Skip to main content

Andhra Pradesh Budget 2022 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022–23

Andhra Pradesh Budget 2022-23 Highlights: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను మార్చి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యతతో అన్ని వర్గాలకు అండగా నిలిచే విధంగా.. మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో రూపొందించిన ‘‘2022–23 బడ్జెట్‌’’ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
Buggana Rajendranath

పేదరికాన్ని జయించడమే చాలా సమస్యల పరిష్కారానికి సరైన మార్గం అని, ఆ దిశగా బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు జరిగేలా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే లక్ష్య సాధనకు ఇంజన్‌లా పనిచేస్తున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, సామాజిక భద్రత అంశాలకు బడ్జెట్‌ సమ ప్రాధాన్యత ఇచ్చింది. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు వెనక ఉన్న మూలాధార సూత్రాన్ని బడ్జెట్‌ ప్రతిబింబించింది. వార్షిక బడ్జెట్‌ 2022–23ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి శాసన మండలికి సమర్పించారు.

బడ్జెట్‌ అంచనాలివే.. (రూ.కోట్లలో)

మొత్తం బడ్జెట్

2,56,256.56

రెవెన్యూ ఆదాయం

1,91,225.11

రెవెన్యూ వ్యయం

2,08,261.26 

కేపిటల్‌ వ్యయం

30,679.57

కేంద్ర పన్నుల్లో వాటా

33,050

కేంద్ర గ్రాంట్లు

56,033

రెవెన్యూ లోటు

17,036.15

ద్రవ్యలోటు

48,724.11

 

రూపాయి వచ్చేదిలా.. ఖర్చయ్యేదిలా.. (రూ. కోట్లలో)

రాబడి..

రెవెన్యూ వసూళ్లు

1,91,225.11

ప్రభుత్వ రుణం

64,816.00

ప్రభుత్వ పద్దు

178.29

రుణ వసూళ్లు

37.16

వ్యయం..

రెవెన్యూ వ్యయం

2,08,261.26

మూలధన వ్యయం

30,679.57

రుణ చెల్లింపులు

16,270.18

రుణాలు, అడ్వాన్సులు

1,045.55

Budget Comprehensive

ముఖ్య రంగాలు/పథకాలు/శాఖలు : కేటాయింపులు

రంగం/శాఖ/పథకం

కేటాయింపులు(రూ. కోట్లలో)  

మహిళల అభివృద్ధి

55,015.20 

పిల్లలు, చిన్నారులు

16,903.17 

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

18,000 

రైతుల సంక్షేమం

43,052 

వైఎస్సార్‌ ఆసరా

6,400 

వైఎస్సార్‌ చేయూత

4,235.95 

అమ్మ ఒడి

6,500 

సాగునీటి ప్రాజెక్టులు

11,482 

ఎస్సీ ఉప ప్రణాళిక

18,518 

ఎస్టీ ఉప ప్రణాళిక

6,145 

బీసీ ఉప ప్రణాళిక

29,143 

మైనారిటీ ఉప ప్రణాళిక

3,662  

కాపుల సంక్షేమం

3,532 

ఈబీసీల సంక్షేమం

6,669 

విద్యా రంగం

30,077.20

ఆరోగ్య రంగం

15,384  

స్కూళ్లలో నాడు–నేడు

3,500 

ఆస్పత్రుల్లో నాడు–నేడు

2,848 

పేదల ఇళ్ల నిర్మాణాలు

4,791.69 

నియోజకవర్గాల అభివృద్ధి నిధి

350

రంగాలవారీగా బడ్జెట్‌ ఇలా(రూ. కోట్లలో..) 
మొత్తం బడ్జెట్‌ రూ. 2,56,256.56 కోట్లు
1 ఆర్థిక సేవలకు కేటాయింపులు: మొత్తం రూ. 69,306.74 కోట్లు

Economic Services


2. సామాజిక సేవల వారీగా.. : మొత్తం రూ. 1,13,340.20 కోట్లు

Social Services

3. సాధారణ సేవలు: మొత్తం రూ. 73,609.63 కోట్లు  

పథకాలకు కేటాయింపులు ఇలా(రూ. కోట్లలో..)

