Intermediate Exams: శుక్రవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
రాయచోటి: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో 14,194 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. వీరిలో 13,528 మంది హాజరుకాగా 666 మంది గైర్హాజరయ్యారు. దీంతో 95 శాతం విద్యార్థులు పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖఅధికారి కృష్ణయ్య చెప్పారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1298 మందికి 1181 మంది శుక్రవారం పరీక్షలు రాశారు.
Gurukula Admissions: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం..
పరీక్ష కేంద్రాలలో 54 మంది చీఫ్ సూపరింటెండెంట్, 54 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 9 మంది కస్టోడియన్స్, స్క్వాడ్ అసిస్టెంట్, చీఫ్ సూపరింటెండెంట్‌లు పరీక్షలను పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం ద్వితీయ సంవత్సరం పరీక్షకు 15056 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు.