తల్లిపాల వారోత్సవాలు: శిశువులకు తల్లి పాలే శ్రేయస్కరం
Sakshi Education
జనగామ రూరల్: నవజాత శిశువులకు తల్లి పాలే శ్రేయస్కరం అని జిల్లా సంక్షేమాధికారి జయంతి అన్నారు. గురువారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని సత్రం కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, చిన్నారులు, తల్లులకు అవగాహన కల్పించారు.
మాట్లాడుతున్న జిల్లా సంక్షేమాధికారి జయంతి
ఈసందర్భంగా జయంతి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే పాలివ్వాలని, అమ్మపాలు అమృతంలాంటివన్నారు. నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహద పడతాయన్నారు. అపోహలు వీడి తప్పకుండా తల్లిపాలు తాగించాలని, బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పూర్ణిమ, టీచర్లు స్వర్ణలత, అనిత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.