భారత ఆర్థిక నివేదిక 2013-14
Sakshi Education
దేశ ఆర్థిక స్థితి రోజు రోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలన్నా, ధరలు దిగిరావాలన్నా కఠిన చర్యలు తప్పనిసరి అని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేసింది. ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ జులై 9న 2013-14 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ దిద్దుబాటు ఆవశ్యకతను తెలియజేసింది. 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 5.4-5.9 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది. దేశంలో వసూలు చేస్తున్న పన్నులు పెరగాల్సిన ఆవశ్యకతను, సబ్సిడీలు తగ్గాల్సిన అవసరాన్నీ పేర్కొంది.
సర్వే ముఖ్యాంశాలు
సర్వే ముఖ్యాంశాలు
- ఈ ఏడాది వృద్ధి రేటు 5.4-5.9% మధ్య ఉండొచ్చు. 2015-16 తర్వాత 7-8 శాతానికి చేరుకోవచ్చు.
- అంతర్జాతీయంగా, రాజకీయంగా, భౌగోళికంగా ప్రతికూలత, రుతుపవనాలు బాగోలేకపోవడం వంటివన్నీ జీడీపీపై ప్రభావం చూపిస్తాయి.
- ప్రస్తుత పన్నులు జీడీపీలో 9 శాతానికి మించి లేవు. అభివృద్ధి చెందిన ఏ దేశంతో పోల్చుకున్నా ఇది తక్కువే. ఇంకా పెరగాలి.
- ఈ ఏడాది చివరికి టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టొచ్చు. రిటైల్ ధరలు కూడా కొంత తగ్గుతున్న సంకేతాలున్నాయి.
- ఆర్థిక క్రమశిక్షణ సాధ్యం కావాలంటే అనవసర సబ్సిడీలు తొలగించి కొన్ని సబ్సిడీల్లో కోతపెట్టాలి.
- సరళమైన పన్ను విధానం, మినహాయింపులు తగ్గించడం, జీఎస్టీ అమలు వంటి చర్యలు చేపట్టాలి. ఏళ్ల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో ప్రత్యక్ష పన్నుల కోడ్ను అమల్లోకి తేవాలి.
- రూపాయి విలువ పతనానికి అడ్డుకట్టపడింది. మెల్లగా స్థిరపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది.
- వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా 88,537 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం జతచేసేందుకు ప్రణాళికలు.
- కోల్ ఇండియాను పునర్వ్యవస్థీకరించి బొగ్గు గనుల మైనింగ్లోకి ప్రై
- దేశం జనాభాలో పేదల సంఖ్య 2004-05లో 37.2 శాతం ఉండగా 2011-12 నాటికి 21.9 శాతానికి తగ్గింది. ఇది పురోగతికి సంకేతమే.
‘ఉపాధి’ని ప్రక్షాళన చేయాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ‘ఉపాధి హామీ’ పథ కం పలుచోట్ల దుర్వినియోగం అవుతోందని, దానిని వెంటనే ప్రక్షాళన చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపాధి పథకాన్ని గ్రామ పంచాయతీలు కేంద్రంగా నిర్వహించడం వల్ల.. పథకం కింద నిర్వహించే పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సరిగా ఉండట్లేదని వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పథకంపై చైతన్యం లేకపోవడం, పనుల ఎంపికలో దురుద్దేశం, సామాజిక తనిఖీలు సరిగా నిర్వహించకపోవడం వంటి వాటివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయంది. తక్కువ మందికి లబ్ధి కలిగే పనులను కాకుండా... చాలామందికి ఉపయోగపడే పనులను ‘ఉపాధి’ కింద చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ పథకం కింద శాశ్వత ఆస్తుల కల్పన, పర్యాటకాభివృద్ధికి తోడ్పడే పనులు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే పనులను చేపట్టాలని సూచించింది.
యూరియాపై రూ.8,500 కోట్లు వృథా
యూరియాపై భారత ప్రభుత్వం, రైతులు మొత్తం రూ.8,500 కోట్లు వృథా చేస్తున్నారని ఆర్థిక సర్వే 2013-14 వెల్లడించింది. అస్తవ్యస్త విధానాలవల్ల ఎరువుల రంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయని, దీనివల్ల అధికమొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. దేశంలో అవసరానికి మించి దాదాపు 50 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేస్తున్నారని, రైతులు రూ.2,680కోట్లు, ప్రభుత్వం రూ.5,860కోట్లు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అధిక ధరలు, అధిక పన్నుల రూపంలో అంతిమంగా ఈ భారం విని యోగదారుడిపైనే పడుతోందని పేర్కొంది. ఒక టన్ను యూరియాకు రైతు రూ.5,360 చెల్లిస్తుండగా, సర్కారు రూ.11,760 సబ్సిడీగా చెల్లిస్తోందని తెలిపింది.
‘మధ్యాహ్న భోజనం’ను సంస్కరించాలి
న్యూఢిల్లీ: విద్యార్థులను పాఠశాలవైపు మళ్లించాలంటే.. ప్రస్తుతం అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్కరించాలని ‘ఆర్థిక సర్వే ’ పేర్కొంది. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే బాధ్యతల వల్ల టీచర్ల బోధనపై ప్రభావం పడుతోంది. ఈ పథకం కింద 2013-14లో రూ.10,927 కోట్ల వ్యయంతో సుమారు 10.80 కోట్ల మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. 2012-13 నాటికి దేశంలో 723 యూనివర్సిటీలు, 37,204 కాలేజీలు, 11,356 డిప్లొమా స్థాయి విద్యా సంస్థలున్నాయి. 2013-14లో దేశ జీడీపీలో 3.3 శాతాన్ని విద్యారంగంపై ఖర్చు చేశారు. విద్యారంగంపై వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. 2013-14 వరకూ సర్వశిక్షా అభియాన్ కింద.. 3,57,611 కొత్త ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద 15.06 లక్షల మంది టీచర్లను నియమించారు.
2021 నాటికి ‘వర్కింగ్ ఏజ్’ జనాభా 64%
దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా నిష్పత్తి 2001లో ఉన్న 58 శాతం నుంచి 64 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. వీరిలో 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉంటారని తెలిపింది. 2020 నాటికి 125 కోట్లకు చేరుకునే దేశ జనాభాలో ప్రజల సగటు వయసు 29 ఏళ్లుగా ఉంటుందని వివరించింది. 2011 నుంచి 2016 మధ్యలో 6.35 కోట్ల మంది యువతీయువకులు కొత్తగా ఈ జాబితాలో చేరతారని ప్రభుత్వం తెలిపింది.
‘వైజాగ్-చెన్నై’ కారిడార్పై అధ్యయనం
ప్రతిపాదిత ఈస్ట్కోస్ట్ ఎకనామిక్ కారిడార్(ఈసీఈసీ)పై అధ్యయనంలో భాగంగా.. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్(వీసీఐసీ) ఏర్పాటుపై అధ్యయనం జరుపుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది.
ఆర్థిక పరిస్థితి దుర్భరం...
2006 నుంచి 2014 వరకూ అధిక ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టవ వచ్చిందని, ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గింపు, ప్రభుత్వ ఆదాయం పెంపునకు తగిన చర్యలన్నీ చేపట్టాలని సూచించింది. ‘గత రెండు సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోవడానికి(2012-13లో 4.5%, 2013-14లో 4.7%) పారిశ్రామిక రంగం తిరోగమనమే కారణమని సర్వే స్పష్టం చేసింది.
ద్రవ్యలోటు ఆందోళన...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య వ్యత్యాసం) 4.5 శాతంగా ఉండొచ్చని సర్వే చెబుతోంది.
పరుగులు తీస్తున్న సేవల రంగం
దేశీ సర్వీసుల రంగం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2001-2012 కాలంలో వార్షికంగా 9% చొప్పున దూసుకెళుతూ వేగవంత వృద్ధిని అందుకుంటున్న రంగాలలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ కాలంలో 10.9% వృద్ధితో చైనా సర్వీసుల రంగం అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇక జీడీపీ విషయానికివస్తే ప్రపంచంలోని టాప్ 15 దేశాలలో ఇండియా 10వ ర్యాంక్లో ఉన్నట్లు వెల్లడించింది. సర్వీసుల జీడీపీ రీత్యా అయితే 12వ స్థానాన్ని పొందినట్లు పేర్కొంది. ప్రపంచ జీడీపీలో సర్వీసుల రంగం వాటా 65.9% అయినప్పటికీ, 2012లో ఉద్యోగ కల్పన విషయంలో ఈ వాటా 44% మాత్రమేనని పేర్కొంది. ఇదే కాలంలో ఇండియా జీడీపీలో సర్వీసుల రంగానికి 56.9% వాటా ఉండగా, ఉద్యోగ కల్పన రీత్యా కేవలం 28.1% వాటాను పొందినట్లు వివరించింది.