Schemes

ఆర్యోగ్య రంగం

Healthcare

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2021–22తో పోలిస్తే 11.23 శాతం అదనంగా నిధులు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.13,830.43 కోట్లు కేటాయించగా 2022–23 బడ్జెట్‌లో రూ. 15,384.26 కోట్లకు పెంచింది. దాదాపు కోటిన్నర కుటుంబాలను ఆదుకుంటున్న అపర సంజీవని లాంటి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

వైద్యం, కుటుంబ సంక్షేమం (రూ.కోట్లలో)

Health Graph

నాడు–నేడుతో ఆస్పత్రులు బలోపేతం
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రం మారిపోయింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.1,603 కోట్లు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల అప్‌గ్రేడ్‌ కోసం రూ.350 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది.

తొలగిన చీకట్లు.. 
రాష్ట్రంలో 5.6 కోట్ల మందికి ఉచితంగా సమగ్ర, నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 16,64,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్న 8.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు 1.55 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు.

కరోనాకు ఉచిత వైద్యం
కరోనా బాధితులు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో తొలిసారిగా అర్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,09,765 మందికి చికిత్స కోసం రూ.732.16 కోట్లు ఖర్చు చేసింది.

వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయింపుల్లో ప్రధానమైనవి(కేటాయింపులు రూ.కోట్లలో)

  • గిరిజన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు : 170
  • ఆసుపత్రులతో కూడిన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు : 320
  • కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు : 250.45
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి : 40
  • ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు కోసం : 100 
  • రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ : 45 
  • రోగనిర్ధారణ మౌలిక సదుపాయాలకు : 126 
  • హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలుగా పీహెచ్‌సీల మార్పు కోసం : 124.58 
  • ఆశా వర్కర్ల వేతనాల చెల్లింపులు : 343.96 
  • 108, 104 సర్వీసులు : 273.40 
  • వైద్య కళాశాలలు : 730 
  • ఏపీవీవీపీ పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పన : 780.71
  • డ్రగ్‌ కంట్రోల్‌ ల్యాబ్‌లు, డ్రగ్‌ రెగ్యులేటరీ సిస్టమ్‌ బలోపేతం, తదితరాలు : 71.94 
  • ఎన్‌హెచ్‌ఎం : 2,462.03 
  • ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్స్‌ : 280.70
  • ప్రస్తుత బోధనాస్పత్రులకు : 1,026   
  • ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ : 250
  • ఎన్‌హెచ్‌ఎం మౌలిక వసతుల నిర్వహణ : 695.88 
  • ఈహెచ్‌ఎస్‌ పథకం : 140
  • వైఎస్సార్‌ కంటివెలుగు : 20

విద్యా రంగం​​​​​​​

School

జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్యకు రూ.27,706.66 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.23,269.48 కోట్లు కేటాయించగా ఈసారి 12.52 శాతం మేర కేటాయింపులు పెంచింది. వీటికి అదనంగా అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, నాడు–నేడు కార్యక్రమానికి రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. అమ్మ ఒడి కింద గత ఏడాదిలో 84 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది.

పాఠశాల విద్యకు కేటాయింపులు ఇలా (రూ.కోట్లలో..) 

  • 2021–22: 23,269.48
  • 2022–23: 27,706.66

విద్యా రంగం కేటాయింపులు (రూ.కోట్లలో)

Education Graph

జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
రాష్ట్రంలో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులపై నయాపైసా ఫీజుల భారం పడకుండా అమల్లోకి తెచ్చిన ‘జగనన్న విద్యా దీవెన’,  ‘జగనన్న వసతి దీవెన’ పథకాలకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. జగనన్న విద్యా దీవెన పథకానికి గత ఏడాదిలానే ఈసారి బడ్జెట్‌లో కూడా రూ. 2,500 కోట్లను ప్రతిపాదించింది. అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2083.32 కోట్లు కేటాయించింది.

