Skip to main content

LIC HFL Recruitment : ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
Job applications for Junior Assistant Posts at LIC HFL  LIC HFL Junior Assistant Recruitment Notification LIC HFL Job Openings for Junior Assistants  Apply for Junior Assistant Positions at LIC HFL  LIC HFL Junior Assistant Vacancy Announcement  LIC Housing Finance Limited Junior Assistant Jobs LICHousingFinance

»    మొత్తం ఖాళీల సంఖ్య: 200.
»    రాష్ట్రాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–12, అస్సాం–05, ఛత్తీస్‌గఢ్‌–06, గుజరాత్‌–05, హిమాచల్‌ప్రదేశ్‌–03, జమ్మూ కశ్మీర్‌–01, కర్ణాటక–38, మధ్యప్రదేశ్‌–12, మహారాష్ట్ర–53, పుదుచ్చేరి–01, సిక్కిం–01, తెలంగాణ–31, తమిళనాడు–10, ఉత్తరప్రదేశ్‌–17, పశ్చిమ బెంగాల్‌–05.
»    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏౖ§ð నా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఆపరేటింగ్, వర్కింగ్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/లాంగ్వేజ్‌లలో సర్టిఫికేట్‌/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.07.2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    వేతనం: పని ప్రదేశం ఆధారంగా నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 ఉంటుంది.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు–40 మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (40 ప్రశ్నలు–40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు–40 మార్కులు), కంప్యూటర్‌ స్కిల్‌(40 ప్రశ్నలు–40 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 25.07.2024
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 14.08.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌ 2024.
»    వెబ్‌సైట్‌: www.lichousing.com

Eighth Class Admissions 2025 : ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో 8వ‌ తరగతి ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష విధానం ఇలా..!

Published date : 30 Jul 2024 12:22PM

Photo Stories