Skip to main content

కెరీర్ గెడైన్స్.. పౌల్ట్రీ ఫార్మింగ్

ఏటా పది నుంచి పదిహేను శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్నరంగం పౌల్ట్రీ. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, ఆహార అలవాట్లు మారడం వంటి కారణాలు కూడా దేశంలో పౌల్ట్రీ రంగ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సులకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

అవకాశాలు.. విభాగాలు:
పౌల్ట్రీ రంగంలో ప్రధానంగా న్యూట్రిషన్, బ్రీడింగ్, హేచరీ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ అండ్ ప్రాసెసింగ్, హెల్త్ అండ్ బయో సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ ప్రొడక్ట్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉపాధి సొంతం చేసుకోవచ్చు.

ఉపాధి వేదికలు: బోధన, పరిశోధన, పౌల్ట్రీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా ప్రవేశించవచ్చు. ప్రభుత్వ విభాగంలో వెటర్నరీ ఆఫీసర్, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ హోదాలు కూడా పొందవచ్చు.

స్వయం ఉపాధి: పౌల్ట్రీ రంగంలో సర్టిఫికెట్ పొందిన వారు సొంత ప్రాక్టీస్ కూడా నిర్వహించవచ్చు. స్పెషలైజేషన్ సబ్జెక్టుల ఆధారంగా పౌల్ట్రీ ఫార్మ్స్కు సలహాదారులుగా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా పీజీ పూర్తి చేసుకుంటే బ్రాయిలర్ పౌల్ట్రీ, ఇఎంయు ఫార్మింగ్ విభాగాల్లో సొంత యూనిట్లు కూడా నెలకొల్పవచ్చు. దీనికోసం నాబార్డ్ రుణం కూడా లభిస్తుంది.

కోర్సులు: పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారు ఐదేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎంవీఎస్సీ చేస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి.

బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ

కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్), మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స (ఎంవీఎస్సీ)
వెబ్సైట్: www.svvu.edu.in

డిప్లొమా కోర్సులు: పౌల్ట్రీ విభాగానికి సంబంధించి పలు డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
(వ్యవధి: ఆరు నెలలు; అర్హత: ఎనిమిదో తరగతి)
వెబ్సైట్: www.ignou.ac.in

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్
వెబ్సైట్: www.nios.ac.in
అన్నామలై యూనివర్సిటీ
వెబ్సైట్: www.annamalaiuniversity.ac.in
Published date : 12 Oct 2014 03:41PM

Photo Stories