Academy of Sciences: సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మార్చి 1న కళాశాల కరస్పాండెంట్ గుర్రం రవీందర్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఙానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ రవీందర్, జోనల్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ కిషన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను పరిశీలించారు.
చదవండి: Ambitio Platform: విద్యార్థులకు ధైర్యం ఇస్తూ.. విశ్వ విద్యాలయాలకు దారి చూపుతున్నది వీరే..
ఈ సందర్భంగా ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. విజ్ఙానశాస్త్రం ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అక్కడ మూఢనమ్మకాలు దూరమవుతాయన్నారు. వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించినవి అందుబాటులో లేని రోజుల్లో సీవీ రామన్ దేశంలో పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి సాధించారని వివరించారు. నిత్య జీవితంలో ఉపయోగిస్తున్న వస్తువులన్నీ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లెక్చరర్లు రాజేష్‌కుమార్, భూపాల్‌రెడ్డి, ఉదయలక్ష్మి, మమత, రాజు, ప్రవీణ్, మొగిలి, రాజశేఖర్, నరేష్ పాల్గొన్నారు.