Skip to main content

విద్యారంగానికి రూ. 11,216 కోట్లు

  • గతేడాది విద్యారంగానికి రూ. 10,956.36 కోట్లు (మొత్తం బడ్జెట్‌లో 10.88%) కేటాయించగా, ఈసారి రూ. 11,216.10 కోట్లు (9.7%) దక్కాయి.
  • పాఠశాల విద్యలో ప్రణాళిక వ్యయం కింద గత ఏడాది రూ. 3,510.56 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది.
  • గురుకులాలకు రూ. 75 కోట్లను కేటాయించింది. మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటికే ప్రారంభించిన స్కూళ్ల కోసం రూ. 216 కోట్లు కేటాయించింది.
  • కేంద్ర సహకారంతో కొనసాగే పథకాలకు రాష్ర్టం తరఫున గత ఏడాది రూ. 2,795.48 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 713.35 కోట్లను మాత్రమే ఇచ్చింది.
  • బాసరలోని ట్రిపుల్ ఐటీ నిర్వహణ కోసం గతేడాది రూ. 119 కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని రూ. 93 కోట్లకు తగ్గించింది.
  • బడ్జెట్‌లో యూనివర్సిటీలకు రూ. 416.15 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ. 291.76 కోట్లతో పోల్చితే ఇది రూ. 124.39 కోట్లు అదనం.
  • ఉస్మానియా వర్సిటీకి గత బడ్జెట్‌లో రూ. 170.14 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 238.19 కోట్లు కేటాయించారు.
  • కాకతీయ వర్సిటీకి రూ. 19.15 కోట్లను, శాతవాహన వర్సిటీకి రూ. 13.43 కోట్లను అదనంగా కేటాయించారు.
  • సాంకేతిక విద్యకు గత బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం కింద రూ. 181.11 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 253.80 కోట్లకు పెంచారు. ప్రణాళికా వ్యయం కింద గతేడాది రూ. 212.85 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 255.41 కోట్లు కేటాయించారు.
  • జేఎన్టీయూకు గత ఏడాది రూ. 39.60 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 55.44 కోట్లకు పెంచారు. అంటే అదనంగా రూ. 15.84 కోట్లు కేటాయించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,677 కోట్లు..
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,677.72 కోట్లు కేటాయించింది.
  • బీసీ సంక్షేమశాఖకు రూ.1,367 కోట్లు, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖకు రూ.646.52 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖకు రూ.425 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.239.20 కోట్లు కేటాయించారు.
  • రాష్ట్రంలో గతేడాది 61,78,495 మంది విద్యార్థులు బడుల్లో చేరగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 60,76,741కు పరిమితమైంది.
  • డ్రాపౌట్స్ బాలికల్లో (36.41%)కంటే బాలురలోనే (38.85%) ఎక్కువగా ఉంది.

Budget 2015 - 16


Budget 2015 - 16

Published date : 12 Mar 2015 05:55PM

Photo Stories