Skip to main content

సివిల్స్‌ నాలుగో ర్యాంకర్‌... ఐశ్వర్య అమ్మాయి కాదు

సివిల్స్‌ నాలుగో ర్యాంకర్‌ ఐశ్వర్య వర్మ పేరు చాలామందిలో అయోమయానికి కారణమైంది.
Civils fourth ranker not an girl
సివిల్స్‌ నాలుగో ర్యాంకర్‌ ఐశ్వర్య వర్మ

తొలి మూడు ర్యాంకులూ మహిళలే కైవసం చేసుకున్న నేపథ్యంలో, పేరు చూసి ఐశ్వర్య అంటే అమ్మాయేనని చాలామంది అనుకున్నారు. పలు పత్రికల్లోనూ, వెబ్‌సైట్లలోనూ కూడా అలాగే వచ్చింది. తొలి నాలుగు ర్యాంకులూ అమ్మాయిలే సాధించారంటూ అవన్నీ రాసుకొచ్చాయి. మహిళా సాధికారత మరో మెట్టు పైకెక్కిందంటూ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్వీటర్లలో పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో ఐశ్వర్య మహిళ కాదంటూ ఆయన కుటుంబీకులు, స్నేహితులు స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది! సోషల్‌ మీడియాలో ఆయన ఫొటో పెట్టి మరీ విషయం వివరించారు. పత్రికలు, సైట్లు ఇలా గందరగోళపడ్డా మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాత్రం ‘ఉజ్జయినికి చెందిన పురుష అభ్యర్థి ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంకు సాధించారు’ అంటూ స్పష్టంగా పేర్కొంటూ ప్రశంసించారు. ఐశ్వర్య వర్మ ఢిల్లీలో నాలుగేళ్ల పాటు కోచింగ్‌ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు!

చదవండి: 

Civils Results: క్రేన్‌ ఆపరేటర్‌ కూతురికి యూపీఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో ర్యాంక్‌

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

Civils Results: అమ్మాయిల హవా.. మొదటి ర్యాంకు ఊహించలేదు..

Published date : 01 Jun 2022 03:38PM

Photo Stories