Skip to main content

Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022–23

 Nirmala

మౌలిక సదుపాయాల కల్పన, డిజిటలైజేషన్లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఫిబ్రవరి 1న లోక్సభలో రూ. 39,44,909 కోట్లతో 2022–23 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వందేళ్ల స్వాతంత్య్ర భారతానికి మార్గం వేస్తూ.. దీర్ఘకాలిక లక్ష్యాలతో బడ్జెట్ను రూపొందించినట్టు ప్రకటించారు. ప్రధానంగా రోడ్లు, ఇతర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్పై దృష్టిపెట్టారు. దేశంలో కరోనా మహమ్మారి బాధితులు, ఆర్థికంగా దెబ్బతిన్నవారికి సానుభూతి ప్రకటిస్తూ మంత్రి నిర్మల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మెరుగుపర్చిన వైద్య సౌకర్యాలు, వేగవంతమైన వ్యాక్సినేషన్తో కోవిడ్‌–19ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా పునరుత్థానం చెందిందన్నారు.

ఈ ఏడాది కూడా కాగిత రహిత బడ్జెట్‌..

 • గతంలో బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి ఎరుపు రంగు బ్రీఫ్కేస్లో బడ్జెట్పత్రాలను తీసుకురావడం సాంప్రదాయంగా ఉండేది. అయితే 2019లో నిర్మలా సీతారామన్ఈ పద్ధతిని మార్చారు. జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మతో ఉన్న క్లాత్బ్యాగు(బాహీఖాతా)లో బడ్జెట్పత్రాలను తీసుకువచ్చారు. తర్వాతి ఏడాది కూడా అదే పద్ధతి కొనసాగించారు.
 • స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా 2021 ఏడాది కాగిత రహిత (పేపర్లెస్‌) బడ్జెట్ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి సంప్రదాయ బాహీఖాతాను వదిలి దేశీయ ట్యాబ్లో చూసి బడ్జెట్ప్రసంగాన్ని చదివారు. 2022 ఏడాది కూడా ఇదే పద్ధతి కొనసాగించారు. బడ్జెట్కి సంబంధించిన వివరాలు, ప్రతులను https://www.indiabudget.gov.in పోర్టల్, యూనియన్బడ్జెట్మొబైల్యాప్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

 

ఇండియా @100 టార్గెట్తో..

స్వాతంత్య్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతకాలంలోకి ప్రవేశించిందని.. భారత్వందేళ్లకు చేరుకునే ఈ 25 ఏళ్లు అమృతకాలమని నిర్మలా సీతారామన్చెప్పారు. 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలతోఇండియా @100’ విజన్ను ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఆ విజన్కు ప్రస్తుత బడ్జెట్లో పునాది వేస్తున్నామన్నారు. విజన్లక్ష్యాలను సాధించడానికి మూడు మార్గాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. మంత్రి తెలిపిన మూడు మార్గాలు ఇవే..

 • అన్ని స్థాయిల్లో సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం దృష్టి
 • డిజిటల్ఎకానమీ, ఫిన్టెక్రంగాలకు ప్రోత్సాహం. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు 
 • ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు

 

నాలుగు ప్రాధాన్యతలు

ఇండియా @100 విజన్ను సాధించే క్రమంలో ప్రస్తుత బడ్జెట్లో నాలుగు ప్రాధాన్యతలను ఎంచుకున్నట్టు మంత్రి నిర్మలా ప్రకటించారు. ఈ నాలుగు ప్రాధాన్యతల కింద ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. నాలుగు ప్రాధాన్యతలు ఇవే..

 • ప్రధానమంత్రి గతిశక్తి
 • సమ్మిళిత అభివృద్ధి
 • పెట్టుబడులు, ఉత్పాదకత పెంపుదల, కొత్త ఇంధనాలవైపు చూపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు
 • అభివృద్ధికి తోడ్పడేలా పెట్టుబడుల నిర్వహణ

 

బడ్జెట్స్వరూపం(అంకెలు రూ. కోట్లలో)

మొత్తం బడ్జెట్

39,44,909

రెవెన్యూ వసూళ్లు

22,04,422

మూలధన వసూళ్లు

17,40,487

మొత్తం వసూళ్లు

39,44,909

రెవెన్యూ లోటు

9,90,241

ద్రవ్య లోటు

16,61,196

 

రూపాయి రాక (అంకెలు పైసల్లో)

అప్పులు, ఇతర రుణాలు

35

రుణేతర మూలధన వసూళ్లు

2

పన్నేతర ఆదాయం

5

వస్తుసేవల పన్ను

16

కేంద్ర ఎక్సైజ్సుంకాలు

7

కస్టమ్స్సుంకాలు

5

ఆదాయ పన్ను

15

కార్పొరేషన్పన్ను

15

 

రూపాయి పోక (అంకెలు పైసల్లో)

కేంద్ర ప్రాయోజిత పథకాలు

9

కేంద్ర ప్రభుత్వరంగ పథకాలు

15

వడ్డీ చెల్లింపులు

20

పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా

17

ఫైనాన్స్కమిషన్, ఇతర బదలాయింపులు

10

రక్షణ రంగానికి కేటాయింపులు

8

ఇతర ఖర్చులు

9

పెన్షన్లు

4

సబ్సిడీలు

8

 

ఇదీ బడ్జెట్స్వరూపం (అంకెలు రూ. కోట్లలో)

 

2020–2021 వాస్తవ గణాంకాలు

2021–2022 బడ్జెట్అంచనాలు

2021–2022 సవరించిన అంచనాలు

2022–2023 బడ్జెట్అంచనాలు

రెవెన్యూ వసూళ్లు

16,33,920

17,88,424

20,78,936

22,04,422

మూలధన వసూళ్లు

18,75,916

16,94,812

16,91,064

17,40,487

మొత్తం వసూళ్లు

35,09,836

34,83,236

37,70,000

39,44,909

రెవెన్యూ ఖర్చు

30,83,519

29,29,000

31,67,289

31,94,663

మూలధన ఖర్చు

4,26,317

5,54,236

6,02,711

7,50,246

మొత్తం ఖర్చు

35,09,836

34,83,236

37,70,000

39,44,909

రెవెన్యూ లోటు

14,49,599

11,40,576

10,88,352

9,90,241

 

బడ్జెట్ప్రతిపాదనలతో రేట్లు పెరిగే, తగ్గే ఉత్పత్తులు..

ఇవి ప్రియం..: దిగుమతి చేసుకున్న హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, లౌడ్స్పీకర్లు,

గొడుగులు, స్మార్ట్మీటర్లు, ఇమిటేషన్ఆభరణాలు, సోలార్సెల్స్, సోలార్మాడ్యూల్స్, ఎక్స్రే మెషీన్లు, ఎలక్ట్రానిక్బొమ్మల్లో విడిభాగాలు.

ఇవి చౌక ..: వజ్రాలు (కట్, పాలిష్డ్‌), కోకో బీన్స్, ఇంగువ, ఫ్రోజెన్మసల్స్‌ .. ఫ్రోజెన్స్క్విడ్స్‌ (సముద్ర ఆహార ఉత్పత్తులు), మీథైల్ఆల్కహాల్, ఎసిటిక్యాసిడ్, దుస్తులు, సెల్ఫోన్లలో వాడే కెమెరా లెన్స్, మొబైల్చార్జర్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే రసాయనాలు, స్టీల్స్క్రాప్‌.