2012-13తో పోలిస్తే 2013-14లో సర్వీసుల రంగ వృద్ధి నామమాత్రంగా తగ్గి 6.8%కు పరిమితమైనట్లు వెల్లడించింది.
తయారీకి 16 ప్రత్యేక జోన్లు
ప్రభుత్వం 16 జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లు(ఎన్ఐఎంజెడ్లు) ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ రంగ వాటాను 25%కు పెంచడం పాలసీ లక్ష్యమని, తద్వారా 10 కోట్ల ఉద్యోగాల కల్పనను సాధించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 16 ఎన్ఐఎంజెడ్లలో ఎనిమిదింటిని ఢిల్లీ-ముంబై కారిడార్(డీఎంఐసీ)లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరో 8 ఎన్ఐఎంజెడ్లను నాగ్పూర్, చిత్తూరు, మెదక్, టుమ్కూర్, కోలార్, బీదర్, గుల్బ ర్గాలలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
ఎగుమతుల వాటా 4 శాతానికి పెంచాలి...
ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను వచ్చే ఐదేళ్లలో కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. 2013-14లో దేశ ఎగుమతుల వాటా 1.7 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచాలంటే ఏటా ఎగుమతుల్లో 30 శాతం వృద్ధిని సాధించాలని కూడా పేర్కొంది. 2003-04 నుంచి 2007-08 మధ్య ఎగుమతుల్లో 20 శాతం వృద్ధి నమోదైందని ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా 1990లలో 0.5 శాతం మాత్రమే ఉందని.. 2013 నాటికి ఇది 1.7 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో చైనా ఎగుమతుల వాటా 1.8 శాతం నుంచి ఏకంగా 11.8 శాతానికి ఎగబాకడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 312 బిలియన్ డాలర్లు మాత్రమే జరిగాయి.
జీఎస్టీ, డీటీసీలే కీలకం...
జీఎస్టీ అమల్లోకి వస్తే ద్వంద పన్నుల విధానం తొలిగిపోవడమే కాకుండా, ఎగుమతులు, దిగుమతుల పన్నులు కూడా ఒకే పరిధిలోకి వస్తాయి. దీంతో కంపెనీలకు పోటీ సామర్థ్యం పెరిగి ఎగుమతులు వృద్ధి చెందుతాయని పేర్కొంది. అలాగే ప్రస్తుతం విధానంలో ఉన్న సర్ చార్జీలు, సుంకాలు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అనవసర పన్నులు (బ్యాడ్ ట్యాక్స్) తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.
ఎంతో సంక్లిష్టంగా ఉన్న ఆదాయ పన్నుల చట్టం స్థానంలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్ (డీటీసీ)ని ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో వ్యక్తిగత, వ్యాపార వర్గాల్లో ఆదాయపు పన్నుల సమస్యలు తగ్గి పన్ను వసూళ్లు పెరుగుతాయని పేర్కొంది.
మొండిబకాయిల సెగ..
గడచిన రెండేళ్లలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 2008-09లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్పీఏల రేటు 2.09% కాగా, ఇది 2014 మార్చి నాటికి 4.4%కి ఎగసింది. నిధుల రూపంలో చూస్తే 2010 మార్చి నాటికి స్థూలంగా ఈ మొత్తం రూ.59,972 కోట్లుకాగా 2014 మార్చికి రూ.2,04,249 కోట్లకు చేరింది. ప్రైవేటురంగం సహా అన్ని బ్యాంకుల ఎన్పీఏల రేటు 2.36% నుంచి 3.90%కి చేరింది.
సెజ్లను పునరుద్ధరించాలి..
ప్రారంభంలో తయారీ, ఎగుమతి కేంద్రాలుగా విలసిల్లిన సెజ్లు 2011లో కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్), డివిడెండ్ పంపణీ పన్నుల (డీడీటీ) విధింపుతో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. సెజ్లపై మ్యాట్ను ఉపసంహరించాలని వాణిజ్య శాఖ ఇప్పటికే ఆర్థిక శాఖను కోరింది. సెజ్ల డెవలపర్లు, యూనిట్ల బుక్ ప్రాఫిట్స్పై 18.5 శాతం మ్యాట్ను 2011లో విధించారు.
కార్మిక సంస్కరణలు రావాలి
కొత్త సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించేందుకు రెండో తరం కార్మిక సంస్కరణలను అమలు చేసి అపారంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకోవాలని సర్వే సూచించింది. 2000-2005 మధ్యకాలంలో 2.8 శాతంగా ఉన్న ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2005-2012 లో 0.5 శాతానికి పడిపోయాయి. దాదాపు 125 కోట్లుగా ఉన్న భారత జనాభా సగటు వయసు 2020లో 29 ఏళ్లుగా ఉంటుందని అంచనా. చైనా, అమెరికా(సగటు వయసు 37 ఏళ్లు)లతో పోలిస్తే ఇండియాలో పిన్నవయస్కులు అధికంగా ఉంటారు. పనిచేసే వయసులో ఉండే జనాభా సంఖ్య 2001లో 58% ఉండగా 2021 నాటికి 64%కి పెరగనుంది.
స్పెక్ట్రం పాలసీని మెరుగుపరచాలి...
టెలికం స్పెక్ట్రం నిర్వహణకు సంబంధించి మరింత మెరుగైన పాలసీని రూపొందించాలి. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఎన్ఓఎఫ్ఎన్), దేశవ్యాప్తంగా నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్పీ), గ్రామీణ టెలికం వినియోగదారుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. ఎన్ఓఎఫ్ఎన్ కింద దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవల నెట్వర్క్తో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక స్పష్టంగా నిర్ధేశించింది. దీనిప్రకారం... వచ్చే ఏడాది మార్చినాటికి 50 వేల పంచాయతీలను, 2016 మార్చికల్లా మరో లక్ష, 2017 మార్చినాటికి పూర్తిగా 2.5 లక్షల పంచాయతీల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
భారీ వృద్ధికి మూడంచెల వ్యూహం
దేశం 7 నుంచి 8 శాతం శ్రేణిలో భారీ వృద్ధి సాధించడానికి ద్రవ్యోల్బణం కట్టడి-పన్నుల వసూళ్ల పెంపు, వ్యయ సంస్కరణలు, మార్కెట్ ఎకానమీకి సంబంధించి న్యాయ-నియంత్రణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం వంటి మూడంచెల వ్యూహాన్ని అవలంబించాలి.
కొంచెం పెరగనున్న క్యాడ్..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఇన్ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిధుల మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) జీడీపీతో పోల్చితే 2.1 శాతంగా (45 బిలియన్ డాలర్లు) నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగిన స్థాయిలో ఈ రేటు ఉంది. 2012-13లో క్యాడ్ 4.7 శాతం (88.2 బిలియన్ డాలర్లు)కాగా, 2013-14లో 1.7 శాతంగా (32.4 బిలియన్ డాలర్లు) ఉంది.
రైల్వేల్లో ఎఫ్డీఐలపై త్వరిత నిర్ణయం
రైల్వేల ప్రైవేటీకరణ, రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)ను అనుమతించడం అతి పెద్ద సంస్కరణలు కానున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రైల్వే రంగంలో ఎఫ్డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ఈ విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. భారత రైల్వేలు ప్రపంచ స్థాయి ప్రమాణాలనందుకోవాలంటే ఎఫ్డీఐలు తప్పనిసరని, నిర్వహణలో తప్ప అన్ని విభాగాల్లో ఎఫ్డీఐలను అనుమతించాలనే ప్రతిపాదన ఉంది.
కొత్త ఎఫ్ఆర్బీఎం చట్టం అవసరం...
ప్రభుత్వ వ్యయాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, బడ్జెటరీ నిధుల నిర్వహణ తత్సంబంధ అంశాల్లో మరింత మెరుగుదల, పటిష్టత అవసరం ఉంది. ఈ దిశలో కొత్త ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) చట్టానికి రూపకల్పన చేయాలి. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ తత్సంబంధ అంశాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోంది. పన్నుల వ్యవస్థ సరళతరంగా, అమలుకు సాధ్యమయ్యేలా పారదర్శకత, స్థిరత్వంగా ఉండాలి.
కరెన్సీ స్థిరీకరణ జరిగింది...
2013లో రూపాయి భారీ పతనానికి ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్ ప్రధాన కారణం. అయితే ఇప్పుడు కరెన్సీ స్థిరీకరణ జరిగిందనే భావించవచ్చు. గత యేడాది ఆగస్టులో డాలర్ మారకంలో 68.75 రికార్డు దిగువకు జారిన రూపాయి, ఇటీవల తిరిగి 59.9కి బలపడింది.

Published date : 17 Jul 2014 06:34PM