Free Coaching for UPSC CSAT 2025: యూపీఎస్సీ సీశాట్–2025 ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీశాట్–2025 పరీక్షకు ఉచిత శిక్షణ కోసం అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
2024–25 విద్యా సంవత్సరంలో 100 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, వికలాంగులకు 5% సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్ధులు www.tmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
స్క్రీనింగ్ టెస్ట్ అన్ని జిల్లా కేంద్రాల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఏప్రిల్ 28న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 040– 232 40134 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Published date : 22 Mar 2024 10:25AM
Tags
- Free Coaching for UPSC CSAT 2025
- UPSC
- Civil Services Aptitude Test
- UPSC CSAT 2025
- Telangana State Minority Study Circle
- Mohammed Ilyas Ahmed
- Telangana News
- hyderabad news
- Hyderabad District
- Minority Welfare
- Free Coaching
- UPSC CSAT-2025
- telangana state
- Minority Study Circle
- Eligible Candidates
- Application invitations
- sakshieducation latest news
- Free coaching opportunity
- Education News
- UPSC CSET-2025
- Minority Candidates
- Mohammad Ilyas Ahmed statement
- SakshiEducationUpdates