Skip to main content

IBPS Notification 2024 : ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ–13 నోటిఫికేషన్ విడుద‌ల‌.. ఏపీ, తెలంగాణ‌లో భ‌ర్తీకి పోస్టుల సంఖ్య ఇలా..

బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌).. ఆర్‌ఆర్‌బీల్లో మొత్తం 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Institute of Banking Personnel Selection Notification 2024 for jobs at banks

దీని ద్వారా స్కేల్‌–1,2,3లతో గ్రూప్‌–ఎ ఆఫీసర్స్‌; గ్రూప్‌–బీ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. బ్యాచిలర్‌ డిగ్రీ మొదలు బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. అన్ని నేపథ్యాల వారు పోటీ పడే అవకాశం ఉంది! ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ–13 పోస్టులు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలకు ఉమ్మడి వ్యవస్థ.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో పోస్ట్‌ల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీస్‌–13 పేరుతో మల్టీపర్పస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌–1, స్కేల్‌–2, స్కేల్‌–3 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Free Coaching: సివిల్‌ సర్వీస్‌ అప్టిట్యూడ్‌ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మొత్తం పోస్టులు 9,995

  •     ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ ప్రక్రియ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో వివిధ విభాగాల్లో 9,995 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 5,585 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–1: 3,499 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 70 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2(చార్టర్డ్‌ అకౌంటెంట్‌): 60 పోస్టులు; ఆఫీసర్‌(మేనేజర్‌–జనరల్‌ బ్యాంకింగ్‌) స్కేల్‌–2: 496 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 94 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 30 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2 (మార్కెటింగ్‌): 11 పోస్టులు; ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 21 పోస్టులు; –ఆఫీసర్‌ స్కేల్‌–3(సీనియర్‌ ఆఫీసర్‌): 129 పోస్టులు ఉన్నాయి.
  •     తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 450 పోస్ట్‌లు, తెలంగాణలో 700 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • అర్హతలు
  •     ఆయా పోస్ట్‌లను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్, లా, ఎంబీఏ, సీఏ తదితర అర్హతలు ఉండాలి. సంబంధిత కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. వీరు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ నాటికి సంబంధిత సర్టిఫికెట్లు పొందాలి.
  •     వయసు: 01.06.2024 నాటికి గ్రూప్‌ బీ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల(మల్టీపర్పస్‌)కు 18–28 ఏళ్ల మధ్య ఉండాలి. అదేవిధంగా గ్రూప్‌ ఏ ఆఫీసర్‌ స్కేల్‌ 1 (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు 18–30 ఏళ్ల మధ్య; ఆఫీసర్‌ స్కేల్‌ 2 (మేనేజర్‌) పోస్టులకు 21–32 ఏళ్ల మధ్య; ఆఫీసర్‌స్కేల్‌ 2 (సీనియర్‌ మేనేజర్‌) పోస్టులకు 21–40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ/ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు వయో సడలింపు పొందొచ్చు.

NEET-UG Exam Row: తప్పు జరిగితే ఒప్పుకుని సరిదిద్దుకోండి.. NTA తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

ఎంపిక వేర్వేరుగా
ఐబీపీఎస్‌ ఆయా పోస్ట్‌లను అనుసరించి వేర్వేరు ఎంపిక విధానాలను అనుసరిస్తోంది. ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌–1 పోస్ట్‌లకు రెండు దశల రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌)తోపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆఫీసర్‌ స్కేల్‌–2, స్కేల్‌–3 పోస్టులకు మాత్రం ఒక దశ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆఫీస్‌ అసిస్టెంట్‌.. ప్రిలిమినరీ పరీక్ష

  •     ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌) ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో 80 ప్రశ్నలు–80 మార్కులకు జరుగుతుంది. ఇందు­లో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, న్యూ­మరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తే మెయిన్‌ రాసేందుకు అనుమతి లభిస్తుంది.
  •     మెయిన్‌ ఎగ్జామినేషన్‌: ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. 

SGPGIMS Recruitment 2024: వివిధ విభాగాల్లో 400కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..
 

ఆఫీసర్‌ స్కేల్‌–1.. ప్రిలిమినరీ

  • ఆఫీసర్‌ స్కేల్‌–1 ప్రిలిమినరీ పరీక్ష.. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు–80 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు చొప్పున ఉంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు అనుమతిస్తారు.
  •     మెయిన్‌ ఎగ్జామినేషన్‌: ప్రిలిమినరీ పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌ సాధించిన వారికి రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షలో రీజనింగ్‌ 40 ప్రశ్నలు– 50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్‌ నుంచే ఆ విభాగం ప్రశ్నలు ఉంటాయి.

 

 

  •     మెయిన్‌ ఎగ్జామ్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున తుది దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

    BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

    ఆఫీసర్‌ స్కేల్‌– 2,3.. ఒకే రాత పరీక్ష
  •     ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరలిస్ట్, స్పెషలిస్ట్‌), ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్టులకు సింగిల్‌ లెవెల్‌ పరీక్ష పేరుతో ఒకే రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  •     ఆఫీసర్‌(జనరల్‌ బ్యాంకింగ్‌)పోస్ట్‌లకు రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు,ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌/హిందీ లాంగ్వేజ్‌ 40ప్రశ్నలు–40 మార్కు­లు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40 ప్రశ్నలు–50 మార్కులకు చొçప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  •     ఆఫీసర్‌ స్కేల్‌–2(స్పెషలిస్ట్‌ కేటగిరీ) పోస్ట్‌లకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–20 మార్కు­లు,కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కు­లు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40ప్రశ్నలు–40మార్కులకు చొప్పు న మొత్తం 200మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  •     ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్ట్‌లకు రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40 ప్రశ్నలు–50 మార్కులకు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
  •     అన్ని పోస్ట్‌లకు సంబంధించి పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి.
  •     రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తిలో(ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున) చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

High Court Recruitment 2024 Notification Out: డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. హైకోర్టులో ఉద్యోగాలు

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్‌ 27.
  •     ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌: జూలై/ఆగస్ట్‌.
  •     ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్ట్‌లో .
  •     మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/అక్టోబర్‌లో .
  •     ఇంటర్వ్యూల నిర్వహణ: నవంబర్‌లో.
  •     ప్రాథమిక నియామకాల ఖరారు: జనవరి 2025లో
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: www.ibps.in/index.php/rural-bank-xiii


రాత పరీక్షలో రాణించేలా
రీజనింగ్‌
ఇందులో రాణించడానికి కోడింగ్, డీకోడింగ్,సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇన్‌–ఈక్వాలిటీస్, ఆల్ఫాబెటికల్‌ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్, కా­జ్‌ అండ్‌ ఎఫెక్ట్స్, ఇన్‌పుట్‌–అవుట్‌పుట్స్‌ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. అధ్యయనంతోపాటు నిత్యం ప్రాక్టీస్‌కు సమయం కేటాయించాలి.

UPSC Exam: కానిస్టేబుల్‌ సురేష్‌కు సీఎం రేవంత్‌ అభినందన.. కారణం ఇదే..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉన్న విభాగం.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌. ఇందులో గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, సెంటెన్స్‌ కరెక్షన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఏదైనా ఇంగ్లిష్‌ పత్రికను రోజూ చదువుతూ రీడింగ్‌ వేగం పెంచుకోవడంతోపాటు వొకాబ్యులరీని మెరుగుపరచుకోవాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలో రాణించడానికి కరెంట్‌ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌ రంగ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు జాతీయ, అంతర్జాయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన ఘటనలు, తేదీలు, వ్యక్తుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌/డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

రెండు దశల రాత పరీక్షల్లోనూ ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. అర్థమెటిక్‌ అంశాలు, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి. చదవడంతోపాటు వేగంగా సమాధానం గుర్తించేలా ప్రాక్టీస్‌ చేయాలి. వేగం, కచ్చితత్వంతోనే ఇందులో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Gender Gap Report 2024: లింగ అంతర నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఇదే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌
ఆఫీసర్‌ స్కేల్‌–2 పోస్ట్‌లకు నిర్వహించే ఈ విభాగంలో మంచి మార్కుల కోసం అభ్యర్థులు తమ అకడమిక్‌ అర్హతలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా వాటిని సమకాలీన పరిస్థితులతో బేరీజు వేస్తూ అధ్యయనం చేయాలి.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ఈ విభాగంలో రాణించడానికి కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌(కీ బోర్డ్‌ షార్ట్‌ కట్స్, ఎంఎస్‌ ఆఫీస్, ఎంఎస్‌ ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తదితర అంశాలు)పై అవగాహన పెంచుకోవాలి. 

ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
ఆఫీసర్‌ స్కేల్‌–2, ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్ట్‌లకు ఉండే ఈ విభాగంలో స్కోర్‌ కోసం తాజా బ్యాంకింగ్‌ రంగ పరిణామాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

SGPGIMS Recruitment 2024: వివిధ విభాగాల్లో 400కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

Published date : 18 Jun 2024 06:29PM

Photo Stories