AP Inter Exams 2023 Results : ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..? ఈ సారి ఫలితాలను..
ఈ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యరు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇంటర్ ద్వితీయ విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను.. పరీక్షలు ముగిసిన 25 నుంచి 30 రోజులలోపు విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే మే రెండో వారంలోనే ఈ ఇంటర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలను విడుదల చేసిన వెంటనే https://results.sakshieducation.comలో చూసుకోవచ్చు
☛ NEET-UG 2023: నీట్-యూజీ.. ఇలా ఈజీ !
ఈ ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు..
మార్చి 27వ తేదీన జరిగిన ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షలో.. ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది.
Also Read: JEE (MAIN & ADV.) - MODEL PAPERS | GUIDANCE | PREVIOUS PAPERS (JEE MAIN) | PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | NEWS | VIDEOS
ఏపీ ఇంటర్ తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము..? అని రాగా.. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
చదవండి: JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..