ప్రేమే స్ఫూర్తిగా లక్ష్యాన్ని సాధిద్దాం... జీవితాన్ని ప్రేమిద్దాం
Sakshi Education
సూర్యోదయం కాబోతుంది. పక్షుల కిలకిల రావాలతో మధు రంగా ఉన్న ఆ సమయాన ఒక వ్యక్తి... ప్రేమానందంలో మునిగిన జంట పక్షులను చూస్తూ పారవశ్యం చెందుతున్నాడు. అంతలోనే రివ్వున వచ్చి తగిలిన బాణం దెబ్బకి ఒక పక్షి రక్తమోడుతూ కిందపడి ప్రాణాలు విడిచింది. దాన్ని వదిలి వెళ్లలేక రెండో పక్షి హృదయ విదారకంగా ఏడ్చింది. ఆ విషాదాన్ని కళ్లారా చూసిన ఆ వ్యక్తి శోకం నుంచి ఈ శ్లోకం వచ్చింది.
‘‘మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వితీః సమాః
యత్ క్రౌంచ మిథునాదేక మవధీః కామ మోహితామ్’’
‘‘ఓ వేటగాడా! ప్రేమానందంలో ఉన్న జంటల్లో ఒకదాన్ని వధించి, వాటికి శాశ్వత ఎడబాటు కలిగించిన నీకు.. ఎప్పటికీ కీర్తి కలుగకుండు గాక’’ అంటూ... ఆ నిషాధుని ఉద్దేశించి తీవ్ర స్వరంతో పలికిన ఆ వ్యక్తి పలుకులకు వేటగాడు వెంటనే ప్రాణాలు విడిచాడు. మధుర ఉదాత్త భావమైన ప్రేమకు మద్దతుగా యుగాల కిందటే ప్రేమికులకు ఎడబాటు కల్పించిన వానిని శిక్షించిన ఆ వ్యక్తే వాల్మీకి మహర్షి. ఈ సంఘటన తర్వాతే... ‘ప్రేమే జీవితానికి పునాది’ అనే తన సందేశాన్ని రామాయణం ద్వారా అందించాడు వాల్మీకి. సీతారాముల ప్రేమ సందేశంతో వాల్మీకి అజరా మరం చేసిన రామాయణం.. తర్వాతి యుగాల్లో భారతీయ జీవన విధానాన్ని నిర్దేశించింది. రసమయం చేసింది.
మరి అలాంటి గొప్ప కావ్యానికి బీజమైన ప్రేమకు.. ఈ రోజుల్లో చెబుతున్న భాష్యం ఏమిటి?
అంత ఉదాత్త భావాన్ని అర్థం చేసుకునే శక్తి, సహనం, సంయమనం ఎందరిలో ఉంది? ప్రేమ అనేది.. ఆకర్షణ, మోహం, ఉన్మాదం, ఉద్రేకం లాంటి భావాలకు పర్యాయ పదంగా మారి పోతోందా? పెరుగుతున్న సామాజిక కుటుంబ, పరిసరాల ఒత్తిళ్ల తో పలాయన వాదాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది చేతిలో ఆటవస్తువుగా మారుతోందా? సహజంగా ఉత్తేజ పదార్థమై, టానిక్‌లా పనిచేయాల్సిన ప్రేమ.. వక్రభాష్యం వల్ల నిద్ర మాత్రగా మారి, యువతను నిస్తేజంగా మారుస్తూ, నిర్వీర్యం చేస్తోందా? బాధ్యత, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, విశృంఖలత్వం- వీటిని సరిగా అర్థం చేసుకోలేక, కట్టుబాట్ల నుంచి స్వాతంత్య్రాన్ని సాధించామని సంబరపడుతూ... చెడు బాటలకు బానిసలమవుతున్నామా? అనే ప్రశ్నలు బాధ్యత గల యువతీ,యువకులనందరినీ ఆలోచింపజేసేవే!

కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ గొప్ప కావ్యంగా.. భూమిని స్వర్గాన్ని అనుసంధానించే శక్తిగల కావ్యంగా.. పాశ్చాత్యుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో కథానాయిక శకుంతల. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో సాత్విక భావాల మధ్య పెరిగినా.. రాజైన దుష్యంతుని చూడటంతోనే అతని వ్యామోహంలో పడింది. ఈ కాలంలో అయితే దాన్నిLove at first sight అంటారేమో! ఆ మోహావేశంలో తనని తాను అతనికి సమర్పించుకుంది. ఫలితంగా గర్భవతైంది.
‘కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు’
(మోహావేశంలో ఉన్నవారికి ఏది చేయతగిందో, ఏది చేయకూడనిదో ఆలోచించే శక్తి ఉండదు.)
తల్లిదండ్రులు వారిస్తూ చెప్పే మాటలు వారికి వినిపించవు. ఎదుటివారిలో లోపాలు కనిపించవు. వలపు కొలువులో పడిన వారికి.. తెలివితేటలు నశించిపోతాయని పెద్దలు చెప్పిన మాట నిజంగా ఎంతో లోతైంది. గర్భవతైన శకుంతల ఎంతో విచారించింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ప్రాధేయ పడ్డా, హిత బోధ చేసినా.. నీవెవరో తెలియదు పొమ్మన్నాడు దుష్యంతుడు. తల్లిదండ్రుల అనుమతి, ఆశీస్సులు లేకుండా పురుష సమాగమం పరిణామమిది. ఈ కాలంలో కూడా మోహావేశంలో ఆలోచ నా శక్తిని కోల్పోయి.. తమకు, తమ కుటుంబానికి అపవాదులు కొనితెచ్చుకునే అవివాహితులకు హెచ్చరిక ఇది. అయితే, అందరూ ఇలా చేస్తారనుకుంటే పొరపాటే!
లా పూర్తిచేసి ఖాళీగా ఉన్న రోజులతనివి. వృత్తిపరంగా నైపుణ్యం సాధించాలంటే.. అనుభవజ్ఞుల దగ్గరో, అనుభవం నేర్పే సంస్థల్లోనో పనిచేయాల్సి ఉంటుంది. ఒక సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా లాయర్ అతన్ని ఇంటర్వ్యూ చేసింది. ఫలితంగా, అతని ప్రతిభ కారణంగా ఆ సంస్థలో జూనియర్ లాయర్‌గా పనిచేసే అవకాశం లభించింది. ఇంటర్వ్యూ చేసిన మహిళా లాయరు మాట్లాడిన తీరు, ప్రశ్నించిన విధానం, గంభీరమైన వ్యక్తిత్వం.. అతనికి ఆమెపట్ల అమితమైన గౌరవాన్ని కలిగేలా చేశాయి. కొద్దిరోజుల తర్వాత ఆమెతో మాట్లాడాలని పించి, ఒక కప్పు కాఫీ తాగొద్దాం వస్తారా? అని అడిగాడు. దానికి చిరునవ్వును మించి ఆమె సమాధానం చెప్పలేదు. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. అయినా అతనికి కోపం రాలేదు. ఆమెపై గౌరవం పెరుగుతూనే వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచాక, ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరబోయే సమయంలో మరోసారి నమ్రతగా అభ్యర్థించాడు. ఈసారి అతని సున్నిత అభ్యర్థనను మన్నించక తప్పలేదు. అలా ప్రారంభమైన ఆ పరిచయంతో, ఎప్పుడైనా అవకాశమొస్తే ఆమెతో మాట్లాడేవాడు. ఆ మాటలు వృత్తి పరమైన విషయాలకే పరిమితమయ్యేవి. వ్యక్తిగత విషయాలు ఆఫీసులో మాట్లాడటానికి ఆమె ఇష్టపడేది