      

ముఖ్య రంగాలు/పథకాలు/శాఖలుకేటాయింపులు

రంగం/శాఖ/పథకం

కేటాయింపులు(రూ. కోట్లలో)

వ్యవసాయం, అనుబంధ రంగాలు

1,51,521

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ

1,32,513

మత్స్య, పశు సంవర్థక, పాల ఉత్పత్తుల శాఖ

6,407.31

పీఎం కిసాన్పథకం

6,75,000

క్రిషోన్నతి యోజన

7,183

రాష్ట్రీయ కృషి వికాస్యోజన

10,433

గ్రామీణాభివృద్ధి

2,06,293

పీఎం గ్రామ సడక్యోజన (పీఎంజీఎస్వై)

19,000 

స్వచ్ఛ భారత్మిషన్‌(ఎస్బీఎం)

9,492

భారత్నెట్పథకం

9,000

ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)

73,000

ప్రధాన మంత్రి ఆవాస్యోజన(పీఎంఏవై)

48,000

ప్రధాన మంత్రి ఆవాస్యోజనగ్రామీణ్‌(పీఎంఏవైజీ)

20,000

ప్రధాన మంత్రి ఆవాస్యోజనఅర్బన్‌(పీఎంఏవైయు)

28,000

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

86,200.65

నేషనల్డిజిటల్హెల్త్మిషన్

200

నేషనల్హెల్త్మిషన్బడ్జెట్

37000

మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ

25, 172.28

సక్షం అంగన్వాడీలు, పోషణ్‌ 2.0

20,263

పీఎం పోషణ్

10,234

మిషన్వాత్సల్య

1,472

మిషన్శక్తి

3,184

నిర్భయ నిధి

200 

విద్యా రంగం

1,04,000

సమగ్ర శిక్ష అభియాన్

37,383.36

సామాజిక న్యాయం, సాధికారత శాఖ

13,134

రక్షణ రంగం

5,25,000

అంతరిక్ష రంగం

13,700

అణుశక్తి విభాగం

22,723.58

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు

14,217.46

బయో టెక్నాలజీ శాఖ

2581

సైంటిఫిక్అండ్ఇండస్ట్రియల్రీసెర్చ్

5636.46

పర్యావరణ మంత్రిత్వ శాఖ

3,030

గ్రీన్ఇండియా నేషనల్మిషన్బడ్జెట్

361.69

నేషనల్క్లీన్ఎయిర్ప్రోగ్రామ్‌(సీఏపీ)

50

రోడ్డు రవాణా, రహదారుల శాఖ

1,99,000

రైల్వే

1,40,367.13

సహకార మంత్రిత్వ శాఖ

900

టైగర్ప్రాజెక్టు

300

ప్రాజెక్టు ఎలిఫెంట్

35

కేంద్ర సాంస్కృతిక శాఖ

3,009.05

కేంద్ర హోం శాఖ

1,85,000

కెన్‌–బెత్వా నదుల అనుసంధానం

1,400

 

వ్యవసాయం, అనుబంధ రంగాలు

Agriculture

వ్యవసాయ, అనుబంధ రంగాలపై వ్యయం (రూ.కోట్లలో): 1,51,521

వ్యవసాయం, రైతు సంక్షేమశాఖకు కేటాయింపులు(రూ.కోట్లలో..)

 • 2020–21 వాస్తవ గణాంకాలు: 1,34,420
 • 2021–22 బడ్జెట్అంచనాలు: 1,48,301
 • 2021–22 సవరించిన అంచనాలు: 1,47,764
 • 2022–23 బడ్జెట్అంచనాలు: 1,51,521

 

సాగు రంగానికి సాంకేతిక బలం చేకూర్చడానికి 2022–23 ఆర్థిక ఏడాది కేంద్ర బడ్జెట్పెద్దపీట వేసింది. కిసాన్డ్రోన్లు, రైతులకి డిజిటల్, హైటెక్సేవలు అందించడానికి పబ్లిక్ప్రైవేటు భాగస్వామ్యంతో సంస్థల ఏర్పాటు, స్టార్టప్లకి ప్రోత్సాహం, భూరికార్డుల డిజిటలైజేషన్వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఆహార తయారీ రంగాలను ప్రోత్సహించనుంది. ప్రజారోగ్యం కోసం సేంద్రియ వ్యవసాయం, తృణధాన్యాల ప్రోత్సాహం చేపట్టనుంది.

 

ముఖ్యాంశాలు..

 • వ్యవసాయం, రైతు సంక్షేమశాఖకు గత ఏడాదితో పోలిస్తే 4.5 శాతం వరకు కేటాయింపులు పెంచారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,32,513 కోట్లు కేటాయించారు.
 • మత్స్య, పశు సంవర్థక, పాల ఉత్పత్తుల శాఖకి కేటాయింపులు 44 శాతం పెరిగాయి. 2022–23 ఆర్థిక ఏడాదికి రూ.6,407.31 కోట్లు కేటాయించారు.
 • ఈ ఏడాది ఆహార తయారీ పరిశ్రమలకి 2.25 రెట్లు నిధుల్ని పెంచారు. రూ.2,941.99 కోట్లను కేటాయించారు.
 • వరి, గోధుమలకు కనీస మద్దతు ధర లభించేలా రూ.2.37 లక్షల కోట్లను కేటాయించింది. 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు.
 • వంటనూనెలపై మనం ఇంకా విదేశాలపైనే ఆధారపడి ఉన్నాం. వంటనూనెల దిగుమతిని తగ్గించి, దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి ఒక సమగ్ర పథకాన్ని అమలు చేస్తారు
 • రైతులకు వ్యవసాయ రుణాల లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16.50 లక్షల కోట్లు ఉంటే, 2022–23లో రూ.18 లక్షల కోట్లకు పెంచారు.
 • యమునా ఉపనదులైన కెన్బెత్వా నదుల అనుసంధానం ద్వారా కొత్తగా 9.1 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుంది.
 • గత ఏడాది రూ. 1,40,122 కోట్లుగా ఉన్న ఫెర్టిలైజర్సబ్సిడీని 2022–23కు వచ్చేసరికి రూ. 1,05,222 కోట్లకు ప్రభుత్వం తగ్గించింది.(అంటే 25 శాతం తగ్గించినట్లు..)
 • వ్యవసాయ అనుబంధ రంగాలైన ఫిషరీస్కు రూ.2,118 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 3.918 కోట్లు కేటాయింపు.
 • ఆహార సబ్సిడీలోనూ కోత: గత ఏడాది సవరించిన ఆహార సబ్పిడీ రూ. 2,86,469 కోట్లు కాగా... తాజా బడ్జెట్లో కేంద్రం దీన్ని రూ.2,06,831 కోట్లకు పరిమితం చేసింది.
 • కిసాన్డ్రోన్లు: వ్యవసాయ రంగంలో కిసాన్డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. పంటల మదింపు, పురుగుల మందుల పిచికారీ, ఎరువులు జల్లడం వంటివన్నీ ఈ డ్రోన్లు చేస్తాయి. వ్యవసాయ రంగం మరింత పారదర్శకంగా ఉండేందుకు భూ రికార్డుల్ని డిజిటలైజేషన్కి కూడా డ్రోన్ల సాయంతో చేస్తారు. ఇక డ్రోన్శక్తి కార్యక్రమాన్ని మరింత శక్తిమంతంగా అమలు చేయడానికి స్టార్టప్లు ఏర్పాటు చేయనున్నారు.
 • సేంద్రియ విధానం: వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు చేపట్టింది. తొలి దశలో గంగా నదీ ప్రవాహక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్ని 5 కి.మీ. మేర కారిడార్లుగా ఏర్పాటు చేసి వాటిల్లో రసాయనాలు వాడకుండా పంటలు పండించడానికి రైతుల్ని ప్రోత్సహిస్తుంది. దశల వారీగా ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.
 • 2023 తృణధాన్యాల సంవత్సరం: తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, వాటికో బ్రాండ్కల్పించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వరి అధికంగా వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మిల్లెట్ల వాడకాన్ని ప్రోత్సహించనుంది. ఇప్పటికే భారత్చేసిన ప్రతిపాదనలతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ఇయర్గా ప్రకటించిందిబడ్జెట్లో ఆ విషయాన్ని ప్రస్తావించిన మంత్రి నిర్మల.. అంతర్జాతీయంగా తృణధాన్యాల వినియోగం పెరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
 • సిలబస్లో మార్పులు: సేంద్రియ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, నేచరల్జీరో బడ్జెట్‌ (పురుగుల మందులు, ఎరువులు వాడకుండా సాగు చేయడం) వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ, వ్యవసాయ రంగ నిర్వహణ వంటి అవసరాలు నెరవేరేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్లో మార్పులు చేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తారు.
 • అటవీ భూములు: అటవీ భూముల్లో వ్యవసాయం పెరిగేలా, అందులో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు, కొత్త చట్టాలు చేయనున్నారు. అటవీ సంపదను పెంచడానికి ముందుకు వచ్చే షెడ్యూల్డ్కులాలు, తెగల వారికి ఆర్థిక సాయం అందిస్తారు.
 • పీఎం కిసాన్‌: పీఎం కిసాన్పథకానికి రూ.6,75,000 కోట్లు, పంటల ఇన్సూరెన్స్పథకానికి రూ.15,500కోట్లు, క్రిషోన్నతి యోజన పథకానికి రూ.7,183 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్యోజనకు రూ.10,433 కోట్లు, మార్పెట్ఇంటర్వెన్షన్స్కీమ్మద్దతు ధర పథకం కోసం రూ.1,500 కోట్లు కేటాయించారు.
 • స్టార్టప్ల ఏర్పాటు: వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) స్టార్టప్లు, గ్రామీణ సంస్థల ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. వీటికి నాబార్డ్సహకారం అందిస్తుంది. ఫార్మర్ప్రొడ్యూస్ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్పీఓ)కు ప్రాంతీయంగా సహకారం అందించడానికి ఈ స్టార్టప్లు ఉపయోగపడతాయి.

 

గ్రామీణ రంగం

Village

గ్రామీణ భారతంపై ప్రధానంగా దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం.. పల్లెల్లో రోడ్లు, ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టెలికంఇంటర్నెట్సేవలకు సంబంధించిన కీలక ఫ్లాగ్షిప్పథకాలకు 2022–23 బడ్జెట్లో పెద్దయెత్తున నిధులను కేటాయించారు.

 

గ్రామీణాభివృద్ధికి నిధులు ఇలా... (రూ. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 2,06,293
 • 2021–22 కేటాయింపులు: 1,94,663

 

ప్రధాన మంత్రి ఆవాస్యోజన (పీఎంఏవై):

పీఎంఏవైకు కేటాయింపులు ఇలా... (రూ. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 20,000 (పట్టణ స్కీమ్తో కలిపి 48,000)
 • 2021–22 కేటాయింపులు: 19,500 (పట్టణ స్కీమ్తో కలిపి 27,500)
 • పీఎంఏవైలో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సొంతగూడు లేని బలహీన వర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం.
 • 2022–23 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల పక్కా ఇళ్లను పీఎంఏవై పథకంలో అందించనున్నారు.
 • ఆర్థిక సర్వే ప్రకారం 2020–21లో 33.99 లక్షల ఇళ్లను పీఎంఏవై పథకంలో పూర్తి చేయగా, ఇందులో పీఎంఏవైగ్రామీణ స్కీమ్ప్రకారం 26.20 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.
 • 2021–22లో డిసెంబర్నాటికి పీఎంఏవైఅర్బన్కింద 4.49 లక్షల ఇళ్లు పూర్తయాయి.

 

ప్రధాన మంత్రి గ్రామ సడక్యోజన (పీఎంజీఎస్వై):

పీఎంజీఎస్వైకు కేటాయింపులు ఇలా... (రూ. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 19,000
 • 2021–22 కేటాయింపులు: 15,000 
 • పీఎంజీఎస్వైలో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో 50,000 కిలోమీటర్ల మేర కొత్తగా పల్లె బాటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 • పీఎంజీఎస్వై 2, 3ఫేజ్లను ఇప్పుడు అమలు చేస్తున్నారు.
 • పీఎంజీఎస్వై మూడో దశ కింద 25,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు, 35,000 కీలోమీటర్ల మేర ప్రస్తుత రోడ్లను మెరుగుపరచాలనేది ప్రభుత్వ లక్ష్యం.
 • అలాగే పర్యావరణానుకూల సాంకేతికత (గ్రీన్టెక్నాలజీ)తో 15,000 కిలోమీటర్ల మేర రోడ్లను 2022–23లో నిర్మించనున్నారు.
 • 2000 సంవత్సరంలో ఈ పథకం ఆరంభం నుంచి ఇప్పటిదాకా (2021 జనవరి 20 నాటికి) 1,70,034 గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు.

 

తాగునీరు

తాగునీటకి కేటాయింపులు ఇలా.. (రూ.. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 60,000
 • 2021–22 కేటాయింపులు: 50,011
 • స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు 2019–20లో జల్జీవన్మిషన్ఫ్లాగ్షిప్ప్రోగ్రామ్ను ప్రకటించారు.
 • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని (హర్ఘర్, నల్సే జల్‌) అందించడంలో భాగంగా 2022–23లో 3.8 కోట్ల కుటుంబాలకు దీన్ని అందించేందుకు భారీగా నిధులను పెంచారు.
 • 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ తాగునీటిని (హ్యాండ్పంపులు, కుళాయిలు ఇతరత్రా మార్గాల్లో) అందించడమే దీని లక్ష్యం. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.7 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.

 

స్వచ్ఛ భారత్మిషన్‌(ఎస్బీఎం)

స్వచ్ఛ భారత్మిషన్కు కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 9,492
 • 2021–22 కేటాయింపులు: 12,294
 • దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్‌)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్పథకం (ఎస్బీఎం) కిందికి ఘనవ్యర్థాల, జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు.
 • ఎస్బీఎం (అర్బన్‌) 2.0ను ప్రధాని మోదీ 2021, అక్టోబర్‌ 1న ప్రారంభించారు. 2021–26 ఐదేళ్ల కాలంలో రూ.1.41 లక్షల కోట్లను వెచ్చించాలనేది లక్ష్యం.
 • ఎస్బీఎం (గ్రామీణ) రెండో దశ (2.0)ను 2020, ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2024– 25 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకు రూ.1.4 లక్షల కోట్లను కేటాయించనున్నారు.
 • 2022–23లో గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల కొత్త మరుగుదొడ్లు, 30,000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను నిర్మించాలనేది లక్ష్యం. 85,000 గ్రామాల్లో అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ, 62,166 గ్రామాల్లో మురుగు నీటి నిర్వహణను మెరుగు పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 • ఇక పట్టణాల్లో 25,000 మరుగుదొడ్లు, 50,000 కమ్యూనిటీ/పబ్లిక్టాయిలెట్లు/ యూరినల్స్నిర్మాణం 2022–23 లక్ష్యం.

 

భారత్నెట్పథకం

భారత్నెట్కేటాయింపులు ఇలా.. (రూ. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 9,000
 • 2021–22 కేటాయింపులు: 7,000
 • భారత్నెట్కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ఫైబర్నెట్వర్క్‌ (ఓఎఫ్సీ)ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనికోసం 202–23లో పబ్లిక్‌–ప్రైవేట్భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అనుసరిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2025 నాటికి దీన్ని సాకారం చేయనున్నట్లు చెప్పారు.
 • 2022–23లో 22,000 గ్రామ పంచాయతీలను కొత్తగా ఆప్టికల్ఫైబర్‌/శాటిలైట్ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 65,000 కిలోమీటర్ల మేర ఓఎఫ్సీని వేయనున్నారు.
 • డిజిటల్ఇండియా లక్ష్యాన్ని సాకారం చేయడం కోసం భారత్నెట్సహా వివిధ టెలికం నెట్వర్క్మౌలిక సదుపాయాలను కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)

ఎంజీఎన్ఆర్ఈజీఏ కేటాయింపులు ఇలా.. (రూ. కోట్లలో)

 • 2022–23 కేటాయింపులు: 73,000
 • 2021–22 కేటాయింపులు: 98,000
 • ఎంజీఎన్ఆర్ఈజీఏ 2021–22 సవరించిన అంచనాలతో పోలిస్తే ఈ సారి కేటాయింపుల్లో 25 శాతం మేర కోత పడింది.
 • ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. దీనిలోభాగంగా నైపుణ్యాల్లేని కార్మికుల ద్వారా ప్రభుత్వ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణం ఇతరత్రా పనులను చేపడతారు.

 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

Helthcare

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేటాయింపులు(రూ. కోట్లలో)

 • 2022–23 బడ్జెట్‌: 86,200.65
 • 2021–22 బడ్జెట్‌: 73,931
 • ఆరోగ్య రంగానికి 2022–23 బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.86,200.65 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఏకంగా రూ.83 వేల కోట్లు కేటాయించారు.
 • ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,200 కోట్లు కేటాయించారు.
 • కేంద్ర ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ను రూ.10,566 కోట్ల నుంచి రూ.15,163 కోట్లకు పెంచారు.
 • నేషనల్డిజిటల్హెల్త్మిషన్కేటాయింపులను రూ.30 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచారు.
 • నేషనల్హెల్త్మిషన్బడ్జెట్ను రూ.36,576 నుంచి రూ.37 వేల కోట్లకు పెంచారు.
 • అటానమస్సంస్థలకు రూ.8,566 కోట్ల నుంచి రూ.10,022 కోట్లకు, స్టాట్యుటరీ, రెగ్యులేటరీ సంస్థలకు రూ.315 కోట్ల నుంచి రూ.335 కోట్లకు బడ్జెట్పెంచారు.

నేషనల్టెలి మెంటల్హెల్త్కు శ్రీకారం

కరోనా మహమ్మారి నేపథ్యంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలందరి మానసిక ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా ఈ మహమ్మారి ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘ప్రజలకు నాణ్యతతో కూడిన కౌన్సెలింగ్ను, ఆరోగ్య పరిరక్షణ సేవలను మరింత చేరువ చేసేందుకు వీలుగా జాతీయ స్థాయిలో టెలీ మెంటల్హెల్త్కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.’’ అని మంత్రి నిర్మల 2022–23 బడ్జెట్ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్వేవ్కొనసాగుతోందని అంటూ.. వేగవంతమైన వ్యాక్సినేషన్కార్యక్రమం చాలావరకు మనల్ని కాపాడిందని ఆమె చెప్పారు.

మంత్రి నిర్మల తెలిపిన వివరాల ప్రకారం... నిమ్హాన్స్‌ (నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్మెంటల్హెల్త్అండ్న్యూరో సైన్సెస్‌) నోడల్కేంద్రంగా, ఇంటర్నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్ఇన్ఫర్మేషన్టెక్నాలజీబెంగళూరు(ఐఐఐటీబీ) సాంకేతిక సహకారంతో 23 టెలీ మానసిక ఆరోగ్య కేంద్రాలతో కూడిన నెట్వర్క్‌... నేషనల్టెలీ మెంటల్హెల్త్కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. అదే విధంగా జాతీయ డిజిటల్ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ కోసం ఓ బహిరంగ వేదికను అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ

Education

దేశ జనాభాలో 67.7 శాతంగా ఉన్న మహిళలు, పిల్లలకోసం 2022–2023 ఆర్థిక సంవత్సరానికిగాను మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖకు రూ. 25, 172.28 కోట్లను కేటాయించారు. 2021–2022 బడ్జెట్రూ. 24,435 కోట్లతో కేటాయింపులతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం పెంపు కేవలం 3 శాతం మాత్రమే.

 

కొన్ని కేటాయింపులు (రూ.కోట్లలో)

 • సక్షం అంగన్వాడీలు, పోషణ్‌ 2.0: 20,263
 • పీఎం పోషణ్‌: 10,234
 • మిషన్వాత్సల్య: 1,472
 • మిషన్శక్తి: 3,184

 

ముఖ్యాంశాలు..

 • సక్షం అంగన్వాడీ పథకంలో భాగంగా... పిల్లల సమగ్రాభివృద్ధి కోసం రెండు లక్షల అంగన్వాడీలను బలోపేతం చేస్తామని మంత్రి నిర్మల చెప్పారు.
 • అంగన్వాడీలకు సాంకేతికతను జోడించి మౌలిక సదుపాయాలను పెంచాలని, దృశ్య, శ్రవణ పరికరాలతో అంగన్వాడీల రూపు రేఖలను మార్చేయాలని కేంద్రం భావిస్తోంది.
 • మహిళాసాధికారత కోసం రూపొందించిన మిషన్శక్తి కోసం 3,184 కోట్లను కేటాయించారు.
 • పిల్లల సంరక్షణ, పిల్లల సంక్షేమ సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మిషన్వాత్సల్యకు రూ.1,472కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.500కోట్లకు పైగా పెంపుదల ఉంది.
 • ఇక స్వయంప్రతిపత్తి సంస్థల కారా, ఎన్సీపీసీఆర్, మహిళా కమిషన్లకు కేటాయింపులను రూ.180కోట్ల నుంచి రూ.152కోట్లకు తగ్గించారు.

 

నిర్భయ నిధికి రూ.200కోట్లు

2022–2023 వార్షిక బడ్జెట్లో నిర్భయ నిధికి రూ.200 కోట్లు(గతేడాది రూ.180 కోట్లతో పోలిస్తే 11.11శాతం పెంపు) కేటాయించారు. 2019లో మోడీ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో రూ.4వేల కోట్లతో నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ కోసం వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. అందులో అత్యాచార, యాసిడ్దాడి బాధితులకు పరిహారం అందించడంతోపాటు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఆ నిధులను ఉపయోగిస్తారు. ఈ నిధిని డిపార్ట్మెంట్ఆఫ్ఎకనామిక్అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే నాన్‌–లాప్సబుల్కార్పస్ద్వారా ఉపయోగించవచ్చు.

 

విద్యా రంగం

Education

విద్యా రంగం కేటాయింపులు ఇలా(రూ. కోట్లలో)..

 • 2022–23 బడ్జెట్కేటాయింపులు: 1,04,000
 • 2021–22 సవరించిన అంచనాలు: 88,001 (బడ్జెట్అంచనా రూ.93,224 కోట్లు)

కరోనా వల్ల అస్తవ్యస్తమైన విద్యారంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం బడ్జెట్లో డిజిటల్బాట పట్టింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే గ్రామీణ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసంపై  రెండేళ్లుగా తీవ్ర ప్రభావం పడినట్లు ఆర్థిక మంత్రి నిర్మల పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ఈకంటెంట్అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం డిజిటల్వర్సిటీ ఏర్పాటు కానుంది. టెలివిజన్ప్రసారాలతో అనుబంధ విద్యను అందించనున్నారు.

 

ముఖ్యాంశాలు..

 • ల్యాబ్స్‌: వృత్తి విద్యా కోర్సుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్, మేథ్స్లో 750 వర్చువల్ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. 2022–23లో 75 ల్యాబ్లను నెలకొల్పుతారు.
 • వన్క్లాస్‌–వన్టీవీ చానల్‌: ప్రధాని ఈవిద్య కార్యక్రమంలోవన్క్లాస్‌ – వన్టీవీ చానల్‌’ ద్వారా ప్రస్తుతం 1 నుంచి 12వ తరగతి వరకు 12 టీవీ చానళ్లు ఉండగా వీటిని 200కి విస్తరించనున్నారు. ఒక్కో తరగతికి ఒక్కో చానల్ఏర్పాటుతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల ద్వారా బోధన చేపడతారు. ఇంటర్నెట్, మొబైల్ఫోన్, టీవీ, రేడియోల ద్వారా బోధన ఉంటుందిడిజిటల్నైపుణ్యాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
 • డిజిటల్యూనివర్సిటీ: ప్రపంచస్థాయి విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. టాప్యూనివర్సిటీల సహకారంతో పలు భారతీయ భాషల్లో కోర్సులను అందుబాటులోకి తెస్తారు.
 • సిలబస్లో మార్పులు: ప్రకృతి సేద్యం, అధునాతన వ్యవసాయం, అదనపు నైపుణ్యాలు తదితర అంశాలను కొత్తగా చేర్చి సిలబస్మార్పులపై సూచనల కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నారు.
 • 5 సెంటర్ఆఫ్ఎక్స్లెన్స్లు: వేర్వేరు ప్రాంతాల్లోని ఐదు ఉన్నత విద్యాసంస్థలను సెంటర్ఆఫ్ఎక్స్లెన్స్కేంద్రాలు తీర్చిదిద్దుతామని బడ్జెట్లో ప్రకటించారు. ఒక్కో కేంద్రానికి రూ.250 కోట్ల చొప్పున వెచ్చిస్తారు. సిలబస్, నాణ్యత తదితర అంశాలను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్యవేక్షిస్తుంది.
 • గిఫ్ట్సిటీలో అంతర్జాతీయ వర్సిటీలు: దేశీయ నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ గాంధీనగర్లోని గుజరాత్ఇంటర్నేషనల్ఫైనాన్స్టెక్‌ (గిఫ్ట్‌) సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటును అనుమతించనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఆర్థిక సేవల రంగంలో నిపుణులైన మానవ వనరులను సమకూర్చుకునేందుకు ఫైనాన్షియల్మేనేజ్మెంట్, ఫిన్టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్కోర్సుల బోధనకుగిఫ్ట్‌’ సిటీలో అంతర్జాతీయ వర్సిటీలను అనుమతిస్తారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి గిఫ్ట్సిటీలో ఆర్బిట్రేషన్సెంటర్నూ నెలకొల్పనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
 • 2022–23 ఆర్థిక ఏడాది పాఠశాల విద్యకు రూ.63,449.37 కోట్లు కేటాయించారు. 2021–22తో పోలిస్తే దాదాపు మరో రూ.9,000 కోట్లు అదనంగా ఇచ్చారు.
 • సమగ్ర శిక్ష అభియాన్కు రూ.37,383.36 కోట్ల కేటాయింపులు చేశారు. గతంతో పోలిస్తే రూ.6,000 కోట్లు  అదనం.   
 • కేంద్రీయ విద్యాలయాలు, జవహర్నవోదయ విద్యాలయాలకు కేటాయింపులు పెంచి వరుసగా రూ.7,650 కోట్లు, రూ.4,115 కోట్లు కేటాయించారు
 • ఉన్నత విద్యకు రూ.40,828 కోట్లు. 2021–22 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 6.6 శాతం ఎక్కువ. 2021–22లో రూ.38,350.65 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలతో రూ.36,031.57 కోట్లకు తగ్గింది.

 

సామాజిక న్యాయం, సాధికారత శాఖ

2022–23 బడ్జెట్లో సామాజిక న్యాయం, సాధికారత శాఖకు కేంద్ర ప్రభుత్వం రూ.13,134 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు గత ఏడాది కంటే 12 శాతం అధికం. సమాజంలో వెనుకబడిన తరగతులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో రూ.11,922 కోట్లను సామాజిక న్యాయం, సాధికారత విభాగానికి, మరో రూ.1,212 కోట్లను దివ్యాంగుల సంక్షేమ విభాగానికి కేటాయించినట్లు తాజా బడ్జెట్లో ప్రస్తావించారు.

 

రక్షణ రంగం

Defence Sector

ఆత్మనిర్భరతకు పెద్ద పీట వేస్తూ రక్షణ రంగానికి 2022–23 బడ్జెట్లో రూ.5.25 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, మిలిటరీ హార్డ్వేర్కొనుగోళ్లు తదితరాలతో కూడిన మూలధన వ్యయానికే రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.38 లక్షల కోట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువ. రక్షణ రంగానికి 2021–22లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు.

 

ముఖ్యాంశాలు

 • రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు 68 శాతం కొనుగోళ్లను దేశీయంగానే జరపనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ప్రకటించారు.
 • రక్షణ రంగానికి కేటాయించిన మొత్తంలో రూ.2.33 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం. ఈ మొత్తాన్ని వేతనాలు, సంస్థల నిర్వహణ ఖర్చులకు వాడతారు. మూలధన పద్దులో ఆర్మీకి రూ.32,015 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే రూ.4,000 కోట్లు తక్కువ.
 • నేవీకి రూ.47,590 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపుల కంటే ఏకంగా రూ.14,000 కోట్లు ఎక్కువ .
 • ఎయిర్ఫోర్స్కు గతేడాది కంటే రూ.2,000 కోట్లు ఎక్కువగా రూ.55,586 కోట్లు కేటాయించారు.
 • రక్షణ రంగ పెన్షనర్లకు రూ.1.19 లక్షలు, శాఖ పౌర అవసరాలకు రూ.20 వేల కోట్లు కేటాయించారు.

 

పరిశోధనల్లోనూ స్టార్టప్లు

రక్షణ రంగ పరిశోధనల్లో ఇకపై ప్రైవేట్సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్లు కూడా పాల్గొనవచ్చు. రక్షణ శాఖ పరిశోధనలు, అభివృద్ధి బడ్జెట్లో ఇందుకు 25 శాతం కేటాయించారు. రక్షణ దళాలకు కావాల్సిన పరికరాలు, ఆయుధ వ్యవస్థల డిజైన్నుంచి పూర్తిస్థాయి తయారీ దాకా అన్ని పనులనూ ప్రైవేట్సంస్థలూ చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. డీఆర్డీవో తదితర సంస్థలతో కలిసి స్పెషల్పర్పస్వెహికల్స్ద్వారా అవి రక్షణ అవసరాలపై పని చేయొచ్చు. ఇలా ప్రైవేట్లో తయారయ్యే ఆయుధాలు, పరికరాలు, వ్యవస్థలను పరీక్షించేందుకు, సర్టిఫికేషన్కూ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

 

అంతరిక్ష రంగం, అణుశక్తి విభాగం

అంతరిక్ష రంగానికి 2022–23 బడ్జెట్లో రూ.13,700 కోట్లు కేటాయించారు. గత ఏడాది సవరించిన అంచనా కంటే ఈసారి పెంపు ఏకంగా రూ.1,058 కోట్లు అధికం. అణుశక్తి విభాగానికి తాజా బడ్జెట్లో రూ.22,723.58 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.22,707.21 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం స్వల్పంగా పెంచారు.

 

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు

వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడంపై 2022–23 బడ్జెట్లో కేంద్రం దృష్టి పెట్టింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలకు రూ.14,217.46 కోట్లు కేటాయించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖకు రూ.3030 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది రూ.510 కోట్లు ఎక్కువ. సౌరశక్తికి మరింత ప్రోత్సాహమిచ్చేందుకు రూ.19,500 కోట్లు కేటాయించారు. దేశీయంగా సౌరశక్తి ఫలకాల తయారీ భారీ ఎత్తున చేపట్టి 2030 కల్లా సామర్థ్యాన్ని 280 గిగావాట్లకు పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కోసం సైన్స్అండ్టెక్నాలజీ, బయో టెక్నాలజీ, సైంటిఫిక్అండ్ఇండస్ట్రియల్రీసెర్చ్శాఖలకు రూ.14,217.46 కోట్లు కేటాయించారు. ఇందులో సైన్స్అండ్టెక్నాలజీ పరిధిలోకి వచ్చే ఇస్రో తదితర అంతరిక్ష కార్యక్రమాలకు రూ.6000 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే రూ.760 కోట్లు ఎక్కువ. బయో టెక్నాలజీ శాఖకు రూ.2581 కోట్లు, సైంటిఫిక్అండ్ఇండస్ట్రియల్రీసెర్చ్కు రూ.5636.46 కోట్లు కేటాయించారు.

 

పర్యావరణ మంత్రిత్వ శాఖ

 • 2022–2023 బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ.3,030 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పర్యావరణ బడ్జెట్ను 5.6శాతం పెంచారు.
 • ఇక కాలుష్య నియంత్రణకు 460కోట్లను మాత్రమే కేటాయించారు. 2021–2022 బడ్జెట్కు ఇది రూ.10కోట్లు తక్కువ.
 • గ్రీన్ఇండియా నేషనల్మిషన్బడ్జెట్ను రూ.290 కోట్ల నుంచి 361.69కోట్లకు పెంచారు.
 • గత ఏడాది రూ.235 కోట్లు కేటాయించిన జాతీయ అడవుల పెంపకం కార్యక్రమానికి రూ.300 కోట్లకు పెంచారు.
 • వాతావరణ మార్పులో సవాళ్లను ఎదుర్కొనేందుకు గతేడాది మాదిరిగానే రూ.30 కోట్లను కేటాయించారు.
 • దేశ రాజధానితోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గాలి నాణ్యత నిర్వహణ కోసం రూ.17 కోట్లు కేటాయించారు.
 • కాలుష్య నియంత్రణకోసం ఆయా మండళ్ల సహాయార్థం నిధులకు 2019లో ప్రారంభించిన నేషనల్క్లీన్ఎయిర్ప్రోగ్రామ్‌(సీఏపీ)కి ఈ బడ్జెట్లో రూ.50కోట్లను కేటాయించారు.

 

రవాణా రంగం

Highway

దీర్ఘకాలం పాటు సుస్థిరాభివృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకమని కేంద్ర సర్కారు మరోసారి స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 2022–23 బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, ప్రజా రవాణా, జల మార్గాలు, లాజిస్టిక్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్వృద్ధికి కీలకమైనవిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ప్రకటించారు. ఇందుకు వీలుగా బడ్జెట్కేటాయింపులను గణనీయంగా పెంచారు. 7 ఇంజిన్లు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయన్నారు. నేషనల్ఇన్ఫ్రాస్ట్రక్చర్పైప్లైన్‌ (ఎన్ఐపీ) పరిధిలోని ఈ ఏడు ఇంజిన్లు పీఎం గతిశక్తి కార్యాచరణతో అనుసంధానించడం జరుగుతుందని చెప్పారు.

 

ముఖ్యాంశాలు..

 • లాజిస్టిక్స్పార్క్లు: దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాలుగు మల్టీమోడల్లాజిస్టిక్స్పార్క్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అవార్డులను కేటాయించనున్నట్టు తెలిపారు.
 • రైల్వే ఉత్పత్తులు, రవాణా సేవలు: రైల్వే నూతన ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుందని, మెరుగైన రవాణా సేవలను చిన్న రైతులు.. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకొస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది పోస్టల్, రైల్వే నెట్వర్క్ల అనుసంధానతకు దారితీయడంతోపాటు.. పార్సిళ్లు అవాంతరాల్లేకుండా రవాణా అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు.
 • పర్వత ప్రాంతాల్లో రోప్వేలు: క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో సంప్రదాయ రోడ్లకు ప్రత్యామ్నాయంగా.. పీపీపీ విధానంలో జాతీయ రోప్వేస్అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పర్యావరణాన్ని ప్రోత్సహించడంతోపాటు రవాణా, అనుసంధానతను సులభతరం చేయడమే దీని లక్ష్యంగా పేర్కొన్నారు. 2022–23లో 60 కిలోమీటర్ల నిడివితో కూడిన ఎనిమిది రోప్వే ప్రాజెక్టుల అవార్డులను కేటాయిస్తామన్నారు.
 • కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ఇన్ఫ్రాస్ట్రక్చర్పైప్లైన్‌ (ఎన్ఐపీ), నేషనల్మోనిటైజేషన్ప్రోగ్రామ్‌ (ఎంఎన్పీ)లో రైల్వేలు, జాతీయ రహదారులు కీలకంగా ఉన్నాయి.

 

కేటాయింపులు ఇవీ..

 • రోడ్డు రవాణా, రహదారుల శాఖకు 68.5 శాతం నిధులను పెంచి రూ.1.99 లక్షల కోట్లు కేటాయించారు. 2021–22లో కేటాయింపులు రూ.1.18 లక్షల కోట్లు మాత్రమే.
 • జాతీయ రహదారుల సంస్థకు కేటాయింపులు 133 శాతం పెంచి రూ.1.34 లక్షల కోట్లు ఇచ్చారు.
 • గ్రామ సడక్యోజనకు రూ.19వేల కోట్లు కేటాయించారు.
 • గత బడ్జెట్తో పోలిస్తే రైల్వేకు 27.5 శాతం అదనంగా రూ.1.40 లక్షల కోట్లు దక్కాయి.

 

25,000 కి.మీ. రహదారులు

 • 2022–23 ఆర్థిక సంవత్సరంలో 25వేల కి.మీ.ల మేర జాతీయ రహదారుల నెట్వర్క్ను విస్తరించనున్నట్టు మంత్రి చెప్పారు. 2021–22 మొదటి తొమ్మిది నెలల్లో రహదారుల నిర్మాణం 6,185 కిలోమీటర్లు, 2020–21లో 13,200 కిలోమీటర్ల నిర్మాణంతో పోలిస్తే లక్ష్యాన్ని రెట్టింపు చేశారు.
 • అన్ని రకాల ఆపరేటర్ల మధ్య డేటా మార్పిడికి వీలుగా యూనిఫైడ్లాజిస్టిక్స్ఇంటర్ఫేస్ప్లాట్ఫామ్‌ (యులిప్‌), డిజైన్డ్ఫర్అప్లికేషన్ప్రోగ్రామింగ్ఇంటర్ఫేస్‌ (ఏపీఐ)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వివిధ మార్గాల్లో రవాణా మరింత సమర్థవంతంగా జరిగేందుకు, రవాణా వ్యయాలు, సమయం తగ్గేందుకు, మెరుగైన సరుకు నిర్వహణకు ఇది వీలు కల్పిస్తుంది.

 

రైల్వేకు పెద్దపీట

Railway Budget and FM

చిన్న రైతులు, చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకుని 2022–23 బడ్జెట్లో రైల్వేకు పెద్దపీట వేశారు. వచ్చే మూడేళ్లలో.. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే, ఇంధనాన్ని తక్కువగా వినియోగించే 400 వందే భారత్రైళ్లను తయారు చేస్తామని మంత్రి నిర్మల వెల్లడించారు. 2023 ఆగస్టు 15 లోగా 75 రూట్లలో వందే భారత్రైళ్లు ప్రయాణిస్తాయని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పిన విషయం తెలిసిందే. 2022–23 బడ్జెట్లో రైల్వేకు రూ. 1,40,367.13 కోట్లను కేటాయించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కన్నా ఇది రూ. 20,311 కోట్లు అదనం.

 

ముఖ్యాంశాలు..

 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాలుగు చోట్ల మల్టీ మోడల్పార్క్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను ఆహ్వానిస్తారు.
 • ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, చిన్న రైతులను దృష్టిలో పెట్టుకుని సమర్థవంతమైన సరుకు రవాణా వ్యవస్థ, ఉత్పత్తులను రైల్వే తయారు చేస్తుంది.
 • స్థానిక వ్యాపారులు, సరఫరాదారులకు సహాయం చేసేందుకువన్స్టేషన్‌–వన్ప్రొడక్టుకాన్సెప్ట్ను తీసుకువస్తారు.
 • పార్సిళ్ల రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేతో పోస్టల్డిపార్ట్మెంట్ను అనుసంధానం చేస్తారు.
 • రైళ్ల రక్షణకుకవచ్‌’ పరిధిలోకి 2 వేల కిలోమీటర్ల నెట్వర్క్ను తీసుకువస్తారు.
 • వచ్చే మూడేళ్లలో మల్టీ మోడల్లాజిస్టిక్స్సదుపాయాలను కల్పించేందుకు 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తారు.
 • 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.39 లక్షల కోట్లను ఆర్జించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గతేడాది కన్నా 18 శాతం అదనం.

 

కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ

సహకార సంఘాలను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు పన్ను రేట్లను తగ్గిస్తూ పలు ప్రతిపాదనలు చేసింది. 2022–23 ఏడాదికి రూ.900 కోట్లు నిధులను కేటాయించారు. ప్రస్తుతం సహకార సంఘాలపై ఉన్న ఆల్టర్నేటివ్మినిమమ్ట్యాక్స్‌ (ఏఎంటీ)ని 18.5 శాతం నుంచి 15 శాతానికి , సర్ఛార్జీలను 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. కోటి రూపాయల నుంచి రూ.10 కోట్ల ఆదాయం కలిగిన సహకార సంఘాలకు ఈ ప్రయోజనం లభించనుంది.

 

డిజిటల్ఆస్తులపై 30 శాతం పన్ను

కొత్తగా పుట్టుకొస్తున్న క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్, డిజిటల్ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకువస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. డిజిటల్ఆస్తుల ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా డిజిటల్ఆస్తుల లావాదేవీలపై ఒక శాతం మూల వద్ద పన్ను (టీడీఎస్‌)ను విధించనున్నారు. దీని ద్వారా దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ప్రభుత్వం పర్యవేక్షించనుందన్న సంకేతాలను ఇచ్చినట్లయింది.

ద్రవ్యలోటు అంచనా

2021–22లో 6.9 శాతం

ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంచేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరం 6.8 శాతం (స్థూల దేశీయోత్పత్తిజీడీపీ విలువలో) ఉంటుందని 2021, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తన మూడవ వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల అంచనావేశారు. విలువలో ఇది రూ. 15,06,812 కోట్లు. అయితే తాజా 2022–23 బడ్జెట్లో దీనిని స్వల్పంగా 6.9 శాతానికి సవరించారు. విలువలో  15,91,089 కోట్లు ఉంటుందని తాజాగా అంచనావేశారు.

 

2022–23లో 6.4 శాతం

ఇక రానున్న ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటును 6.4 శాతంగా తాజా బడ్జెట్ను అంచనావేసింది. విలువలో ఇది రూ.16,61,196 కోట్లు. 15వ ఫైనాన్స్కమిషన్సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్‌ 2021–22 బడ్జెట్ప్రసంగంలో పేర్కొన్నారు.

 

డిజిటల్ఇండియా లక్ష్యంగా..

Digital

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్డిజిటల్ఇండియా లక్ష్యంగా బడ్జెట్లో కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాలనతోపాటు అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రకటించారు. అందులో కీలకమైనవి..

 • 75 బ్యాంకులు: డిజిటల్బ్యాంకింగ్పై నజర్దేశంలో ప్రతి పౌరుడికి డిజిటల్బ్యాంకింగ్సౌకర్యం అందించేందుకు చర్యలు. ఇందుకోసం అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్సేవలు. డిజిటల్పేమెంట్లు, నెట్బ్యాంకింగ్, ఏటీఎం సేవలకోసం 75 జిల్లాల్లో 75 బ్యాంకుల (డిజిటల్బ్యాంకులు) ఏర్పాటు.
 • డిజిటల్పాస్పోర్టు: విదేశీ ప్రయాణాలను సులభతరం చేయడం, భద్రత కోసం.. ఇకపై అత్యాధునిక చిప్లను అమర్చిన డిజిటల్పాస్పోర్టుల మంజూరు. 2022–23లోనే అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు.
 • డిజిటల్‌ ‘రుపీ’: ‘రుపీఅధికారిక డిజిటల్కరెన్సీ. అత్యాధునిక బ్లాక్చైన్టెక్నాలజీతో ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అమల్లోకి..
 • కిసాన్డ్రోన్ల వినియోగం: వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్ల అభివృద్ధి
 • 5జీకి లైన్క్లియర్‌: అత్యాధునిక 5జీ టెక్నాలజీని 2022 ఏడాదే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు. త్వరలోనే ప్రైవేటు టెలికం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్వేలం.
 • డిజిటల్వర్సిటీలు: దేశవ్యాప్తంగా డిజిటల్యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రోత్సాహం
 • తరగతికో టీవీ చానల్‌: ఆన్లైన్తరగతులను అందరికీ అందించడం లక్ష్యంగా.. ప్రతి తరగతికి ఒక టీవీ చానల్‌. ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు. ఇందుకోసం ప్రస్తుతమున్న 12 విద్యా టీవీ చానళ్లను 200కు పెంచేందుకు నిర్ణయం.
 • ఇంటింటికీ టెక్నాలజీ: దేశవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, సాంకేతిక సదుపాయాలు అందించే ఆఫ్టికల్ఫైబర్నెట్వర్క్‌ 2025 నాటికి పూర్తి. గ్రామీణ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో ఫైబర్కేబుళ్ల ఏర్పాటు.
 • అమ్మకాలు.. ఆన్లైన్‌: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే సరుకులు, వస్తువులతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టళ్ల ఏర్పాటు.
 • మంత్రిత్వ శాఖల్లో నో పేపర్‌: ఇకపై కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం అమలు. మంత్రిత్వ శాఖల లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించేలా డిజిటలైజేషన్‌.

 

2022–23 బడ్జెట్‌ : మరిన్ని అంశాలు

 • కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ), పబ్లిక్ఎంటర్ప్రైజెస్సెలక్షన్బోర్డుల వ్యవహారాల నిర్వహణకు తాజా బడ్జెట్లో రూ.32.70 కోట్లు కేటాయించారు.
 • యానిమేషన్, విజువల్ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్‌ (ఏవీజీసీ) రంగాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు టాస్క్ఫోర్స్ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి నిర్మల ప్రకటించారు.
 • ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పొరేట్ల కష్టాలను సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన రీతిలో పరిష్కరించడం లక్ష్యంగా దివాలా కోడ్‌ (ఐబీసీ)కు అవసరమైన మరిన్ని సవరణలు తీసుకువస్తున్నట్టు బడ్జెట్సూచించింది
 • వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టైగర్ప్రాజెక్టుకోసం రూ.300 కోట్లను కేటాయించారు.
 • ఏనుగుల సంరక్షణ కోసం రూపొందించిన ప్రాజెక్టు ఎలిఫెంట్కోసం కేటాయింపులను రూ.33కోట్లనుంచి రూ.35 కోట్లకు పెంచారు.
 • పులుల గణన, సంరక్షణకు రూ.10కోట్లు, సెంట్రల్జూ అథారిటీకి రూ.10కోట్ల చొప్పున కేటాయించారు.
 • తీరప్రాంతాలను పరిరక్షించడం, ప్రజల జీవనోపాధి భద్రత కోసం తాజా బడ్జెట్లో రూ.195కోట్లను కేటాయించారు.
 • హిమాలయాల అధ్యయన జాతీయ మిషన్కు రూ.8కోట్లు, వైల్డ్లైఫ్క్రైమ్కంట్రోల్బ్యూరో, ఫారెస్ట్సర్వే ఆఫ్ఇండియా, జూలాజికల్సర్వే ఆఫ్ఇండియా, నేషనల్గ్రీన్ట్రిబ్యునల్లకు రూ.487కోట్లను కేటాయించారు.
 • నాలెడ్జ్అండ్కెపాసిటీ బిల్డింగ్నిధులను గతేడాది రూ.70కోట్ల నుంచి రూ.78.62కోట్లకు పెంచారు
 • 2022–23 బడ్జెట్లో కేంద్ర సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం రూ.3,009.05 కోట్లు కేటాయించింది. 2021–22 బడ్జెట్అంచనా కంటే ఈసారి కేటాయింపులను 11.9 శాతం పెంచారు
 • సోలార్పీవీ మాడ్యూళ్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్) కింద తాజా బడ్జెట్లో రూ.24,000 కోట్లను కేటాయించారు.
 • దేశంలో విద్యుత్వాహనాల విస్తృత వినియోగానికి మరో ముందడుగు పడింది. బ్యాటరీలను విద్యుత్వాహనాల్లో ఒక భాగంగా కాకుండా... వాహనాలతోపాటు అందించే సేవగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడం దీనికి కారణం. విద్యుత్వాహన బ్యాటరీలను మార్చుకునేందుకు వీలు కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ప్రసంగంలో పేర్కొన్నారు.  
 • హోం శాఖకు కేటాయింపులను ఈ బడ్జెట్లో రూ.1.85 లక్షల కోట్లకు పెంచారు. గతేడాది కేటాయించిన రూ.1,66,546 కోట్ల కంటే ఇది 11.5 శాతం ఎక్కువ.–
 • తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఏలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆదాయపు పన్ను చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులను సవరిస్తూ సంస్కరణలను ప్రవేశపెట్టారు.
 • కెన్‌–బెత్వా నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేశారురూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్‌–బెత్వా లింక్ప్రాజెక్ట్ద్వారా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్ఖండ్ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది.  
 • మరో ఐదు నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్ర ఆర్ధిక మంత్రి కీలక ప్రకటన చేశారు. దామనగంగపింజల్, పర్తాపీనర్మద, గోదావరికృష్ణా, కృష్ణాపెన్నా, పెన్నాకావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్లు ఇప్పటికే ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు.
 • హర్ఘర్నల్సే జల్‌’ కార్యక్రమం కింద 8.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిందని, 2022–23 ఆర్థిక ఏడాదిలో మరో 3.8 కోట్ల ఇళ్లకు నీటిని అందించే లక్ష్యంతో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
 • 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం వ్యయాల అంచనా 39.45 లక్షల కోట్లు. రుణాలు కాకుండా మొత్తం ఆదాయాల అంచనా రూ.22.84 లక్షల కోట్లు. వెరసి ద్రవ్యలోటు దాదాపు రూ.16.61 లక్షల కోట్లు.  
 • 2022–23 ఆర్థిక సంవత్సరంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు.

ఆర్థిక మంత్రి నిర్మ‌ల బ‌డ్జెట్ ప్ర‌సంగం

Published date : 21 Feb 2022 12:45PM

Photo Stories