Skip to main content

AP Budget 2023-24 Details : ప్రజా సంక్షేమ పథకాల‌కు కేటాయింపులు ఇలా.. ఈ పథకానికి భారీగా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రజా సంక్షేమమే పాటు.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జనరంజక బడ్జెట్‌ను మార్చి 16వ తేదీ (గురువారం) అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన‌ ఐదో బడ్జెట్‌ జనరంజకంగా ఉంది.
AP Budget 2023-24 Details telugu news
AP Budget 2023-24

పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

☛ రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
☛ మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
☛ రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
☛ ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
☛ జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
☛ ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

చ‌ద‌వండి : Andhra Pradesh Budget 2022 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022–23

AP Budget 2023-24లో ప్రజా సంక్షేమ పథకాల‌కు కేటాయింపులు ఇలా.. 

AP Budget 2023-24 Highlights in telugu

☛➤ వైఎస్సార్ పెన్షన్‌ కానుక రూ.21,434.72 కోట్లు

☛➤ వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు

☛➤ వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

☛➤ జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

☛➤ జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

☛➤ వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

☛➤ డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు

☛➤ రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు

☛➤ వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

☛➤ జగనన్న చేదోడు రూ.350 కోట్లు

☛➤ వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు

☛➤ వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

☛➤ వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125 కోట్లు

☛➤ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

☛➤ రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

☛➤ లా నేస్తం రూ.17 కోట్లు

☛➤  జగనన్న తోడు రూ.35 కోట్లు

☛➤ ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

☛➤ వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

☛➤ వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు

☛➤ వైఎస్సార్ చేయూత రూ.5,000 కోట్లు

☛➤ అమ్మఒడి రూ.6,500 కోట్లు

☛➤ జగనన్న విద్యా కానుక రూ.560  కోట్లు

చ‌ద‌వండి : Union Budget 2023: 2023–24 కేంద్ర బడ్జెట్‌ సమగ్ర స్వరూపం మీకోసం..

మొత్తంగా రూ.54,228.36 కోట్లు..

Budget Live Updates in telugu

☛ మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
☛ ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
☛ వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
☛ మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
☛ జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
☛ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
☛ పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
☛ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు
☛ యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు

చ‌ద‌వండి : Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

ఈ కులాలకు.. 

ap  budget 2023

☛ షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
☛ షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
☛ వెనుకబడిన తరగతుల సంక్షేమం​- రూ. 38,605 కోట్లు
☛ కాపు సంక్షేమం​- రూ.4,887 కోట్లు
☛ మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
☛ పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
☛ పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
☛ రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
☛ నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
☛ పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
☛ ఎనర్జీ- రూ.6,456 కోట్లు
☛ గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
☛ గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,700 కోట్లు..

ysr asara scheme budget 2023

☛ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన
☛ సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల
☛ దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్‌ కార్డుల జారీ
☛ ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం
☛ రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు
☛ ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలు
☛ విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు
☛ మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు
☛ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు
☛ వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు
☛ 17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
☛ లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది

ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి 11.43 శాతంతో..

ap economic survey 2023 24

☛ విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం
☛ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం
☛ నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
☛ స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది
☛ ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి 11.43 శాతం
☛ సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి
☛ రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు
☛ రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది
☛ పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ

చ‌ద‌వండి : Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Published date : 16 Mar 2023 11:59AM

Photo Stories