నాణ్యమైన న్యాయ విద్యకు క్లాట్-2019
Sakshi Education
లా.. కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది! న్యాయశాస్త్ర విద్యార్థులకు డిమాండ్ పెరుగుతోంది! అంతేకాదు ప్రముఖ ‘లా’ యూనివర్సిటీల నుంచి న్యాయవాద కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి.
ప్రముఖ లా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంటర్మీడియెట్ అర్హతతోనే లా కోర్సుల్లో చేరడానికి మార్గం.. క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)! ఇంజనీరింగ్‌కు ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌కు ఐఐఎంల మాదిరిగానే.. న్యాయవిద్యలో నాణ్యమైన విద్యను అందుబాటులో తెచ్చేందుకు జాతీయ స్థాయిలో నెలకొల్పిన ఇన్‌స్టిట్యూట్‌లే.. నేషనల్ లా యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో అడుగుపెట్టేందుకు వీలు కల్పించే క్లాట్-2019కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో క్లాట్ పరీక్ష తీరుతెన్నులు, ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
న్యాయ విద్య(లా).. మనం సంప్రదాయ న్యాయవాద వృత్తికి కేరాఫ్‌గా భావించే కోర్సు. లా ఇప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంటోంది. న్యాయవాద కోర్సుతో ప్రస్తుతం సంప్రదాయ అడ్వొకేట్ వృత్తితోపాటు బహుళ జాతి సంస్థల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. న్యాయ విద్యకు, లా గ్రాడ్యుయేట్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా పభుత్వం నేషనల్ లా యూనివర్సిటీలు ఏర్పాటుచేసింది. వీటిలో ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రవేశం కల్పించే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు పోటీ ఎక్కువగా ఉంది. నేషనల్ లా యూనివర్సిటీలు.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-యూజీ పేరుతో జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలో మెరిట్ జాబితాలో నిలిస్తేనే ప్రవేశం లభిస్తుంది.
క్లాట్-యూజీ: 2019
క్లాట్-యూజీ-2019 షెడ్యూల్‌ను పరిశీలిస్తే రెండు ప్రధాన మార్పులు గమనించొచ్చు. అవి.. ఈ ఏడాది నుంచి పరీక్షను మళ్లీ ఆఫ్‌లైన్(పెన్-పేపర్) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం క్లాట్‌తో ప్రవేశం కల్పించే నేషనల్ లా యూనివర్సిటీల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది మొత్తం 21 నేషనల్ లా యూనివర్సిటీల్లో క్లాట్-యూజీ మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
- క్లాట్-యూజీ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో జరుగుతుంది.
పరీక్ష వ్యవధి: రెండు గంటలు
విజయానికి మార్గాలు
కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు నేషనల్ లా యూనివర్సిటీలను కలిపి మొత్తం 21 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2500 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటలో ప్రవేశం ఖరారు చేసుకోవాలంటే.. మూడు వేల లోపు ర్యాంకుతోనే సాధ్యం. జనరల్ కేటగిరీలో 1700లోపు ర్యాంకుతోనే సీట్లు భర్తీ అయిపోతున్నాయి.
కార్పొరేట్ కొలువులు
ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయవాద కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు కార్పొరేట్ కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు, ఆర్ అండ్ డీ సంస్థలు, బ్యాంకులు వీరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏటా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. సగటున రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
క్లాట్-2019 అర్హత, దరఖాస్తు సమాచారం
ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులే కాకుండా.. పీజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి కూడా జాతీయస్థాయిలో క్లాట్-పీజీ పేరుతో ఎంట్రన్స్ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అభ్యర్థులు క్లాట్ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే నేషనల్ లా యూనివర్సిటీలు
ఆఫ్‌లైన్‌కు కారణమదే..
క్లాట్-యూజీ 2019ను తిరిగి గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించడానికి ముఖ్య కారణం.. ఆన్‌లైన్ విధానంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థుల నుంచి వినతులు రావడమే. దీంతో లా యూనివర్సిటీల కన్సార్షియం 2019 నుంచి క్లాట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలనే అభిప్రాయాన్ని ఆమోదించారు.
- ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, క్లాట్-2019 కన్వీనర్, వీసీ, నేషనల్ లా యూనివర్సిటీ-కటక్.

విభాగం | ప్రశ్నలు | మార్కులు |
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ | 40 | 40 |
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ | 50 | 50 |
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ) | 20 | 20 |
లీగల్ ఆప్టిట్యూడ్ | 50 | 50 |
లాజికల్ రీజనింగ్ | 40 | 40 |
మొత్తం | 200 | 200 |
విజయానికి మార్గాలు
- క్లాట్-యూజీ పరీక్ష ఔత్సాహికులు సంబంధిత విభాగాల్లో, మొత్తంగా టాప్ స్కోర్ సొంతం చేసుకోవాలంటే.. ఆయా విభాగాలకు సంబంధించి పదోతరగతి, ఇంటర్మీడియెట్ స్థాయిలోని అంశాలపై దృష్టిసారించాలి.