కాదు. ఇలా కొన్నాళ్లు గడిచాక.. ఒక వారాంతంలో సెలవు రోజున డిన్నర్‌కెళదామా? అని అడిగాడామెను. మరోసారి చూద్దాం! అంటూ.. సున్నితంగా తిరస్కరించిందామె. ఆమె వ్యక్తిత్వం చాలా గాఢమైందని అర్థమైంది అతనికి. బహుశా ఆమె వ్యక్తిత్వమే అతన్ని ఆమెతో మాట్లాడటానికి ప్రేరేపించుండొచ్చు. ఎదుటి వారిని నొప్పించ కుండా మాట్లాడటం.. విభేదించాల్సి వస్తే మృదువుగా విభేదించటం.. కర్తవ్య నిర్వహణలో నిబద్ధత.. ఆఫీసు సమయంలో వృత్తి పట్ల అంకితభావం.. సంక్షోభ సమయంలో వీడని సంయమనం.. తీవ్ర ఒత్తిడిలోనూ చెరగని చిరునవ్వు.. మానవతా విలువల పట్ల ప్రగాఢ విశ్వాసం.. ఆకర్షణలకు లొంగని శీల దృఢత్వం... వంటి లక్షణాలు ఆమె ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేశాయి. అవే ఆమె పట్ల గౌరవంతో కూడిన అభిమానం అతనిలో పెరగడానికి తోడ్పడ్డాయి. కొన్ని నెలలు గడిచిన తర్వాత కూడా డిన్నర్‌కెళ్లే అవకాశం ఉందనుకున్నప్పుడల్లా పట్టువదలని విక్రమార్కుడిలా అతను అడుగుతూనే వచ్చాడు. కపటంలేని అతని నిరాడంబరత్వం.. కాలుష్యం లేని కళ్ల చూపులు.. కల్మషం లేని సూటైన మనస్తత్వం..నిజాయితీ నిండి, ఆప్యాయతతో కూడిన అభ్యర్థన, తిరస్కరించినప్పుడల్లా నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నిస్తానని అణుకువతో నిండిన హుందాతనంతో ప్రతిస్పందించడం.. లాంటి గుణాలు ఆమెకు అతని పట్ల సానుకూల దృక్పథం ఏర్పడేట్లు చేశాయి. చివరకు అతని శ్రమ ఫలించి ఒకరోజు డిన్నర్‌కు రావడానికి ఆమె అంగీకరించింది. డిన్నర్ సమయంలో వ్యక్తిగత జీవితాల గురించి ఒకరినొకరు తెలుసుకున్నారు.

డిన్నర్ పూర్తయిన తర్వాత రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నిదానంగా అడిగాడామెను..‘‘నన్ను వివాహం చేసుకుం టారా?..’’ అనుకోకుండా వచ్చినా, అలవాటైన ప్రశ్నే కాబట్టి, ఆమె కంగారు పడలేదు. అదే ప్రశ్నకు సమాధానంగా అంతకు ముందు అరడజను మందికి తన అనంగీకారాన్ని తెలియజేసినా... అతనికి మాత్రం అవునని, కాదని చెప్పలేదు. ఒక వారాంతంలో తమ ఇంటికి వస్తే.. తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తానంటూ ఆహ్వానించింది. వారాంతంలో ఆమె ఇంటికి వెళ్లిన అతనికి తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసింది. కుటుంబ సభ్యుల మధ్య అరమరికలు లేని అభిమానాలు.. వారి మాటల్లో ప్రతిధ్వనించిన ప్రజాస్వామ్య ప్రవృత్తి.. ఆధిపత్య పోరులేని అమ్మానాన్నలు.. అధికారంతో కాకుండా ఆప్యాయతతో పెనవేసుకున్న అనుబంధాలు.. అతడిని ముగ్ధుడ్ని చేశాయి. ఆమె కుటుంబమంతా అతనికి ఎంతో నచ్చింది. మరి అతను ఆ కుటుంబానికి నచ్చాడా, లేదా? ప్రాథమిక స్థాయిలో నచ్చినా... అతన్ని అంచనా వేసే బాధ్యతను ఆమె అన్నకు అప్ప చెప్పిందా కుటుంబం. బయటకెళ్దామంటూ.. అతన్ని తీసుకొని బయటకు వచ్చాడామె అన్న. అతని ఆస్తిపాస్తులు, కుటుంబ పలుకుబడి, తల్లిదండ్రుల కుటుంబ చరిత్రలు.. సంఘంలో అతని హోదా, నెల జీతం.. ఆపైన ఇంకా ఏవైనా... ఇలాంటి విషయూలపై లోతైన చర్చ జరిగి ఉంటుందనుకుంటాం మనం! ఎందుకంటే... సాధారణంగా మన కుటుంబాల్లో ఈ విషయాల సారాంశం ఆధారంగానే వ్యక్తిపై ఒక అంచనాకు రావటం జరుగుతుంది. అయితే, వీరి మధ్య కేవలం అభిరుచుల పైనే చర్చ జరిగింది. తర్వాత అతనికిష్టమైన ఆట బాస్కెట్‌బాల్ ఆడదామని క్రీడా ప్రాంగణానికి తీసుకెళ్లాడామె అన్న. బాస్కెట్‌బాల్ ఆటలో బంతి అందించే విధానం (pass).. పాయింట్లు సాధించేందుకు అతను అనుసరించిన సమష్టితత్వం.. అన్నింటినీ మించి అతని క్రీడాస్ఫూర్తి, దృక్పథం... ఆమె అన్నకు బాగా నచ్చాయి. అతని కుటుంబం గురించి ఆమె అన్న అడగనే లేదు. అడిగినా అతనికి కుటుంబమే లేదు. ఇక చెప్పటానికేముంది.
ఇంటికొచ్చారిద్దరూ. చక్కని వ్యక్తిత్వమున్నవాడని... జీవన ప్రాముఖ్యతల పట్ల స్పష్టత కలిగినవాడని... అన్నిటికీ మించి చక్కని ఆశావాద దృక్పథముందని... మానవతా విలువలపై దార్శనిక దృష్టి కలిగి ఉన్నవాడని... తన చెల్లికి భర్తగా, ఆ కుటుంబంలోకి సభ్యునిగా రావటానికి అన్నివిధాలా తగినవాడంటూ... ఆమె అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య నిరాడంబరంగా వారిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రేమ అనేది అందం, ఆర్థిక దృష్టి కోణంలోనో.. ఆకారం దృష్టికోణంలోనో మాత్రమే కాక... అభిమానం, ఆత్మసంతృప్తి, అంతసౌందర్యం, ఆప్యాయత, కుటుంబ సభ్యులందరి ఆమోదం, అంతర్గత ఆరాధన ఆధారంగా కూడా ముందుకెళ్లవచ్చని.. అలా వెళితే ఆ ప్రేమ అజరామరంగా ఉంటుందనీ వారిద్దరి ప్రేమ రుజువు చేసింది. దేశం ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంటే... తన దార్శనిక దృష్టితో, తన ఆత్మవిశ్వాసంతో చక్కని భవిష్యత్తు నిర్మించటం సుసాధ్యమేనంటూ... దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి.. తన నైపుణ్యంతో, దృక్పథంతో, మార్పు నినాదంతో దేశ ప్రజలందరి విశ్వాసం చూరగొన్న అతన్ని టైమ్ మ్యాగజీన్- 2008 మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. అతను ఎవరో కాదు..! ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు కొత్తగా ఎన్నికైన అత్యున్నత నేత బరాక్ ఒబామా. ఆమె అతని భార్య మిషెల్ ఒబామా.
వీరిద్దరి అనుబంధాన్ని పరిశీలిస్తే...
మొదదలఁజూచినగడు గొప్ప పిదప గుఱుచ,
యూది గొంచెము తర్వాత నధిక మగుచు,
దనరు, దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
(సజ్జనుల స్నేహం... సాయంకాలం నీడలా మొదట తక్కు వగా ఉండి.. క్రమంగా వృద్ధి చెందుతుంది. దుర్జనుల స్నేహం.. సూర్యోదయం నీడలా మొదట చాలా నిడివిగా ఉండి.. క్రమేపీ క్షీణిస్తుంది.) అన్న భర్తృహరి సుభాషితం గుర్తుకు రాకమానదు.
ఈ తరం వారికి తెలివితేటలు, గ్రహించే శక్తి, వేగంగా పని చేసే సామర్థ్యం వంటి అంశాల సమాహారమైన Intelligence Quotient (IQ) చాలా ఎక్కువ అని నానుడి. అయితే, కష్టసుఖాల్లో నిబ్బరంగా ఉండటం, భావగాఢతతో పాటు గాంభీర్యాన్ని కూడా కనబరచటం, ఆలోచనల్లో సాంద్రత లాంటి అంశాల సమాహారమైన Emotional Quotient (EQ) కిందటి తరాలవారితో పోలిస్తే చాలా తక్కువ అనే నానుడి కూడా ఉంది. లేకపోతే.. అంగసౌష్టవం, ఆడంబరాలు, ఆస్తులు మొదలైన వాటి ప్రభావంతో ఏర్పడే ఆకర్షణకు... అంతరంగ స్పర్శ, ఆత్మసౌందర్యం, గుణారాధన, ఉన్నతమైన ఉమ్మడి లక్ష్యం తదితర అంశాల ఆధారంగా ఏర్పడే ప్రేమకు తేడాను తెలుసుకోలేక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! ఆకర్షణ వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించిన విస్తరి లాంటిదైతే... ప్రేమ తియ్యని తాగునీరు ఉన్న తటాకం లాంటిది. పరిధిలోనూ, ఫలంలోనూ రెండింటికీ ఎంతో తేడా! భోంచేసిన విస్తరి గమనం, గమ్యం వేరే చెప్పనవసరం లేదు. మరి తటాకమో!!
ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ చర్మకారుని కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఏ పనిచేసినా.. ఆ పనిని ప్రేమిస్తూ, ఆనందిస్తూ చేయడం అతనికి అలవాటైంది. ఆ ఆనందంలో పనికాస్త ఆలస్యమైనా బాధపడేవాడు కాదు. కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రిన్సిపాల్ కుమార్తెతో అతనికి పరిచయమైంది. ఆమెలో ‘మానవ సేవే మాధవ సేవ’ అనే తత్వాన్ని గమనించాడు. ఆలోచించి ఒక రోజు తన అభ్యర్థనను ఆమె ముందుంచాడు. అయితే, తనలో సేవా బీజాలు, ప్రేమ బీజాలు బలంగా ఉండటానికి తన తల్లిదండ్రులే కారణమని.. తన తండ్రిని ఒప్పిస్తే తనకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. ఆమె తండ్రిని కలిస్తే... నా కుమార్తెను ఎందుకు పెళ్లి చేసుకుందామనుకుంటున్నావు? అని అడిగాడతను. ‘‘నన్ను ఆమెలో చూస్తున్నాను. మానవ శ్రేయస్సుకు నేను చేసే తపస్సులో తోడు కావాలి, నా లక్ష్యాన్ని రెండింతలుగా ప్రేమించగలగటానికి ఆమె సహజీవనం కావాలి’’ అంటూ.. తొణక్కుండా సమాధానమిచ్చాడు. ఆ కాలంలో డాక్టర్లు ఉపకరణాలను, తమ చేతులను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనేక మంది బిడ్డలు, తల్లులు పురిట్లోనే కన్ను మూస్తున్నారని గమనించిన లూయీ పాశ్చర్ పరికరాలను శుభ్రంచేసే ప్రక్రియను (ఒక ఉష్ణోగ్రత వరకూ నీటిలో ఉడికించి చల్లార్చటం) తన భార్య సహకారంతో రూపొందించాడు. ఈ ప్రక్రియనే అతని పేరు మీదగా పాశ్చరైజేషన్ అన్నారు. అలాగే ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధికి పరిశోధన చేస్తున్నప్పుడు.. తోటి డాక్టర్ల నుంచి ఎదురైన అవమానాలూ, అప్పటి ఫ్రాన్స్ అధినేత నెపోలియన్ విధించిన ఆంక్షలు.. 45 ఏళ్ల వయస్సులోనే పక్షవాతంతో రెండేళ్లు మంచాన పడటం.. వీటన్నిటినీ ఎదుర్కోవటానికి తన భార్య ఒక తల్లిలా ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహమే కారణమన్నారాయన. ఆమె చూపిన అమితమైన ప్రేమే తనను రేబీస్ వ్యాధి వ్యాక్సిన్‌ను కనుగొనేలా ప్రేరేపించిందనీ నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సమయంలో... లూయీ పాశ్చర్ పేర్కొనటాన్ని చూస్తే... ప్రేమ ఎంత శక్తివంతమైందో, మానవాళి శ్రేయస్సుకు ఎలా తోడ్పడగలదో అర్థం చేసుకోవచ్చు. మరి అతి తక్కువ వయస్సులోనే తన గానం ద్వారా యువతను ఉర్రూతలూగించి.. సంపాదించిన పేరునూ, డబ్బునూ పదిల పరచుకోకుండా.. స్వేచ్ఛగా, కంటికి ఇంపైనవారితో సంచరించడం.. సాకే సామర్థ్యం లేని వయసులోనే సంతానాన్ని కనడం.. మానసిక సంతులనాన్ని కోల్పోయి, మతి చలించే స్థితికి రావడం.. సొంత తల్లిదండ్రులనే శత్రువులుగా భావించి, కోర్టుకెక్కిన బ్రిట్నీ స్పియర్స్ లేత జీవితం ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక, తెలుసుకోలేక.. పతనం అంచున నిలబడిన సగటు ఆడపిల్ల జీవితాన్ని స్ఫురింపజేస్తోంది.
పై రెండు ఉదాహరణలను లోతుగా గమనిస్తే...
యుక్తోహార విహారస్య
యుక్త చేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావ బోధస్య
యోగోభవతి దుఃఖహా
(యుక్తమైన ఆహారం, విహారం, పనులు చేసేవారికి వచ్చే కలలు కూడా యుక్తంగానే ఉంటాయి.)
అన్న భగవద్గీతలోని పద్యం గుర్తుకు రాకమానదు.
స్త్రీకైనా, పురుషుడికైనా మానసిక వికారాన్ని గానీ.. సంతులనాన్ని గానీ కలిగించేది మనస్సే. మెదడు, హృదయం Hardware అయితే.. మనస్సు Software. Hardware ఎంత దృఢంగా ఉన్నాSoftware దుర్భేద్యంగా ఉంటేనే ఎలాంటి వైరస్ (సమస్య)లనైనా ఎదుర్కొని సమర్థవంతంగా పనిచేయ గలుగుతుంది. మనస్సుకు ఆరోగ్యకరమైన ఆలోచనలను, సకారాత్మక భావాలను ఆహారంగా ఇస్తూ... చక్కని విజ్ఞానాన్ని ఎరువుగా వేస్తూ... ముందుకుపోతే అది గొప్ప ప్రతిఫలాన్ని స్తుంది. తోటకు తోటమాలి ఎలాగో, మన మనస్సుకు మనమే మాలి. ‘‘పురుషుని ఉత్తమ శక్తిని విజృంభింపచేయటానికి స్త్రీ.. స్త్రీ పవిత్ర శక్తిని తేజరిల్లజేయటానికి పురుషుడు ఉద్భవించారు’’ అన్న బాపిరాజు మాటలు ఆలోచనామృతం. ఈ విషయం అవగాహన ఉన్నవారి విచక్షణ ఎల్లప్పుడూ జాగృతంగానే ఉంటుంది.
