Ambitio Platform: విశ్వ విద్యాలయాలకు దారి చూపుతున్న ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్!!
ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్‌ఫామ్‌లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.
ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్.. మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు.
కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు.
Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..
కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి.. మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్‌విక్ బిజినెస్ స్కూల్‌లో ప్రవేశం దొరికింది.
‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ ఎలా ఉపకరిస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటలు ఇవే..
‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్‌డ్ రికమండేషన్‌లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది.
‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’.
ఏంజెల్ ఇన్వెస్టర్‌ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అని కౌశిక్ అంటున్నాడు.