‌కు ప్రయత్ననం చేసి, అనారోగ్య కారణంగా పరీక్షకు హాజరుకాలేదు. కానీ, రెండోసారి సివిల్స్‌కు ప్రయత్నం చేసినప్పుడు ఫలితాల్లో సత్తా చాటి ప్రతిభ చాటుకున్నారు.

Padmaja Kumari Parmar Success Story : రూ.50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి.. అయినా కూడా ఇలాంటి ప‌నులు చేస్తోంది..!

బాబాయ్‌ ఆశయంతో సివిల్స్‌కు ప్రిపేర్‌..

శివ మారుతిరెడ్డి బాబాయ్‌ సంజీవరెడ్డి స్ఫూర్తితో సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తమ కుటుంబం నుంచి ఉన్నత చదువులు చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న ఆయన ఆశయాన్ని నిజం చేశాడు. బాబాయ్‌ పదేళ్ల క్రితం మృతి చెందగా, ఆయన ఆశయాన్ని పునికి పుచ్చుకున్న తన కొడుకు సివిల్స్‌ ర్యాంకు సాధించి పేరు నిలబెట్టాడని తండ్రి అంజిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. చిన్న నాటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న తన కొడుకు సివిల్స్‌ ర్యాంకు సాధిస్తాడన్న నమ్మకం ఉండేదని వివరించారు. మారుమూల ప్రాంతం నుంచి పట్టుదల, కృషితో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం తన కుటుంబానికి తీపి జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు.

Published date : 11 Dec 2023 08:55AM

Photo Stories