2021–22 సోషియో ఎకనమిక్‌ సర్వే ప్రకారం బీటెక్, బీఫార్మా, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న 21.55 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.6,259.72 కోట్లు వెచ్చించింది. ఇక వసతి దీవెన కింద 18.78 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,305 కోట్ల మేర లబ్ధి చేకూరింది.

9 జూనియర్‌ కళాశాలలకు కొత్త భవనాలు
ఇంటర్మీడియెట్‌ విద్యకు సంబంధించి 2022–23 బడ్జెట్లో రూ.896.30 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 9 జూనియర్‌ కాలేజీలకు కొత్తగా భవనాల నిర్మాణానికి నిర్ణయించింది. ఇంటర్మీడియెట్‌ విద్యలో వృత్తి విద్యను బలోపేతం చేయడానికి రూ.23.91 కోట్లను కలిపి మొత్తంగా పాఠశాల విద్యకు రూ.27,706.65 కోట్లను కేటాయించింది.

నైపుణ్యాభివృద్ధికి రూ.969.91 కోట్లు 
చదువులు ముగించే నాటికి ప్రతి విద్యార్థీ ఉన్నతమైన నైపుణ్యాలు, సామర్థ్యాలతో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలను అలవర్చేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. నైపుణ్య వర్సిటీ ఏర్పాటుతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతున్నారు. ఇందుకోసం గత రెండేళ్లుగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. 2021–22లో నైపుణ్యాభివృద్ధికి రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా.. 2022–23 బడ్జెట్‌లో నిధులు మరింత పెంచి రూ.969.91 కోట్లు కేటాయించారు.

ఉన్నత, సాంకేతిక విద్యారంగానికి రూ.2,014.30 కోట్లు
రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతానికి వీలుగా ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో కేటాయింపులు చేసింది. వర్సిటీలకు అండదండలందిస్తూ నిధులు ప్రతిపాదించింది. తాజా బడ్జెట్లో ఉన్నత, సాంకేతిక విద్యకు రూ.2,014.30 కోట్లు కేటాయించింది. వివిధ సంప్రదాయ వర్సిటీలు, స్పెషలైజ్డ్‌ వర్సిటీలకు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, ఉన్నత విద్యామండలికి మొత్తంగా రూ.738.84 కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. సాంకేతిక వర్సిటీలకు రూ.710 కోట్లు ప్రతిపాదించింది.

వివిధ వర్సిటీలకు బడ్జెట్‌ కేటాయింపులు ఇలా (రూ.కోట్లలో)

ఆదికవి నన్నయ

8.44

అంబేడ్కర్

7.01

ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ

4.00

ఆంధ్రా వర్సిటీ

280.00

ఏపీఎస్‌సీహెచ్‌ఈ

4.50

క్లస్టర్‌ వర్సిటీ, కర్నూలు

1.20

ద్రవిడ వర్సిటీ

18.48

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ

5.00

వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్‌

7.61

కృష్ణా వర్సిటీ

7.50

నాగార్జున వర్సిటీ

50.00

తెలుగు వర్సిటీ

4.00

రాయలసీమ వర్సిటీ

8.00

శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ

65.87

పద్మావతి మహిళా వర్సిటీ

52.23

శ్రీవెంకటేశ్వర వర్సిటీ

170.00

ఉర్దూ వర్సిటీ

1.20

విక్రమ సింహపురి వర్సిటీ

12.87

యోగి వేమన వర్సిటీ

30.40

సాంకేతిక వర్సిటీలు..

జేఎన్‌టీయూ కాకినాడ

50.00

జేఎన్‌టీయూ అనంతపురం

53.01

ఆర్జీయూకేటీ

91.12

ఆస్తుల కల్పనకు..

ఆదికవి నన్నయ వర్సిటీ

10.00

క్లస్టర్‌ వర్సిటీ

10.00

వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ ఫైనార్ట్స్‌ వర్సిటీ

4.00

ఆర్జీయూకేటీ

50.00

రూసాకింద భవనాల నిర్మాణం

189.93

రాయలసీమ వర్సిటీ

5.00

యోగివేమన వర్సిటీ

66.33

విక్రమసింహపురి వర్సిటీ

1.46

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ

Village

ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, శాశ్వత భవనాల నిర్మాణం, ఇతరేతరా మెటీరియల్‌ పనులకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 5,000 కోట్లు కేటాయించింది. మొత్తంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 6.68 శాతం అధికంగా నిధులు కేటాయించింది. ఈ శాఖకు ప్రత్యేకంగా రూ.15,846.43 కోట్లు  కేటాయించగా, గ్రామీణాభివృద్ధి సెక్టర్‌ మొత్తానికి కలిపి రూ.17,109.06 కోట్లు కేటాయించింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సంఘం గ్రాంట్‌ రూపంలో రూ.2,233 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇవ్వడానికి రూ. 11.59 కోట్లు కేటాయించారు.

సెర్ప్‌ కార్యక్రమాలకు రూ.1,280.89 కోట్లు..
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) నినాదంతో పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్తగా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు  రూ. 500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. గ్రామీణ మహిళలు పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ అమలు, పేదరిక నిర్మూలనలో భాగమైన ఇతర సెర్ప్‌ కార్యక్రమాలకు రూ.1,280.89 కోట్లు కేటాయించారు. వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ. 6,400 కోట్లు, చేయూత పథకానికి రూ.4,235 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ రెండు పథకాల నిధులను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కాకుండా ఏపీఎస్‌డీసీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

కొత్తగా గ్రామీణ లింకు రోడ్లు నిర్మాణం
గ్రామాలను సమీపంలోని పెద్ద గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు కలుపుతూ కొత్తగా లింకు రోడ్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న లింకు రోడ్ల మరమ్మతులు చేపట్టడం వంటివి చేసే పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 2,098.59 కోట్లు కేటాయించింది. అందులో 250 మంది అంతకంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాలకు ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్టు ద్వారా కొత్తగా రోడ్ల నిర్మాణానికి రూ.700 కోట్లు కేటాయించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణానికి రూ.300 కోట్లు,  పీఎంజీఎస్‌వైలో మరో రూ.600 కోట్లు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది.

గ్రామీణ తాగు నీటికి రూ. 2,133 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పనకు ఈ బడ్జెట్‌లో రూ. 2,133 కోట్లు కేటాయించారు. ఉద్దానం ప్రాంతంతో పాటు పులివెందుల, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాటర్‌ గ్రిడ్‌ పథకం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక ఏడాదిలో చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ నీటి ఇబ్బందులున్న ప్రాంతాల్లో  వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు నిర్ణయించింది. 

పట్టణాభివృద్ధికి రూ. 8,796.33 కోట్లు

Towns

మునిసిపాలిటీల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి కోసం మొత్తం రూ. 8,796.33 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా ప్రజలందరికీ తాగునీరు, అన్ని ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్యం, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, అన్ని రకాల సేవలను నూరు శాతం వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

కేటాయింపులు ఇలా..

  • నూతన రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ. 800 కోట్లు
  • కొత్త రాజధాని నగరం ల్యాండ్‌ పూలింగ్‌ కోసం మరో రూ. 208.10 కోట్లు
  • ఏపీసీఆర్డీఏకు రూ. 200 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టిడ్కో) ప్రాజెక్టుకు రూ. 1,000 కోట్లు
  • పట్టణ తాగునీటి అవసరాలు తీర్చే అమృత్‌ తాగునీటి పథకానికి రూ. 400 కోట్లు  
  • స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు రూ. 1,000 కోట్లు 
  • మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ. 1,189 కోట్లు
  • మునిసిపల్‌ వార్డు వలంటీర్ల గౌరవ వేతనాలకు  రూ. 400 కోట్లు

ఆర్‌ అండ్‌ బీ శాఖ

Road

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందుకు అనుగుణంగా ఆర్‌ అండ్‌ బీ శాఖకు కేటాయింపులు పెంచింది. 2021–22 బడ్జెట్‌లో రూ.7,594.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2022–23 ఏడాది బడ్జెట్‌లో.. అంతకంటే రూ.987.06 కోట్లు అధికంగా (13 శాతం) రూ.8,581.25 కోట్లు కేటాయించింది.

