Skip to main content

Field Study: ఆదిలాబాద్‌కు ట్రెయినీ ఐఏఎస్‌లు

కై లాస్‌నగర్‌: క్షేత్రస్థాయి అధ్యయనం, పరిశోధనలో భాగంగా 14 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు ఆదిలా బాద్‌ జిల్లాకు చేరుకున్నారు.
Trainee IAS Officers to Adilabad
కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలతో ట్రెయినీ ఐఏఎస్‌లు

 ఆగ‌స్టు 27న‌ కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో వారు సమావేశమయ్యారు. జిల్లా పరిస్థితులపై అవగాహ న కల్పించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనులు, పరిసరాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. క్షేత్రస్థాయి అధ్యయనం, పరిశోధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా తీసుకుంటు న్న చర్యలను ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌ వా రికి వివరించారు.

చదవండి: Sri Krishna Sri Vatsava: ఐఏఎస్‌ కావడమే లక్ష్యం

అనంతరం కలెక్టర్‌, పీవోలతో ఫొటో దిగిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయి జిల్లాలోని ఇచ్చోడ మండలం మేడిగూడకు, సిరికొండ మండలం రిమ్మ గ్రామానికి బయల్దేరి వెళ్లారు. సెప్టెంబర్‌ 3 వరకు ఆయా గ్రామాల్లోనే బస చేయనున్నారు. గ్రామీణ ప్రజల జీవన విధానం, గిరిజన సంస్కృతి, ఆచార పద్ధతులు, గిరిజన కళలు, జీవనోపాధి తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కుష్బూ గుప్తా, ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌, డీఆర్‌డీవో కిషన్‌, డీఈవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

చదవండి: IAS Success Story: ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు... 22 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన అంకుర్ గార్గ్‌

Published date : 28 Aug 2023 03:22PM

Photo Stories