Awareness on Employment: చదువుతోపాటు ఉపాధి అవకాశాలపై అవగాహన ఉండాలి
పాడేరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలపై అవగాహన పొంది భవిష్యత్తులో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు కోరారు. స్థానిక తలారిసింగి పాఠశాలలో ఎంటర్‌ప్రైన్యూర్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం నిర్వహించారు.
IB Syllabus: విద్యార్థులకు ఒకటో తరగతి నుంచే ఐబీ సిలబస్
జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరిశ్రమలకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన డీఈవో వారిని అభినందించారు. మొదటి బహుమతి జోలాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ద్వితీయ బహుమతి రాజవొమ్మంగి మండలం సింగంపల్లి జడ్డంగి గిరిజన సంక్షేమ పాఠశాలకు లభించాయి.
Intermediate Exams: శుక్రవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
ఈ రెండు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్టు డీఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, రామారావు,శ ర్మ, ఎండీపీ చెల్లయ్య, జోనల్ మేనేజర్ చాగంటి బ్రహ్మం, ఎంఈవో రామచంద్రరావు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు
Academy of Sciences: సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి