Teacher as Athelete: ఆటల్లో సత్తా చాటిన ఉపాధ్యాయురాలు..
Sakshi Education
తన వృత్తితో పాటు ఆటల్లో కూడా తాను సత్తా చాటుకుంది. అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన పోటీల్లో ఈ ఉపాధ్యాయురాలు కూడా పాల్గొని పతకాలను గెలిచింది. అందరి అభినందనలు అందుకుంది.
ZP School teacher wins gold medal in Atheletics
సాక్షి ఎడ్యుకేషన్: ఒక వైపు తన వృత్తి ధర్మాన్ని విస్మరించకుండా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. మరో వైపు తన ప్రవృత్తి అయిన ఆటల పోటీల్లో సత్తా చాటుతోంది. రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి ఈ నెల 29న విశాఖ పోలీస్ బ్యారెక్స్ గ్రౌండులో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించింది.
వంద మీటర్ల పరుగుతోపాటు డిస్కస్ త్రోలో స్వర్ణాలు కైవసం చేసుకుంది. వీటిని వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మంగా వరప్రసాద్, ఏఎస్సై ప్రదానం చేశారు. ఆమెను సోమవారం రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి.ఎస్.వి. ప్రసాద్, ఉపాధ్యాయులు ఆర్.వి.ఎస్.ఆర్.శర్మ, వి.నాని, కిరణ్, రామశేషు తదితరులు అభినందించారు.