JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..
Sakshi Education
దేశంలోనే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది.
2017 నుంచి 2022 వరకు గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఏటా మెయిన్ పరీక్షకు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు తగ్గిపోతున్నారు. జేఈఈ మెయిన్–2023ని జనవరి 26 నుంచి 31 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 12తో ముగిసింది. జేఈఈ మెయిన్‌కు 2017లో 11,86,454 మంది దరఖాస్తు చేయగా 2022లో ఆ సంఖ్య 10,26,799కు తగ్గింది. ఇక 2017లో 11,22,351 మంది పరీక్షకు హాజరు కాగా 2022 నాటికి వారి సంఖ్య 9,05,590కి పడిపోయింది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసిన వారి సంఖ్య తగ్గుతోందిలా..
ఏడాది |
శాతం |
2014 |
83.1 |
2015 |
79 |
2016 |
78.6 |
2017 |
77.4 |
2018 |
71.7 |
2019 |
71 |
2020 |
64 |
2021 |
60 |
2022 |
60 |
తగ్గుదలకు కారణాలెన్నో..
- ఐఐటీల్లో 16 వేల వరకు.. ఎన్ఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో మరో 30 వేల వరకు సీట్లు ఉన్నాయి.
- సీట్లకు పోటీ ఎక్కువ ఉండటంతో
- 50 శాతం మంది దరఖాస్తు చేశామనిపించుకోవడం తప్ప పరీక్షలకు అసలు సిద్ధం కావడం లేదు.
- ఇతర ప్రవేశ పరీక్షల కంటే జేఈఈ చాలా కఠినంగా ఉండడంతో విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోంది.
- జేఈఈతో పోలి్చతే ప్రైవేటు విద్యా సంస్థల పరీక్షలు సులువుగా ఉంటున్నాయి.
- దూరంగా ఉండే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో తమ పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.
- ఈసారి జేఈఈ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కావడం, విద్యార్థులు కోర్టును ఆశ్రయించినా వాయిదాకు కోర్టు అంగీకరించపోవడం నేపథ్యంలో ఈ ఏడాది కూడా పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉండొచ్చు.
- అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసిన వారిలో కూడా పరీక్ష రాస్తున్న వారు 80 శాతం లోపే ఉంటున్నారు.
సంవత్సరాలవారీగా జేఈఈ మెయిన్‌కు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, పరీక్షకు హాజరు ఇలా..
అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు, అందులో అర్హత సాధించినవారు ఇలా..
Published date : 20 Jan 2023 05:15PM