Gurukula Admissions: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం..
తుమ్మపాల: ఏప్రిల్ 25న జరిగే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ చెప్పారు. డీఈవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సంస్థ పోస్టర్‌ను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు.
Exams In March 2024: మార్చి నెల మొత్తం పరీక్షల కాలమే, ముఖ్యమైన తేదీలు ఇవే..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకులాల్లో విలువలతో కూడిన విద్య, ఉచిత వసతి, సంరక్షణ, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. ఉన్నత పాఠశాల విద్యకు ఏపీఆర్‌జే కేట్ ఇంటర్మీడియేట్, డిగ్రీలకు ఏపీఆర్‌జేసీ డీసీ సెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 1 నుంచి 31 వరకు http://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్షలు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో జరుగుతాయని వెల్లడించారు.
Jagananna Vidhyadeevena: పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం విద్యాదీవెన పథకం
నర్సీపట్నం ఏపీఆర్‌జేసీ (బాలురు) ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నర్సీపట్నంలో బాలుర, విజయనగరం జిల్లా తాటిపూడిలో బాలికల విద్యాలయాలు ఉన్నాయన్నారు. నర్సీపట్నంలోని బాలుర గురుకుల విద్యాలయంలో 5వ తరగతిలో ప్రవేశానికి 80 సీట్లు, 6, 7, 8 తరగతులకు ఖాళీలను బట్టి సీట్లు ఉంటాయన్నారు.
ఏపీఆర్‌జే కేట్ పరీక్షలు ఉదయం, ఏపీఆర్జేసీ డీసీ సెట్ పరీక్షలు మధ్యాహ్నం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపూడి ప్రిన్సిపాల్ డి.ప్రమీలాదేవి పాల్గొన్నారు.