Skip to main content

Interim Budget 2024: కొత్త రికార్డ్.. 56 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ముగించిన ఆర్థిక మంత్రి..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు.
Nirmala Sitharaman sets new speech duration record   Record-breaking 56-minute budget presentation   Nirmala Sitharaman's Shortest Budget 2024 Speech Only 58 Minutes  Nirmala Sitharaman presenting Interim Budget 2024

బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈమె కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డ్ స‌`ష్టించారు.  నిర్మలా సీతారామన్‌ ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా 2020లో 160 నిముషాలు (2 గంటల 40 నిమిషాలు), అత్యల్పంగా 2024 మధ్యంతర బడ్జెట్ 56 నిముషాలు. 2019లో ఈమె బడ్జెట్ ప్రసంగం 140 నిముషాలు, 2021లో 100 నిముషాలు, 2022లో 91 నిముషాలు, 2023లో 87 నిమిషాల ప్రసంగం చేశారు. 

నిర్మలా సీతారామన్ కంటే ముందు 1977లో కేంద్ర బడ్జెట్‌ సమర్పించిన 'హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్' అతి తక్కువ బడ్జెట్ ప్రసంగంగా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. పదాల లెక్కన అత్యంత సుదీర్ఘ బడ్జెట్‌ను రూపొందించిన రికార్డు 'మన్మోహన్ సింగ్' పేరిట ఉంది. 1991లో సమర్పించిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.

Union Budget 2024-25 Allocations: రూ.47.65 లక్షల కోట్ల‌ బడ్జెట్‌.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!

Published date : 03 Feb 2024 09:12AM

Photo Stories