సామాన్య కుటుంబంలో జన్మించి, స్వదేశంలో మహిళలకు పై చదువులు చదవటానికి అర్హత లేకపోతే... పొరుగు దేశానికి వెళ్లి, స్కాలర్‌షిప్‌లతో, అరకొర సౌకర్యాలతో... ఎప్పుడూ, ఎవరినీ నిందించకుండా.. తన తండ్రి చెప్పిన విధంగా, తను చేసే పనినే ప్రేమిస్తూ ముందుకెళ్లిందామె. తీవ్ర చలిలో చాలినన్ని ఉన్ని దుస్తులు లేకపోయినా.. ఎప్పుడూ పట్టించుకోలేదు. చదువులో కూర్చుంటే.. ఆకలి దప్పికలు మరచి కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. సుఖం ఎక్కువైతే నిద్ర వస్తుంది.. కానీ, విద్య రాదనేది ఆమె అభిప్రాయం. ఆమెకు భౌతికశాస్త్రంపై ఉన్న ప్రేమను గమనించిన ప్రొఫెసర్లు ఒక సమస్యను ఇచ్చి సాధించమన్నారు. ఆ సమస్యా పరిష్కారంలో తన ప్రయోగశాలలో అవకాశమిచ్చి ఒక వ్యక్తి ఆమెను ప్రోత్స హించాడు. ఆ సాన్నిహిత్యం, ఆమె అకుంఠిత దీక్ష అతనికి నచ్చితే... అతని నిరాడంబరత్వం, రుషిలాంటి ప్రశాంతత.. ఆమెకు తన కార్యసాధనలో ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి. వివాహం చేసుకుంటే మరింత సన్నిహితంగా, సంయుక్తంగా కృషి చేయవచ్చన్న అతని సూచనను.. ఆమె తిరస్కరించింది. తిరస్కరించిందన్న కోపంతో ప్రయోగశాలలో ఉన్న యాసిడ్‌తో ఆమెపై దాడికి ఎగబడలేదు అతను! ‘‘నీ మనస్సు మార్చుకోమని నేను కోరను. అయితే, మనిద్దరం కొంతకాలం కలసి పనిచేస్తే... మానవాళి భవిష్యత్తుకు ఏదైనా చేయగలమన్న నమ్మకం నాలో పెరుగుతోంది. ఆ నమ్మకాన్ని నీవు పంచుకుంటే కలిసి పనిచేద్దాం’’ అని సందేశాన్ని పంపిన అతని నిశ్ఛలతత్వానికి ముగ్ధురాలై, అతని సహచర్యాన్ని అంగీకరించింది. వారిద్దరూ తమ తమ సంయుక్త కార్యాచరణలో ఎంతగా లీనమయారంటే... తమ వివాహానికి కొన్ని క్షణాల ముందువరకూ, పరిశోధనలు చేస్తూ... ముహూర్త సమయానికి లేబొరేటరీ దుస్తులనే పెళ్లి దుస్తులుగా భావించి, వివాహం చేసుకున్నారు. దగ్గరలో ఉన్న పట్టణానికి సైకిల్‌పై కలిసివెళ్లడమే వారి Honey Moon.. తమలోనే Honey ఉందని తెలుసుకోకుండా... Moon మీదకైనా Honeymoonకు వెళ్లడానికి వెనుకాడని ప్రేమికులు పై ప్రేమ జంటల నుంచి ఎంత నేర్చుకోవచ్చు. పరిశోధనకు సౌకర్యాలు లేక, పాఠాలు బోధించి వచ్చిన డబ్బుతో పరిశోధనలు కొనసాగించి.. క్యాన్సర్ వ్యాధి నివారణకు వాడే రేడియంను కనిపెట్టి మానవాళి భవిష్యత్తును సురక్షితం చేశారు. భార్యాభర్తలిద్దరూ నోబెల్ పురస్కారాన్ని పొందారు. వారే మేరీ క్యూరీ, పియరీ క్యూరీ. రేడియోధార్మిక పదార్థాల పరిశోధనల కారణంగా... స్వయంగా తీవ్ర అనారోగ్యానికి గురైనా.. విజ్ఞానంపై, మానవాళిపై, తమ లక్ష్యంపై అచంచలమైన ప్రేమ కలిగిన ఆ ప్రేమజంట... చరిత్రలో నిలచిపోయూరు.
ప్రేమంటే ఒకరి కళ్లలోకి మరొకరు గుచ్చిగుచ్చి చూసుకోవటం కాదని... ఇద్దరూ కలిసి ఒకే దిశలో చూస్తూ ముందుకు నడవటం అని వారు నిరూపించారు. ప్రేమనేది లేకపోతే ధనవంతుడికీ, పేదవాడికీ తేడా ఏమీ లేదనేది మథర్ థెరిసా అభిప్రాయం. ప్రేమ లేని ధనవంతుడు.. ధనమున్నా పేదవాడే. సినిమాలు చూసో, టీవీ సీరియల్స్ చూసో ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకునేవారు... ఉదాత్తమైన ప్రేమను ఉన్మాదంతో, నేరాలు, ఘోరాలు చేసి సాదిధ్దామనుకుంటున్నవారు.. వారి కథలు చూపిస్తున్నవారు ప్రేమకు అవసరమైన అనుబంధాలు, ఆత్మీయతలు, మానవత, దయ, సానుభూతి మీద కూడా దృష్టి సారిస్తే ఎంత బాగుండు!
జీవితమంటే... సుఖం, దుఃఖం, ప్రేమ, అనురాగం, క్రోధం, శాంతం, ఆరోగ్యం, అనారోగ్యం, ధనం, దరిద్రం, సంపదలు, ఆపదలు వీటన్నిటి కలయిక. వీటిల్లో ఏదో ఒకటే జీవితమనుకుంటే.. పొరపాటే. సీతారాములు, నలదమయంతులు.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, వాటిని ఓడించి జీవితంలో గెలిచారు. వారు జీవితాన్ని ప్రేమించారు. కాబట్టి నిలబడి గెలిచారు. జీవితాన్ని ప్రేమించేవారు ప్రాణాలు తీయలేరు. తీసుకోలేరు. రామాయణంలో సీతా స్వయంవరంలో.. సీత రాముడిని వరించిందని... అక్కడికి వచ్చిన మిగతా రాజులు ఆమెపై ద్వేషం పెంచుకోలేదు. మహాభారతంలో.. ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లిన కర్ణునికి అర్హతలు, సామర్థ్యం ఉన్నా.. శూతపుత్రుడని ద్రౌపది తిరస్కరించినప్పుడు.. కర్ణుడు ప్రాణాలు తీసుకోలేదు. మన విద్యావిధానం, విద్యాలయాలు, పరిసరాలు, పెంపకం, ఇవన్నీ జీవించడం నేర్పాలి. జీవితాన్ని ప్రేమించడం నేర్పాలి. ప్రతివ్యక్తిని తన ధర్మాన్ని నిర్వర్తించి, ఫలితంపై నిశ్ఛింతగా ఉండమన్నారు భగవద్గీతలో!! అయితే, ప్రతిచోటా ’ఫలితానికే‘ ప్రాధాన్యమిచ్చే వాతావరణం ఏర్పడటంతో.. ఆశించింది, ప్రేమించింది లభించకపోతే చావడమో, చంపడమో ఫలితంగా అందించే సంస్కృతి నెలకొంటోంది. ఆశించింది దక్కక కుంగిపోయినా.. ఆత్మావలోకనంతో తిరిగి బతికి జీవితాన్ని గెలిచినవారు ఎంతోమంది. అందుకే యువత జీవితాన్ని ప్రేమించడం నేర్వాలి. లేకపోతే నాగరికత ఎక్కువవుతున్నకొద్దీ... ప్రేమరోగులు కూడా ఎక్కువవుతున్నారనే మాటలను నిజం చేసిన వాళ్లమవుతాం.
కాళిదాసు ‘కుమార సంభవం’లో అన్నట్లు...
వికారాహేతౌ సతి విక్రయన్తే
యేషాం న చేతాంసి తవ ఏవధీరాః
వికారాన్ని పెంపొందించే కారణాలు ఉన్నా.. వాటి మధ్య ఎవరు వికారాన్ని పొందరో వారే ధీరులు!!

Published date : 20 Nov 2021 02:24PM