రెండు లేన్ల రోడ్డుతో కనెక్టివిటీ
ప్రధానంగా మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ ‘ఏపీ మండల కనెక్టివిటీ, గ్రామీణ కనెక్టివిటీ అభివృద్ధి ప్రాజెక్టు’, ‘రాష్ట్ర రోడ్లు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు’లను ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఇప్పటికే న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణ సహకారంతో రూ.6,400 కోట్లతో 2,522 కి.మీ. మేర రోడ్ల విస్తరణ పనులు, 464 వంతెనల నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది అదనంగా 8,268 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. ఎన్‌డీబీ రుణ సహకారంతో మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతోనూ, ఓ మండల కేంద్రాన్ని మరో మండల కేంద్రంతోనూ అనుసంధానిస్తూ రెండు లేన్ల రోడ్లను నిర్మిస్తారు.  మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించింది. 

ప్రధాన కేటాయింపులు ఇలా..

  • రాష్ట్రంలో మండల, గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.515.93 కోట్లు.
  • రాష్ట్ర ప్రధాన రోడ్లు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు రూ.516.36 కోట్లు 
  • కోర్‌ నెట్‌వర్క్‌ రోడ్ల నిర్మాణానికి రూ.405 కోట్లు.
  • జిల్లా ప్రధాన రహదారులు, ఇతర ప్రధాన రహదారులకు రూ.338.80 కోట్లు 
  • రైల్వే భద్రత ప్రాజెక్టుల్లో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు 
  • కేంద్రంతో కలసి రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు 
  • మావోయిస్టు పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.125 కోట్లు  
  • కేంద్ర రహదారుల నిధితో చేపట్టే జాతీయ రహదారుల విస్తరణకు భూ కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.400 కోట్లు   
  •  పీపీపీ ప్రాజెక్టులకు రూ.164.89 కోట్లు  
  • అనంతపురం–అమరావతి జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.100 కోట్లు

జెండర్‌ బడ్జెట్‌

Womens

మహిళా సాధికారతకు కొండంత అండగా నిలుస్తున్న సర్కారు ఈసారి కూడా మహిళా (జెండర్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది బడ్జెట్‌లో మహిళలు, బాలికల సంక్షేమానికి రూ.47,283.21 కోట్లు కేటాయించగా.. 2022–23 సంవత్సరానికి కింద రూ.55,015.21 కోట్లు ప్రతిపాదించింది. నిర్దేశించిన పథకాల్లో నూరు శాతం నిధులు మహిళలకే ఖర్చు చేసేలా రూ.27,697.57 కోట్లు కేటాయించారు. పలు పథకాల్లో 30% నుంచి 60 % నిధులు మహిళలకు కేటాయించేలా మరో రూ. 27,317.64 కోట్లు కేటాయించారు.  2 విభాగాలుగా వీటిని వర్గీకరించారు. పార్ట్‌–ఎ విభాగంలో 17 పథకాలు, పార్ట్‌–బి విభాగంలో 32 పథకాలు మహిళలకు వర్తించేలా నిర్దేశించారు. 49 ప్రభుత్వ పథకాల ద్వారా రూ.55,015.21 కోట్లు ఖర్చు చేయనున్నారు.

జెండర్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఇలా..(రూ.కోట్లలో)

  • 2021–22: 47,283.21
  • 2022–23: 55,015.21
  • గతేడాది కంటే అదనంగా కేటాయించిన నిధులు 7,700

చిన్నారులకు రూ.16,903.17 కోట్లు
గతేడాది చిన్నారులకు రూ.16,748.47 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 2022–23లో మొత్తం రూ.16,903.17 కోట్లు కేటాయించింది. చిన్నారుల కోసమే నూరు శాతం నిధులు ఖర్చు చేసే(పార్ట్‌–ఎ) 15 పథకాలకు రూ.13,117.69 కోట్లు, 100% కంటే తక్కువ నిధులు ఖర్చు చేసే (పార్ట్‌–బి) 18 పథకాలకు రూ.3,785.48 కోట్లు కేటాయించారు.

