Budget Details 2023 : అసలు బడ్జెట్ అంటే ఏమిటి? ఎందుకు ప్రవేశపెడతారు ? ప్రయోజనం ఏమిటి ? ఎలా అమలు చేస్తారు ?
అని లెక్కలు వేయడాన్ని సింపుల్‌గా బడ్జెట్ అని చెపొచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే బడ్జెట్‌కు అంత అధిక ప్రాధాన్యం ఉంటుంది.
బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు?
కేంద్ర ఆర్థిక మంత్రి
బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు ?
మన దేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ.. వచ్చింది. 2017 నుంచి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆవిష్కరిస్తూ వస్తున్నారు. దీనికి ముందు ఫిబ్రవరి చివరి పని దినం రోజున ప్రవేశపెట్టేవారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
☛ Union Budget : బడ్జెట్ తయారీ వెనుక ఉన్న కథ ఇదే.. ఆరు నెలల నుంచి..
బడ్జెట్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది..?
బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. మార్చి 31 వరకు బడ్జెట్ కొనసాగుతుంది. మళ్లీ ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం కచ్చితంగా లభించాలి.
ఒక వేళ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించకపోతే ఎలా..?
ఒకవేళ బడ్జెట్‌కు ఏప్రిల్ 1 లోపు పార్లమెంట్ ఆమోదం లభించకపోతే అప్పుడు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించడం కుదరదు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికీ పార్లమెంట్ ఆమోదం కచ్చితంగా ఉండాలి. మన రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది.
☛ Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్ 2022–23
అసలు బడ్జెట్ ఎందుకు..?
బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాజావుగా కొనసాగుతాయి. బడ్జెట్‌లో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని చేరుకోవడానికి కేటాయింపులు కూడా చేస్తారు. దీంతో ఎంత ఆదాయం వస్తోంది? ఎంత ఖర్చు పెడుతున్నాం? వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి గందరగోళం ఉండదు. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించొచ్చు.
➤ Union Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యమైన అంశాలు ఇవే..
బడ్జెట్ అంటే ఏంటి ?
సామన్య ప్రజలకు దీని గురించి బాగా అవగాహన ఉంటుంది. వీరిలో చాలా మంది వారి నెలవారీ ఆదాయం, ఖర్చులతో ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు. దీని ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) ఎంత ఆదాయం వస్తుంది? అలాగే వ్యయాలు ఎలా ఉంటాయి? వంటి అంశాలతో బడ్జెట్‌ను రూపొందిస్తారు. బడ్జెట్‌లో ప్రభుత్వ వచ్చే ఆర్థిక సంవత్సరపు ఆదాయం, ఖర్చుల వివరాలు ఉంటాయి.
➤ Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరు?
కేంద్ర బడ్జెట్‌ను తొలిసారిగా 1947 నవంబర్ 26న ఆర్.కె.శణ్ముఖం చెట్టీ ప్రవేశపెట్టారు.
ఇందిరా గాంధీ తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న రెండో మహిళా ఆర్ధిక మంత్రి ఎవరు?
నిర్మలా సీతారామన్
➤ Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు