Skip to main content

Telangana Budget Live Updates: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను ఫిబ్రవరి 10వ తేదీ ప్రవేశపెట్టింది.
Budget presentation by Congress in Telangana.   Telangana Budget Live Updates Telangana Congress members discussing budget details in a meeting.

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశానికి సంబంధించిన వివ‌రాలు ఇవే..

భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగం..

  • 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు

  • రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. 

  • మూలధన వ్యయం 29,669 కోట్లు

  • తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మాక మార్పు తెస్తాం. 
  • ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొంటాం. 
  • ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది. 
  • నిస్సాహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. 
  • సమానత్వమే మా ప్రభుత్వ విధానం. 
  • అందరి కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకు వెళ్తాం. 
  • తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. 
  • ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలను ప్రకటించాం. 
  • కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. 
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది.
  • ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
  • ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించడం మా చిత్తశుద్దికి నిదర్శనం.
  • రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత. 
  • గత ప్రభుత్వంతో ప్రతీనెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి. 
  • ఉద్యోగులు, పెన్షనర్లు డబ్బుల కోసం ఎదురు చూశారు. 
  • ఆర్థిక సంక్షేమంతో పాటు మెరుగైన పాలన అందిస్తాం. 
  • గత ప్రభుత్వ బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా ఉంది. 
  • గత ప్రభుత్వం దళితబంధు పథకానికి రూ.17700 కోట్లు చూపించారు. 
  • గత సర్కార్‌ దళితబంధు పథకానికి ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. 
  • జీఎస్డీపీ 2022-23తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు చేరింది. 
  • ఆర్థిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది 
  • దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది. 
  • అధిక ద్రవ్యోల్భణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఐదో స్థానం. 

కేటాయింపులు ఇలా..

  • ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు.  
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు. 
  • పంచాయతీరాజ్‌ శాఖకు రూ.40080 కోట్లు.
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. 
  • వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. 
  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. 
  • గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. 
  • నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. 
  • బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. 

► తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం. 
► బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. 
► మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్‌ బాబు. 

► తెలంగాణ బడ్జెట్‌ 2.75 లక్షల కోట్లు.

నేటి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశానికి కేటీఆర్‌ దూరం

  • ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ
  • బీఆర్‌ఎస్‌ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని.
  • అనంతరం తెలంగాణ భవన్‌కు కేటీఆర్
  • ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్‌ ప్రత్యేక భేటీ

రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. 

  • సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు
  • సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు

► బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్‌కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.

► శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు


►ఈనెల 12వ తేదీన బడ్జెట్‌ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ‍ప్లాన్‌. 

►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌.

► సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం.

► కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. 

► కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించిన సీఎం రేవంత్

► కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్‌. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. 

 

బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌

  • అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి కామెంట్స్‌
  • స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. 
  • రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను.
  • కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు
  • ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు

9:50AM, Feb 10, 2024

  • బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క
  • ఇచ్చిన హామీలను అమలు చేస్తాం

9:47AM, Feb 10, 2024

  • ముగిసిన తెలంగాణ కేబినెట్‌సమావేశం
  • ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం
  • మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
  • తెలంగాణ బడ్జెట్‌ అంచనా రూ. 3లక్షల కోట్లు
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న భట్టి
  • మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు

 

Published date : 10 Feb 2024 01:42PM

Photo Stories