సంక్షేమ రంగం

Navaratna-Schemes-Logo

కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ఈ నాలుగు స్తంభాలు కీలకం అని చెప్పారు.

సంక్షేమ కేటాయింపులు ఇలా(రూ. కోట్లలో..)

  • వైఎస్సార్‌ పింఛన్‌ పథకం కోసం రూ.18,000 కోట్లు  
  • వైఎస్సార్‌ బీమా పథకం కోసం రూ.372.12 కోట్లు
  • వైఎస్సార్‌ వాహన మిత్ర కోసం రూ.260 కోట్లు 
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు 
  • తోపుడు బండ్ల వారి కోసం జగనన్న తోడుకు రూ.25 కోట్లు
  • జగనన్న చేదోడు కోసం రూ.300 కోట్లు
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కోసం రూ.590 కోట్లు
  • వైఎస్సార్‌ లా నేస్తం కు రూ.15 కోట్లు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు  
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి, షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కోసం రూ.18,518 కోట్లు
  • షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళిక కోసం రూ.6,145 కోట్లు
  • వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం 29,143 కోట్లు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం రూ.3,661 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

మరికొన్ని కేటాయింపులు ఇలా..

  • వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ యోజన కోసం రూ.3,900 కోట్లు 
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కోసం రూ.1,802 కోట్లు 
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు
  • రైతు భరోసా కేంద్రాలకు రూ.50 కోట్లు 
  • వైఎస్సార్‌ వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు
  • ఉచిత విద్యుత్‌కు రూ.5,000 కోట్లు 
  • పశు సంవర్థక, మత్స్య అభివృద్ధికి రూ.1,568.83 కోట్లు   
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.300 కోట్లు కేటాయింపు 
  • ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,384.26 కోట్లు  
  • వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,400 కోట్లు  
  • స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కోసం రూ.800 కోట్లు  
  • చేయూత పథకానికి రూ.4,235.95 కోట్లు 
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.4,322.86 కోట్లు  

అంగన్‌వాడీ కేంద్రాలకు నిధులు పుష్కలం
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఆరోగ్యంతోపాటు పౌష్టికాహారం అందించేలా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో పుష్కలంగా నిధులు కేటాయించింది. వివిధ కార్యక్రమాలకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలకు నిధుల కేటాయింపు ఇలా..

  • అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0(ఐసీడీఎస్‌)కు రూ.1,517.64 కోట్లు 
  • వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.201.82 కోట్లు  
  • అంగన్‌వాడీల్లో అనుబంధ పోషకాహారం సరఫరాకు రూ.1,200 కోట్లు
  • అంగన్‌వాడీ పోషణ్‌ అభియాన్‌కు రూ.120.63 కోట్లు 
  • అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ.160 కోట్లు 
  • వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.901.56 కోట్లు 
  • చిన్నారుల సంరక్షణ, సంక్షేమానికి రూ.53.80 కోట్లు   

పారిశ్రామిక రంగం

Industrial

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి కలిపి రికార్డు స్థాయిలో రూ.5,081.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.4,779.1 కోట్లతో పోలిస్తే ఇది 6.32 శాతం అదనం. ఇందులో ఒక్క పారిశ్రామిక మౌలిక వసతులకే రూ.1,142.53 కోట్లు వ్యయం చేయనున్నారు.  పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు కేటాయించారు.

కేటాయింపులు ఇలా..

  • నైపుణ్యాభివృద్ధికి రూ.969.91 కోట్లు 
  • పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు
  • ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు  
  • ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు 
  • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.175 కోట్లు 
  • ఐటీ రంగ కంపెనీల ప్రోత్సాహకాలకు రూ.60 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.411.62 కోట్లు  
  • విశాఖ–చెన్నై కారిడార్‌ అభివృద్ధికి రూ.611.86 కోట్లు  
  • ఏపీఐఐసీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.236.86 కోట్లు
  • విద్యుత్‌ సదుపాయాల కోసం రూ.125 కోట్లు 
  • మౌలిక వసతులకు రూ.1,142.53 కోట్లు  

కొన్ని ముఖ్య కేటాయింపులు ఇలా..

  • వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద వివిధ వర్సిటీలకు రూ.336.72 కోట్లు
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఫ్రేమ్‌వర్కు కింద డిగ్రీ కాలేజీలను ‘సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లుగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత కింద మహిళల కోసం రూ.4,235.95 కోట్లు
  • పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా కోసం రూ.6,400 కోట్లు 
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు  రూ.43,052 కోట్లు 
  • వైఎస్సార్‌ రైతు భరోసా కోసం రూ.3,900 కోట్లు
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కోసం రూ.1,802.04 కోట్లు 
  • రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు 
  • విద్యా రంగానికి రూ.30,077.20 కోట్లు. ఈ రంగంలో నాడు–నేడు కోసం రూ.3,500 కోట్లు 
  • ఆరోగ్య రంగానికి రూ.15,384.26 కోట్లు
  • వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు రూ.2,600 కోట్లు
  • ఆస్పత్రుల్లో నాడు–నేడు కోసం రూ.2,848.00 కోట్లు   
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద రూ.18,000 కోట్లు 
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,482.37 కోట్లు 
  • పేదల గృహాల నిర్మాణాల కోసం రూ.4,791.69 కోట్లు 
  • వివిధ రంగాల్లో సంక్షేమానికి రూ.45,955.07 కోట్లు 
  • జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు
  • ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.18,518 కోట్లు
  • ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,145 కోట్లు
  • బీసీ ఉప ప్రణాళికకు రూ.29,143 కోట్లు
  • మైనారిటీ ఉప ప్రణాళికకు రూ.3,662 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.3,532 కోట్లు 
  • ఈబీసీల సంక్షేమానికి రూ.6,669 కోట్లు 
  • గ్రామీణాభివృద్ధికి రూ.17,109.06 కోట్లు   
  • పౌరసరఫరాల శాఖకు రూ.3,719.24 కోట్లు  
  • నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.4,791.69 కోట్లు  
  • అర్చకుల కనీస వేతనాలకు రూ.120 కోట్లు   
  • హోంశాఖకు రూ.7,586 కోట్లు  
  • వ్యవసాయ ఉచిత విద్యుత్‌కే రూ. 5 వేల కోట్లు 
  • ఆక్వా రంగానికి అందించే సబ్సిడీ విద్యుత్తుకు రూ. 500 కోట్లు 
  • ఇంధన శాఖకు మొత్తం రూ.10,281 కోట్లు   
  • జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ కింద.. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేసేందుకు రూ.55,015.20 కోట్లు
  • పిల్లలు, చిన్నారుల  కోసం ప్రత్యేకంగా రూ.16,903.17 కోట్లు  

రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు

Income

రూ.2,56,256.56 కోట్ల బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.30,679.57 కోట్లు, మరో రూ.16,270.18 కోట్లు క్యాపిటల్‌ డిస్‌బర్స్‌మెంట్‌ (మూల ధన పంపిణీ) ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724.11 కోట్లు ఉంటుందని అంచనా. రెవెన్యూ రాబడి రూ.1,91,225.11 కోట్లు ఉంటుందని, ఇందులో కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.33,050.00 కోట్లు, పన్ను ఆదాయం రూ.91,049.61 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.11,092.50 కోట్లు, గ్రాంట్లు రూపంలో రూ.56,033.00 కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుండటంతో పాటు అప్పులు తగ్గుతుండటంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం తగ్గుతూ వస్తోంది. 2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.53% ఉండగా, 2021–22లో సవరించిన అంచనాల్లో అది 32.51 శాతానికి తగ్గింది. అలాగే 2022–23 ఆర్థిక ఏడాదిలో 32.79% ఉంటుందని అంచనా.

Published date : 22 Mar 2022 11:09AM

Photo Stories