Skip to main content

Union budget 2023-24 Highlights in Telugu : శుభ‌వార్త‌.. మహిళల‌కు పెద్దపీట.. మ‌రిన్ని ప్రత్యేక‌ పథకాలు వీరి కోసం..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు.
union budget 2023-24 for women scheme
union budget 2023-24 details

2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. 

☛ Union Budget 2023-24 Records : ఆర్థిక మంత్రిగా.. నిర్మలా సీతారామన్ రికార్డులు ఇవే.. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయ‌నే..

మహిళలకు పెద్ద‌పీట‌..
ఈ బడ్జెట్‌లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్‌లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
Union Budget 2023-24 Highlights..

union budget 2023-24 highlights latest news telugu


☛ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెడెతున్న ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌..
☛ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న నిర్మ‌లాసీతారామ‌న్‌..

☛ మ‌త్య‌కారుల‌కు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయింపు..
☛ వ్య‌వ‌సారంగంలో స‌వాళ్లు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం..
☛ శ్రీఅన్న ప‌థ‌కం ద్వారా చిరుధాన్యాల పంట‌ల‌కు ప్రోత్సాహం
☛ రైతులు, మ‌హిళ‌లు, వెనుక‌బ‌డివారికి ప్రాధాన్య‌త‌
☛ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు..
☛ 157 కొత్త న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ఏర్పాటు..
☛ వ‌`ద్ధి రేటు 7 % ఉంటుంద‌ని అంచ‌నా..
☛ మ‌హిళ‌ల కోసం మ‌రిన్ని ప‌థకాలు..
☛ వ్య‌వ‌సాయ అభివ‌`ద్ధికి ప్ర‌త్యేక నిధి ఏర్పాటు..
☛ ఆత్మ‌నిర్భ‌న్ భార‌త్‌తో చేనేత వ‌ర్గాల‌కు చేయూత‌
☛ పీఎం ఆవాస్ యోజ‌న‌కు రూ.79 కోట్లు కేటాయింపు..
☛ కొన‌సాగ‌నున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
☛ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల అభివ‌`ద్దే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌..
☛ రైల్వేకు రూ.2.40 ల‌క్ష‌ల‌ కోట్లు కోటాయింపు..
☛ ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌కు 30,800 మంది ఉపాధ్యాయులు నియామ‌కం
☛ యువ‌త కోసం నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటు..
☛ గిరిజ‌న మిష‌న్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు..
☛ రాష్ట్రాల‌కు వ‌డ్డీలేని రుణాలు ప‌థ‌కం కోసం రూ.13.7 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు..
☛ క‌రువు ప్రాంత రైతుల‌కు రూ.5,300 కోట్లు కేటాయింపు..
☛ వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం పాన్‌, ఆధార్‌, డీజీ లాక్‌
☛  మొత్తం రూ.75 వేల కోట్లు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌..
☛ అర్బ‌న్ ఇన్ ఫ్రా ఫండ్ కింద ఏడాది రూ.10 వేల కోట్లు..
☛ 5జీ స‌ర్వీస్ కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటు..
☛ 50 ఏయిర్‌పోర్టులు, పోర్టుల పున‌రుద్ద‌ర‌ణ‌..
☛  ఫిష‌రీస్ కోసం ప్ర‌త్యేక నిధి..
☛ ఈ కోర్టు ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు..
☛ మూడు కొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెంట్ సెంట‌ర్లు
☛ రూ.20 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌సాయ రుణాలు
☛ మేక్ ఏ వర్క్ మిష‌న్ ప్రారంభం
☛ గోబ‌ర్ధ‌న్ ప‌థ‌కం కింద 200 బ‌యోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు
☛ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్య‌త‌..
☛ నేష‌న‌ల్ గ‌వ‌ర్నెస్ డేటా పాల‌సీ ద్వారా సుల‌భ‌మైన కేవైసీ.. 
☛ 2070 నాటికి కార్బన రహిత భారత్‌ లక్ష్యం
☛ త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట
☛ కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
☛ సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..

Budget 2023 LIVE Updates: కేంద్ర బడ్జెట్‌ 2023-24.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published date : 01 Feb 2023 12:47PM

Photo Stories