Free Bus Travel: పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉచిన ప్రయాణ సౌకర్యం
పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రమైన పాడేరులో పొగమంచు దట్టంగా కురవడమే కాకుండా చలిగాలులు వీయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది.
Intermediate Exams: శుక్రవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
జిల్లాలో 27 కేంద్రాల్లో నిర్వహించిన ఫస్టియర్ పరీక్షకు 7759 మంది హాల్ టికెట్ పొందగా, 7,191 మంది పరీక్ష రాయగా 92.67 హాజరు శాతం నమోదైంది. 568 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఇలావుండగా శనివారం జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5845 మంది హాల్ టికెట్లు పొందారని ఇంటర్‌బోర్డు జిల్లా పర్యవేక్షకుడు వినోద్‌బాబు తెలిపారు.
Awareness on Employment: చదువుతోపాటు ఉపాధి అవకాశాలపై అవగాహన ఉండాలి