Skip to main content

డిప్లొమా నుంచే కెరీర్‌కు బాటలు.. రూ.25వేల ప్రారంభ వేత‌నంతో కొలువులు..

పదో తరగతి తర్వాత అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సులతోనే చక్కటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

డిప్లొమా స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్‌ పరిశ్రమల్లో ప్లాంట్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ వంటి కొలువులు దక్కించుకోవచ్చు. వీరికి ప్రారంభంలోనే నెలకు రూ.20 వేల నుంచి 25 వేల వేతనం లభిస్తోంది. 


బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు. వీరు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల్లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లుగా చేరొచ్చు. మోన్‌శాంటో, గోద్రెజ్‌ ఆగ్రోవెట్, బేయర్‌ వంటి విత్తన, ఫర్టిలైజర్‌ కంపెనీల్లో టెక్నికల్‌ ఆఫీసర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. 


పీజీ పూర్తి చేసిన వారు ప్రొడక్షన్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్‌గా కంపెనీల్లో చేరొచ్చు. –పీహెచ్‌డీ ఉత్తీర్ణులు ఐసీఏఆర్, ఐఏఆర్‌ఐ తదితర అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీస్, ఇన్‌స్టిట్యూట్స్‌లో సైంటిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించే అవకాశం ఉంది. వీరు పలు ప్రైవేట్‌ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌ సంస్థల్లోనూ ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. 


అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసిన అభ్యర్థులు.. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌ సంస్థలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో ప్లాంట్‌ మేనేజర్స్, ఆపరేషన్స్‌ మేనేజర్స్, మార్కెటింగ్‌ ఆఫీసర్స్‌ వంటి హోదాలతో కెరీర్‌ ప్రారంభించొచ్చు. 

స్వయం ఉపాధి

అగ్రికల్చరల్‌ అనుబంధ కోర్సులు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువే. వీరు ప్రధానంగా ఆర్గానిక్‌ ఫార్మింగ్, ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో సొంతంగా స్టార్టప్‌ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో ఈ విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.

సర్కారీ కొలువులు..

అగ్రికల్చరల్‌ అనుబంధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు, ఉద్యాన శాఖ అధికారులు, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు వంటి పోస్ట్‌లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో..గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖల్లోనూ ఉన్నత స్థాయి పోస్ట్‌లు దక్కించుకోవచ్చు. 


అగ్రికల్చర్‌ కోర్సులు.. ముఖ్యాంశాలు

  1. డిప్లొమా స్థాయిలో పలు అగ్రికల్చర్‌ కోర్సులు.
  2. డిప్లొమా అర్హతతోనే ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం.
  3. బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులతో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
  4. పీహెచ్‌డీ ఉత్తీర్ణులకు సైంటిస్ట్‌లుగా, అధ్యాపకులుగా అవకాశాలు.
  5. స్వయం ఉపాధికి ఊతంగా అగ్రి కోర్సులు.


కొలువు ఖాయం..

అగ్రికల్చరల్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో డిప్లొమా అగ్రికల్చర్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సొంతం చేసుకునే విధంగా కృషి చేయాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ కోర్సులపై మరింత అవగాహన పెంచుకోవాలి. కోర్సుల్లో ప్రవేశాల పరంగా వారికి ప్రత్యేకంగా సీట్ల రిజర్వేషన్‌ విధానం అమలవుతోంది. 

– ప్రొ‘‘ ప్రవీణ్‌ రావు, వైస్‌ ఛాన్స్‌లర్, పీజేటీఎస్‌ఏయూ

ఇంకా చ‌ద‌వండి : part 1: కొలువుల క‌ల్పన‌లో అగ్రిక‌ల్చర‌ల్ సైన్స్‌.. అగ్రి కోర్సుల గురించి తెలుసుకోండిలా..

Published date : 21 May 2021 03:24PM

Photo Stories