Free Training for Civils: ప్రాజెక్టు లక్ష్యలో సివిల్స్ శిక్షణ..
సాక్షి ఎడ్యుకేషన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రాజెక్టు లక్ష్య పేరుతో నిర్వహించనున్న ఉచిత సివిల్స్ శిక్షణకు 65 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఉచిత సివిల్స్ శిక్షణకు ఎంపికైన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. మొదటి, రెండు దశల్లో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 156 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశామన్నారు.
➤ Teacher Training Program: అధ్యాలకులకు ఆన్‌లైన్ లో శిక్షణ..
వీరికి ఈ నెల 29, 30 తేదీల్లో ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 65 మంది ఎంపికయ్యారన్నారు. వీరికి విశాఖపట్నంలోని వేపగుంట వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం నుంచి ఉచిత సివిల్స్ శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఐ. కొండలరావు, ఏటీడబ్ల్యూవో రజని పాల్గొన్నారు.