Free UPSC Civils Coaching: యూపీఎస్సీ పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎంపిక ఇలా..
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందన్నారు. మహిళా అభ్యర్థులకు 33.33 శా తం, అన్ని రిజర్వ్ కేటగిరీల్లో దివ్యాంగులకు 5 శా తం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 040–23236112 నంబరులో సంప్రదించాలన్నారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పనకు దరఖాస్తులు
హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిధిలోని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2 నెలల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ అందించి, ప్రైవేటు బ్యాంక్‌లలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.
మార్చి 25లోగా ఆన్‌లైన్‌లో www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 31వ తేదీన ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు ఉంటుందని, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా 30 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఎస్జీటీ శిక్షణకు దరఖాస్తులు
డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని అర్హులైన అభ్యర్థులకు 75 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 22లోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08732–221280, 9949684959 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Tags
- UPSC Civil Services 2025 Exam Free Coaching
- Telangana State Study Circle
- Minority Welfare Department
- Civil Services 2025 Free Coaching
- Neerati Rajeshwari
- Free UPSC Civils Coaching
- Telangana News
- Telangana State Study Circle
- Minority Welfare Department
- Free training
- Reserved categories
- disabled persons
- Merit basis
- skill trainings
- SakshiEducationUpdates