Teacher Training Program: అధ్యాలకులకు ఆన్‌లైన్ లో శిక్షణ..
Sakshi Education
టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం దరఖాస్తులు చేసుకొవాలని ఏయూ రెక్టార్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధ్యాపకులకు అందించే శిక్షణ గురించి ఆమె సదస్సులో వెల్లడించారు..
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల అధ్యాపకులు రెండు వారాల మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవాలని ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత అన్నారు. యూజీసీ చైర్మన్ ఆన్‌లైన్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అనంతరం సదస్సు వివరాలు ఆమె వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 111 కేంద్రాలలో ఆన్‌లైన్ విధానంలో అధ్యాపకులకు రెండు వారాలపాటు శిక్షణ అందించనున్నామన్నారు.
➤ JNTU Students: విద్యార్థులకు అభినందనలు.. కారణం..?
రాష్ట్రంలో మూడు కేంద్రాలలో ఈ శిక్షణ ఉంటుందని, వీటిలో ఒకటిగా ఏయూ నిలుస్తోందన్నారు. నవంబర్‌లో నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు వర్సిటీ అనుబంధ కళాశాలల అధ్యాపకులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. యూజీసీ సదస్సులో హెచ్‌ఆర్‌డీసీ సెంటర్ సంచాలకులు ఆచార్య టి.వి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Nov 2023 12:07PM