Skip to main content

Jagananna Vidhyadeevena: పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం విద్యాదీవెన పథకం

విద్యాదీవెన పథకంతో తల్లుల బ్యాంకు ఖాతాలలో శుక్రవారం నగదు జమ చేశారు. జారీ చేసిన పథకం వివరాలను అధికారులు వెల్లడించారు..
 Collector Ravi Pattanshetty presenting educational allowance checks to students   Jagananna Vidhyadeevena scheme for poor students to go with higher studies

తుమ్మపాల: జిల్లాలో 39,773 మంది విద్యార్థులకు 26 కోట్ల 54 లక్షల 2 వేల 727 రూపాయల విద్యాదీవెన నగదును వారి తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విద్యాదీవెన కార్యక్రమంలో నమూనా చెక్కును కలెక్టర్‌ విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల ఫీజుల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

Inter & 10th Class Model Papers: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. మోడల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

ఈ పథకాన్ని వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బి.వరాహ సత్యవతి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాదీవెన పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మీరందరూ పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరడమే జగనన్నకు చెప్పే కృతజ్ఞత అన్నారు.

AP Intermediate Exams: ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య ఇది..

అంతకుముందు కృష్ణా జిల్లా పామర్రు నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నగదు పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ కె.రాజేశ్వరి, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ అజయ్‌బాబు, ఏటీడబ్ల్యూవో నాగశిరీష, పాల్గొన్నారు.

AP Education Scheme: విద్యార్థులకు విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల..

Published date : 02 Mar 2024 05:45PM

Photo Stories