Inter Results: ఫ్లెక్సీల పైకి.. ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ!
Sakshi Education
పిఠాపురం: ర్యాంకులు అంటే ప్రైవేటు విద్యా సంస్థలకే సాధ్యం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సర్కారు బడిలోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభను చాటుతూ గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
ఎంతలా అంటే ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేసేంతలా. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ప్రభుత్వ విద్యా సంస్థలు సైతం తమ ఘనతను చాటుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫొటోలు, వారి మార్కులతో కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.