పార్లమెంట్‌లో 2019-2020 ఆర్థిక సర్వే
Sakshi Education
భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన 2019-20 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)లో 6 నుంచి 6.5శాతం నమోదవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని మంత్రి నిర్మలా పేర్కొన్నారు.
ఆర్థిక సర్వే 2019-2020 ముఖ్యాంశాలు:
ఆర్థిక సర్వే 2019-2020 ముఖ్యాంశాలు:
- 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.5 శాతంగా ఉండొచ్చు.
- ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూరుుంగ్ బిజినెస్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. భారత్ ర్యాంక్ 79 స్థానాలు మెరుగుపడింది. 2014లో 142వ స్థానం నుంచి 2019లో 63వ స్థానానికి చేరుకున్నాం.
- 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
- ఆర్థిక వృద్ధి కోరుకుంటే.. కచ్చితంగా ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవాల్సిందే. ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటమా? లేదా ఆర్థిక వృద్ధా? రెండింటిలో ఏదో ఒకటే సాధ్యమౌతుంది.
- 2019-2020 ఆర్థిక వ్యవస్థ పన్ను వసూళ్లు అంచనా వేసిన దాని కన్నా తగ్గొచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 2.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
- వ్యవసాయ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 2.8 శాతంగా ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 శాతంగా నమోదు కావొచ్చు.
- 2014 నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ.
- చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్‌గా అవతరించింది.
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ పథకం కింద 47.33 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది.
- స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకు పైగా టారుులెట్లను నిర్మించారు.
- 2018లో ఏకంగా 1,24,000 కంపెనీల ఏర్పాటు జరిగింది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది.
Published date : 31 Jan 2020 05:57PM