Kishan Reddy: వచ్చే పది నెలల్లో పది లక్షల కేంద్ర ఉద్యోగాలు
ఇప్పటికే 3.6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే.. కేసుల పేరుతో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన రిక్రూట్‌మెంట్లలో ఎలాంటి చిన్న లోపం, అవినీతికి తావు లేకుండా భర్తీ చేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మే 16న వర్చువల్‌గా నియామక పత్రాలు అందించారు. దీనికి సంబంధించి సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో రోజ్‌గార్ మేళా నిర్వహించారు. పోస్టల్, రైల్వే, ఆడిట్, సీఆర్‌పీఎఫ్ తదితర శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన పలువురికి కిషన్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి కిషన్‌రెడ్డి సూచించారు. పగలు, రాత్రి కష్టపడి ఉద్యోగాలు సంపాదించేందుకు సహకరించిన తల్లిదండ్రులను మరచిపోవద్దన్నారు. పొందిన ఉద్యోగం ద్వారా వీలైనంత మేరకు పేదలకు సాయం చేయాలన్నారు.
చదవండి: SSC Jobs: పదో తరగతితోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... రాత పరీక్షలో విజయానికి ఇలా!