Skip to main content

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్

ఏటా లా పట్టా అందుకుంటున్న వేల మంది విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, న్యాయవాద వృత్తి చేపట్టే సంసిద్ధత కోసం రూపొందించిందే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షను న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఏటా జూన్/జూలై, నవంబర్/డిసెంబర్‌లో రెండు సార్లు జరిగే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అభ్యర్థులు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను ప్రారంభించవచ్చు.
  • అర్హత: ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఆయా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకుని ఉండాలి. ఉత్తీర్ణత సాధించకపోతే ఎన్నిసార్లయినా పరీక్షను రాయవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లతోపాటు రిపీటర్లందరికీ అవకాశం ఉంటుంది.
  • అప్లికేషన్ ఫీజు: ఫ్రెష్ గ్రాడ్యుయేట్, రిపీటెడ్ అభ్యర్థి రూ.2,500 చలానా రూపంలో చెల్లించాలి. దీనికి ఎస్‌బీఐ సర్‌చార్జి రూ.60 అదనం. రూ.2,500, ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి ఫీజు మొత్తాన్ని చలాన్ రూపంలో మాత్రమే చెల్లించాలి.
  • పరీక్ష విధానం: పరీక్షను ఆఫ్‌లైన్లో వందమార్కులకు నిర్వహిస్తారు. సమయం 3 గంటల 30 నిమిషాలు. న్యాయవిద్యలోని 19 విభాగాల నుంచి వెయిటేజీ ప్రకారం వంద ఆబ్జెక్టివ్ బిట్లు ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు లేవు. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ అకడెమిక్ సబ్జెక్టుల ఆధారంగా ఉంటాయి. కేవలం మెమరీ టెస్టింగ్ కాకుండా సంబంధిత సబ్జెక్టుల్లో లాజికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. గ్రాడ్యుయేట్ డిగ్రీలోని సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. వీటికి సంబంధించిన మెటీరియల్‌ను కూడా దర ఖాస్తుదారులకు బార్ కౌన్సిల్ అందిస్తోంది.
  • కేస్‌స్టడీ సంబంధ ప్రశ్నలూ కీలకమే: కేస్ స్టడీ సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడగనున్నారు. నిర్దేశిత సంబర్భంలో ఎలాంటి సెక్షన్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చనే పరిజ్ఞానం ఉంటే వీటిలో రాణించడం సులువు. వీటితోపాటు కొన్ని సందర్భాలు వాటికి సంబంధించిన ప్రిన్సిపుల్స్ ఇచ్చి వాటి ద్వారా ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం గుర్తించాల్సిన ప్రశ్నలు కూడా అడుగుతారు. సిలబస్‌లో పేర్కొన్న ప్రతి చాప్టర్ నుంచి ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
  • పరీక్షా కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 40 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్టణంలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
  • 11 భాషల్లో రాసుకోవచ్చు: ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ను 11 భాషల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల అధికశాతం మంది అభ్యర్థులకు త మ మాతృభాషలో పరీక్ష రాసుకునే సదుపాయం కలుగుతోంది. దరఖాస్తు సమయంలో ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయడం ద్వారా ఆ భాషలోనే ప్రశ్నపత్రాన్ని, ప్రిపరేషన్ మెటీరియల్‌ను అందుకోవచ్చు.
  • ఉత్తీర్ణతాశాతం: ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో సాధించాల్సిన కనీస ఉత్తీర్ణత 40 శాతం. ఇది సాధించిన వారికే సర్టిఫికెట్ లభిస్తుంది. అయితే సర్టిఫికెట్లో అభ్యర్థులు పొందిన మార్కులను పేర్కొనరు. పాస్/ఫెయిల్ అనే విషయమే స్పష్టం చేస్తారు. ఉత్తీర్ణత సాధించని వారు మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు.

వెయిటేజీ:
ఏఐబీఈ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా అబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. న్యాయ విద్యలోని వివిధ రకాల సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

లిమిటేషన్ యాక్ట్ (2), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (2), ఫ్యామిలీ లా (2), జ్యూరిస్‌ప్రూడెన్స్ (3), అడ్మినిష్ట్రేషన్ లా (3), ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్ కాండక్ట్ అండర్ బీసీఐ రూల్స్ (4), ఏడీఆర్, ఆర్బిట్రేషన్ యాక్ట్ (4), కంపెనీ లా2013 (4), కాన్‌స్టిట్యూషన్ లా (5), ఎన్విరాన్‌మెంటల్ లా (5), సీపీసీ (5), పబ్లిక్ ఇంటర్నేషనల్ లా (5), సైబర్ లా (5), ఐపీసీ (6), లేబర్, ఇండస్ట్రియల్ లా (6), లా ఆఫ్ టోర్ట్, ఇన్‌క్లూడింగ్ మోటార్ వెహికిల్ యాక్సిడెంట్స్ అండ్ కన్య్యూమర్ ప్రొటెక్షన్ లా (6), ఎవిడెన్స్ (8), సీఆర్‌పీసీ (10), లా ఆఫ్ కాంట్రాస్ట్, స్పెషిఫిక్ రిలీఫ్, ప్రాప్ లాస్, స్పెషల్ కాంట్రాక్ట్ ఎన్‌ఐ యాక్ట్ (15).

ముఖ్య సమాచారం:
  • ఆఫ్‌లైన్ దరఖాస్తుల అమ్మకం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లకు చివరితేదీ: నవంబరు 12, 2015
  • ఆన్‌లైన్ దరఖాస్తులు నింపేందుకు చివరితేదీ: నవంబరు 16, 2015
  • ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు చివరితేదీ: నవంబరు 18, 2015
  • ఫీజు చెల్లించేందుకు చివరితేదీ (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్): నవంబరు 13, 2015
  • హాల్ టిక్కెట్ల జారీ: డిసెంబరు 2 నుంచి
  • పరీక్ష తేదీ: డిసెంబరు 13, 2015
  • వెబ్‌సైట్: www.barcouncilofindia.org
Published date : 06 Nov 2015 11:35AM

Photo Stories