- బేసిక్ గ్రామర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం సొంతం చేసుకుంటే ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ విభాగంలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. వొకాబ్యులరీపై పట్టు సాధించడం ద్వారా కాంప్రెహెన్షన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రశ్నలను సులువుగా సాధించగలిగే సామర్థ్యం లభిస్తుంది. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కరెక్షన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ వంటి బేసిక్ గ్రామర్ అంశాలపై పట్టు సాధించాలి.
- జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో చరిత్ర, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టిపెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులపై అవగాహన పెంచుకోవాలి. ప్రామాణిక జనరల్ నాలెడ్జ్ పుస్తకాలతోపాటు, రోజూ ప్రామాణిక ఇంగ్లిష్/తెలుగు దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి.
- మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఆప్టిట్యూడ్)కు సంబంధించి పదోతరగతి స్థాయిలోని గణిత సబ్జెక్ట్ అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, యావరేజ్, రేషియో తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- క్లాట్-యూజీలో.. అభ్యర్థులు కొత్తగా భావించే విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. విద్యార్థుల్లోని న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, లీగల్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించొచ్చు.
- అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం.. లాజికల్ రీజనింగ్. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
- క్లాట్ ఎసెన్షియల్స్-అభినవ్ శ్రీవాత్సవ్.
- ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్-ఆర్.ఎస్.అగర్వాల్.
- వర్డ్ పవర్ మేడ్ ఈజీ-నార్మన్ లూయిస్.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్.ఎస్.అగర్వాల్.
- లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్.
- లీగల్ ఆప్టిట్యూడ్ -ఎ.పి.భరద్వాజ్.
- అనలిటికల్ రీజనింగ్ -ఎం.కె.పాండే.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు నేషనల్ లా యూనివర్సిటీలను కలిపి మొత్తం 21 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2500 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటలో ప్రవేశం ఖరారు చేసుకోవాలంటే.. మూడు వేల లోపు ర్యాంకుతోనే సాధ్యం. జనరల్ కేటగిరీలో 1700లోపు ర్యాంకుతోనే సీట్లు భర్తీ అయిపోతున్నాయి.
కార్పొరేట్ కొలువులు
ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయవాద కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు కార్పొరేట్ కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు, ఆర్ అండ్ డీ సంస్థలు, బ్యాంకులు వీరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏటా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. సగటున రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
క్లాట్-2019 అర్హత, దరఖాస్తు సమాచారం
- అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు). చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
- వయో పరిమితి: ఈ ఏడాది ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో.
- దరఖాస్తు తేదీలు: జనవరి 13 నుంచి మార్చి 31 వరకు.
- క్లాట్ పరీక్ష తేదీ: మే 12, 2019.
- ఫలితాల వెల్లడి: మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://clatconsortiumofnlu.ac.in
ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులే కాకుండా.. పీజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి కూడా జాతీయస్థాయిలో క్లాట్-పీజీ పేరుతో ఎంట్రన్స్ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అభ్యర్థులు క్లాట్ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే నేషనల్ లా యూనివర్సిటీలు
- నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు.
- నల్సార్హైదరాబాద్.
- నేషనల్ లా యూనివర్సిటీభోపాల్.
- వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్-కోల్‌కతా.
- నేషనల్ లా యూనివర్సిటీ- జోథ్‌పూర్.
- హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ- రాయ్‌పూర్.
- గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ- గాంధీనగర్.
- డా. రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ- లక్నో.
- రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా- పంజాబ్.
- చాణక్య నేషనల్ లా యూనివర్సిటీపాట్నా.
- ద నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ -కోచి.
- నేషనల్ లా యూనివర్సిటీకటక్ (ఒడిశా).
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లారాంచి.
- నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీఅసోం.
- దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీవిశాఖపట్నం.
- తమిళనాడు నేషనల్ లా స్కూల్-తిరుచిరాపల్లి.
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ-ముంబై.
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ -నాగ్‌పూర్.
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీఔరంగాబాద్.
- హిమాచల్‌ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీసిమ్లా.
- ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంపీడీఎన్‌ఎల్‌యూ)జబల్‌పూర్.
ఆఫ్‌లైన్‌కు కారణమదే..
క్లాట్-యూజీ 2019ను తిరిగి గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించడానికి ముఖ్య కారణం.. ఆన్‌లైన్ విధానంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థుల నుంచి వినతులు రావడమే. దీంతో లా యూనివర్సిటీల కన్సార్షియం 2019 నుంచి క్లాట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలనే అభిప్రాయాన్ని ఆమోదించారు.
- ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, క్లాట్-2019 కన్వీనర్, వీసీ, నేషనల్ లా యూనివర్సిటీ-కటక్.
Published date : 18 Jan 2019 12:23PM