Free Course Interview: సివిల్స్ శిక్షణకు తేదీ విడుదల..
Sakshi Education
ఉచితంగా ఇస్తున్న సివిల్స్ శిక్షణ కోసం ఐటీడీఏ కార్యాలయంలో ఇటీవలె ఇంటర్వ్యూలను నిర్వహించి పూర్తి చేశారు. ఈ మెరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రకటించిన తేదీ ఆధారంగా శిక్షణ ప్రారంభమవుతాయని ఐటీడీఏ పీవో వెల్లడించారు.
సాక్షి ఎడ్యుకేషన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత సివిల్స్ శిక్షణ కోసం రెండు రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో ఐటీడీఏ కార్యాలయంలో ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ అదనపు సంచాలకులు ఆనంద పద్మనాభరావు, మేఘాలయ రిటైర్డ్ అదనపు డీజీపీ పి.హెచ్.పి.రాజు ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు.
➤ Teacher as Athelete: ఆటల్లో సత్తా చాటిన ఉపాధ్యాయురాలు..
రెండు దశల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 156 మందిని ఇంటర్వ్యూలకు పిలిచినట్టు తెలిపారు. 29 న 95 మంది, 30 న 55 మందికి ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, వీరిలో 50 మందిని శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. వచ్చేనెల మొదటి వారంలో వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని ఐటీడీఏ పీవో చెప్పారు.
Published date : 31 Oct 2023 12:17PM